breaking news
curtain
-
26న మెట్రో సేవల నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ : గణతంత్ర వేడుకల సందర్భంగా ఈనెల 26న ఢిల్లీ మెట్రో రైలు సర్వీసులకు కొన్ని చోట్ల పాక్షికంగా విఘాతం కలగనుందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఢిల్లీ పోలీసుల సూచనలకు అనుగుణంగా మెట్రో సేవలను భద్రతా కారణాల దృష్ట్యా పాక్షికంగా నిలిపివేస్తామని మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. లైన్ 2లో (హుడా సిటీ సెంటర్ -సమయ్‌పూర్ బద్లి) లైన్ 6లో (కశ్మీరీ గేట్-రాజ నహర్ సింగ్) రూట్లలో స్వల్ప మార్పులు చేశామని వెల్లడించింది. ఆయా రూట్లలో పలు మెట్రో స్టేషన్లను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మూసివేయనున్నట్టు తెలిపింది. ఇక పటేల్ చౌక్, లోక్‌కళ్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను ఉదయం 8.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మూసివేయనున్నట్టు వెల్లడించింది. కాగా మెట్రో పార్కింగ్ సదుపాయాలన్నీ ఈనెల 25న ఉదయం ఆరు గంటల నుంచి 26 మధ్యాహ్నం 2 గంటల వరకూ మూసివేస్తారని తెలిపింది. -
గది విశాలంగా కనిపించాలంటే!
సాక్షి, హైదరాబాద్: చిన్న గది.. ఆ ఇరుకుతనం మనసుకు చికాకును తెప్పిస్తుంది. అలా అని బాధపడక్కర్లేదు. ఎత్తు తక్కువగా ఉన్న వారు పొడవాటి చారలున్న దుస్తువులు వేసుకుంటే ఎలాగైతే పొడుగ్గా కనిపిస్తారో.. ఇల్లూ అంతే! అంటే ఇంట్లోని పరదా, తివారీ, సోఫా కవర్ వంటివి పొడవాటి చారలున్నవి ఎంచుకుంటే సరిపోతుంది. అవే చిన్న గదిని విశాలంటే కనిపించేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని చిట్కాలివిగో.. ♦ ఒకవేళ ఆ గదిలోని కిటికీ చిన్నదయినా సరే.. పరదాలు తప్పనిరైతే మాత్రం అవి పై నుంచి వెడల్పుగా, కిందకు జాలువారేలా ఉండేలా చూసుకోవాలి. గోడల రంగులకు నప్పేట్టు చూసుకుంటే గది వెడల్పుగా కనిపిస్తుంది. ♦ చిన్న గదిలో ఓ గోడకు పెద్ద అద్దాన్ని అమర్చండి. అద్దం కృత్రిమ, సహజ వెలుతురిని ప్రతిబింబిస్తుంది. దీంతో గది ఇంకా ప్రకాశవంతంగా, పెద్దగా కనిపిస్తుంది. ♦ ఇంట్లో అక్కడక్కడ అంతగా ఉపయోగపడని వస్తువులుండటం సర్వసాధారణం. అలా ఉపయోపగపడని వస్తువులను ఎప్పటికప్పుడు తీసేయడం తప్పనిసరి. పత్రికలు, పుస్తకాల్లాంటివి ఎక్కడపడితే అక్కడ కుప్పలు కుప్పలుగా పడేయకుండా పొందిగ్గా చిన్న అల్మరాలు ఎంచుకుని వాటిలో సర్దుకోవాలి. ♦ గది కాస్త పెద్దదిగా కనిపించాలంటే గోడలకు లేత చాయల్లో పెయింట్లు వేసుకోవాలి. అలాగే ఇంటి పైకప్పు పైనా ఆకట్టుకునే డిజైన్లను పెయింట్‌లా వేయించాలి. లేదంటే వాల్ పేపర్ అయినా అతికించాలి. ఆ గదిలోకి వచ్చేవారి దృష్టి దానిపై పడుతుంది. గది విశాలంటే ఉన్నట్టూ కనిపిస్తుంది. పువ్వుల వాల్‌పేపర్ అయితే అదనపు ఆకర్షణ. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com