breaking news
controversial statements
-
గాజాపై ట్రంప్ కన్ను
వాషింగ్టన్: సంచలనాల ట్రంప్ మరో అంతర్జాతీయ సమాజంపై మరో బాంబు విసిరారు. గాజాను అమెరికా పూర్తిగా స్వా«దీనం చేసుకుంటుందని ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్‌తో యుద్ధంలో శ్మశానసదృశంగా మారిన గాజాను అత్యంత సుందర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలు చేపడతాం. భారీగా ఆవాస, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. గాజాలో ఉంటున్న దాదాపు 20 లక్షల మంది పాలస్తీనావాసులు ఆ ప్రాంతాన్ని వీడాల్సిందేనని స్పష్టం చేశారు. వారిని గాజా నుంచి శాశ్వతంగా తరలించి పునరావాసం కల్పిస్తామన్నారు. అయితే, పశ్చిమాసియాలోని పొరుగు దేశాలే వారిని అక్కున చేర్చుకోవాలని తేల్చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సమక్షంలోనే ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేయడం విశేషం. పాలస్తీనావాసులను గాజా నుంచి తరలించేందుకు, ఆ ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకునేందుకు అమెరికాకు ఏం అధికారముందని ప్రశ్నించగా తన చర్య గాజా, ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా అంతటికీ గొప్ప స్థిరత్వాన్ని తెస్తుందని ఆయన బదులిచ్చారు. గాజా స్వా«దీనానికి సైన్యాన్ని రంగంలోకి దించుతారా అని ప్రశ్నించగా, అన్ని అవకాశాలనూ పరిశీలిస్తామని బదులిచ్చారు. ఈ సందర్భంగా నెతన్యాహూ పదేపదే చిరునవ్వులు చిందిస్తూ కన్పించారు. ట్రంప్ ప్రకటనకు పూర్తి మద్దతు తెలిపారు. ‘‘ఈ నిర్ణయం చరిత్రను మార్చేస్తుంది. గాజాకు అద్భుతమైన భవిష్యత్తు అందిస్తుంది. ఇజ్రాయెల్‌కు ముప్పును శాశ్వతంగా తొలగిస్తుంది’’ అని ప్రకటించారు. ట్రంప్ ప్రకటన అంతర్జాతీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. పశ్చిమాసియా భౌగోళిక, రాజకీయ పరిస్థితులను అల్లకల్లోలం చేసేలా కనిపిస్తున్న ఈ ప్రతిపాదనను అక్కడి దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. పాలస్తీనా, సౌదీ అరేబియా, ఈజిప్‌్ట, తుర్కియేతో పాటు చైనా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ కూడా దీన్ని ఖండించాయి. అమెరికాలో విపక్ష నేతలు కూడా ట్రంప్ ప్రకటనను దుయ్యబడుతున్నారు. గాజావాసులకు తమ దేశంలో ఆశ్రయం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఈజిప్‌్ట, జోర్డాన్, తుర్కియే తదితర అమెరికా మిత్ర దేశాలన్నీ ఇప్పటికే ముక్త కంఠంతో తిరస్కరించడం తెలిసిందే. గ్రీన్‌లాండ్‌ను, పనామా కాల్వను స్వా«దీనం చేసుకుంటానని, కెనడాను అమెరికాలో కలిపేస్తానని ట్రంప్ ఇప్పటికే పలు వివాదాస్పద ప్రకటనలు చేశారు. అంతర్జాతీయ ప్రాంతంగా గాజా అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహూతో ట్రంప్ మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ఆకస్మికంగా గాజా స్వా«దీన ప్రకటన చేశారు. దీన్ని పశ్చిమాసియా గర్వించదగ్గ విషయంగా అభివరి్ణంచారు. ‘‘పశ్చిమాసియా నమ్మశక్యం కానంత గొప్ప ప్రదేశం. అద్భుతమైన తీర ప్రాంతం. గొప్ప వ్యక్తులతో నిండిన అందమైన ప్రదేశాల్లో ఒకటి. గాజాలో త్వరలో పర్యటిస్తా. ఇజ్రాయెల్ అంటే నాకిష్టం. అక్కడ, సౌదీ అరేబియాలో, పశ్చిమాసియా అంతటా పర్యటిస్తా. గాజాలో ఇప్పుడేమీ మిగల్లేదు. ఆ ప్రాంతమంతా మృత్యువుకు, విధ్వంసానికి చిరునామాగా, నరకకూపంగా మారింది. ప్రతి భవనమూ నేలమట్టమైంది. చిరకాలంగా శప్తభూమిగా ఉన్న గాజాను పూర్తిగా పునరి్నరి్మస్తాం. పేలని బాంబులు, ఆయుధాలను తొలగిస్తాం. ధ్వంసమైన భవనాలను తొలగించి ఆ ప్రాంతాన్నంతా చదును చేస్తాం. అక్కడ అపరిమితమైన ఉద్యోగాలందించేలా అద్భుతమైన ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తాం. గాజావాసుల జీవన స్థితిగతులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. ఏ ఒక్క సమూహానికో కాకుండా అందరికీ అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పాలస్తీనావాసులతో పాటు ప్రపంచం నలుమూలలకు చెందిన ప్రజలు అక్కడ నివసిస్తారు. లేదంటే ఆ ప్రాంతం వందల ఏళ్లుగా ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఏదైనా డిఫరెంట్‌గా చేయాలి. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అది పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఏదైనా అద్భుతం చేయడానికి మాకు అవకాశముంది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ఇదేమీ అల్లాటప్పగా తీసుకున్న నిర్ణయం కాదు. దీనిపై చాలా ప్రముఖులు, ముఖ్యులతో లోతుగా చర్చించా. వారంతా నా ప్రతిపాదనను అమితంగా ఇష్టపడ్డారు. గాజాను సొంతం చేసుకుని అభివృద్ధి చేసి అపారమైన ఉపాధి అవకాశాలు సృష్టించాలన్న అమెరికా ఆలోచనలను ఇష్టపడుతున్నారు’’ అని చెప్పారు. ‘‘గాజాలో దశాబ్దాలుగా మరణమృదంగం కొనసాగుతోంది. చంపుకోవడాలు లేకుండా ఆనందంగా ఉండగలిగే అందమైన ప్రదేశంలో వారికి శాశ్వతంగా పునరావాసం కల్పించగలిగితే చాలు. మరో దారి లేకే వారు గాజాకు తిరిగి వెళ్తున్నారు. ఎప్పుడు కూలతాయో తెలియని పై కప్పుల కింద బతుకీడుస్తున్నారు. దానికి బదులుగా అందమైన ఇళ్లలో సురక్షితంగా, స్వేచ్ఛగా, శాంతియుతంగా జీవించే అవకాశం వారి ముందుంది. ఆ మేరకు చక్కని పునరావాసం పొందగలరని, ఇప్పుడు వద్దంటున్న దేశాల్లోనే వారికి ఆ సదుపాయం ఏర్పాటు చేయగలనని నమ్ముతున్నా’’ అని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనుసరించదగ్గ మార్గం ఇదేనని నెతన్యాహూ అభిప్రాయపడ్డారు. ‘‘హమాస్‌ను నిర్మూలించాలన్న మా లక్ష్యాలను సాధించడానికి ట్రంప్ కొత్త ఆలోచనలతో ముందుకొచ్చారు. ఇది యూదు జాతికి సాయపడుతుంది’’ అని చెప్పారు. ‘‘ఉగ్రవాదానికి కేంద్రబిందువుగా ఉన్న గాజాకు భిన్నమైన భవిష్యత్తును ట్రంప్ కాంక్షిస్తున్నారు. హంతక సంస్థ (హమాస్)ను నిర్మూలిస్తే అక్కడ శాంతి సాధ్యమే’’ అన్నారు. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందో లేదో చెప్పలేనన్నారు. బైడెన్ ప్రభుత్వం తమకు పెద్దగా సాయం చేయలేదని నెతన్యాహూ ఆక్షేపించారు. గాజాను వీడబోం: స్థానికులు ట్రంప్ ప్రతిపాదనపై గాజా పౌరులు మండిపడుతున్నారు. ‘‘ఇన్నాళ్లకు కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత సొంత గూటికి తిరిగి వెళ్తున్నాం. మా ఇళ్లను విడిచిపెట్టబోం. గౌరవప్రదమైన జీవితం కోరుకుంటున్నాం. మా నేతలను వీడాలనుకోవడం లేదు’’ అని చెబుతున్నారు. ట్రంప్ ప్రతిపాదన గాజాతో పాటు పరిసర దేశాల్లో మరింత విధ్వంసానికి, ఘర్షణకు కారణమవుతుందని వారంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయకుండా ఇజ్రాయెల్‌తో ఎలాంటి సంబంధాలను కొనసాగించబోమని స్పష్టం చేసింది. గాజన్లు తమ ఇళ్లకు తిరిగి వచ్చి పునరి్నరి్మంచాలని కోరుకుంటున్నారని ఐరాసలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ అన్నారు. వారి ఆకాంక్షలను గౌరవించాలన్నారు. ట్రంప్‌ది హాస్యాస్పద, అసంబద్ధ ప్రకటన అని హమాస్ దుయ్యబట్టింది. ‘‘ఈ తరహా ఆలోచనలు పశ్చిమాసియాలో మరిన్ని ఘర్షణలకు దారితీస్తాయి. గాజావాసులకు సమీప దేశాల్లో పునరావాసం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదన మరింత గందరగోళం, ఉద్రిక్తతలకు కారణమవుతుంది. గాజావాసులు దీనికి ఒప్పుకోరు’’ అని హమాస్ అధికారి సమీ అబు స్పష్టం చేశారు.అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగాట్రంప్ గాజా ప్రణాళిక గాజాను పునరి్నర్మించాలంటూ పది రోజుల క్రితమే పిలుపునిచ్చిన ట్రంప్ ఆ విషయమై ఎంత సీరియస్‌గా ఉన్నారో తాజా ప్రకటనతో ప్రపంచానికి తెలిసొచి్చంది. కానీ అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా విరుద్ధమైన ఆయన గాజా ప్రణాళిక పశ్చిమాసియాను అతలాకుతలం చేయడమే గాక ప్రపంచ శాంతికి గొడ్డలిపెట్టుగా మారేలా కనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం, ఇజ్రాయెల్–హమాస్ పరస్పర బందీల విడుదల ప్రక్రియపైనా ప్రభావం చూపేలా ఉంది. ఒక దేశ జనాభాను బలవంతంగా నిరాశ్రయులను చేయడం అంతర్జాతీయ చట్టం ప్రకారం నిషేధం. ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనియన్లను తరిమేసి గాజాను యూదు స్థావరంగా మార్చుకోవాలని ఆశపడుతోంది. ట్రంప్ ప్రకటన కార్యరూపం దాలిస్తే 20 లక్షల మంది పాలస్తీనావాసులు శాశ్వత శరణార్థులుగా మారిపోతారు. -
బీజేపీ సంచలన నిర్ణయం.. సీనియర్ నేతకు బిగ్ షాక్!
బీజేపీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాషాయ నేతపై వేటు వేసింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. కాగా, ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ కార్యక్రమంలో బీజేపీ నేత ప్రీతం సింగ్ లోధీ మాట్లాడుతూ.. బ్రాహ్మణులు మతం పేరుతో ప్రజలను మోసగించి, వేధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల డబ్బు, వనరులతో బ్రాహ్మణులు సంపద కూడబెట్టుకుంటున్నారని ఆరోపించారు. మహిళల పట్ల కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో సొంత పార్టీకి చెందిన ప్రవీణ్ మిశ్రా ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ అధిష్టానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రీతం సింగ్ లోధీ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ.. అతడిపై వేటు వేసింది. బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. కాగా, మాజీ సీఎం ఉమాభారతికి అత్యంత సన్నిహితుడైన ప్రీతం సింగ్ లోధీ..శివ్‌పూరి జిల్లా పిచ్చోర్ స్థానం నుంచి 2013,2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. #MadhyaPradesh: Insult of #Brahmins by #BJP leader Pritam Singh Lodhi in Shivpuri. #Trending #Viralvideo #India pic.twitter.com/VelePtoYHl — IndiaObservers (@IndiaObservers) August 19, 2022 ఇది కూడా చదవండి: బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు -
వరిపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
-
మంత్రి దేవినేని వివాదాస్పద వ్యాఖ్యలు
నందిగామ: ‘‘పశ్చిమ కృష్ణా ప్రాంతంలో రైతులు 45 వేల ఎకరాల్లో సుబాబుల్ పంట వేశారు. వరి ఎలాగైతే సోమరిపోతు పంటో సుబాబుల్ కూడా అలాంటిదే. మనకు గతి లేక, మరో పంట పండక, నీటి ఎద్దడి వల్ల సుబాబుల్ పంటకు అలవాటుపడ్డాం. రైతులు సుబా బుల్ నుంచి బయటకు వచ్చి వాణిజ్య పంటలపై దృష్టి పెట్టాలి’’ అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కృష్ణా జిల్లా నందిగామలో నూతన పోలీసుస్టేషన్ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి మంత్రి చినరాజప్ప, మంత్రి దేవినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా వరి, సుబాబుల్ పంటల గురించి దేవినేని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శాంతి భద్రతలను అదుపులో ఉంచుతున్నామని చినరాజప్ప చెప్పారు. వ్యవసాయం, రైతులంటే టీడీపీకి చిన్నచూపే : ఎంవీఎస్ నాగిరెడ్డి సాక్షి, అమరావతి/విజయవాడ సిటీ: వరి, సుబాబుల్ పంటల రైతులపై రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఖండించారు. ‘‘రైతుల పట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి ఎప్పుడూ చిన్నచూపే. వ్యవసాయం దండుగని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం మర్చిపోలేం. ఇప్పుడు ఆయన మంత్రివర్గంలోని దేవినేనిఉమ వరి సాగుదారులను సోమరిపోతులు అనడం దారుణం. మొత్తం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఏపీలో వరి ప్రధాన పంటగా ఉంది. కృష్ణా–గోదావరి కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాతో ఏపీని అన్నపూర్ణగా, దక్షిణభారత ధాన్యాగారంగా పిలుస్తారు. ఏపీలో 90శాతం మంది వరి అన్నం తింటారు. వ్యవసాయం, రైతుల గురించి మాట్లాడేటప్పడు ఎవరికైనా ఇంగితజ్ఞానం ఉండాలి. సాగునీటి ప్రాజెక్టుల పేరిట ధనదోపిడీ కొనసాగించడం తప్ప రైతుల పట్ల గౌరవం, వ్యవసాయం రంగం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు’’ అని తీవ్రంగా విమర్శించారు. -
భారత సైన్యంపై ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు
ఉడీ ఘటన అనంతరం పాకిస్తాన్ నటులపై భారత్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(ఐఎమ్పీపీఏ) విధించిన నిషేధ నేపథ్యంలో ప్రముఖ నటుడు ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉడీ ఘటనలో అమరవీరులైన భారత సైన్యంపై ఆయన అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదం రాజుకున్నాయి. పాకిస్తానీ నటులపై ఐఎమ్పీపీఏ తీసుకున్న నిషేధంపై ఓ ప్రముఖ న్యూస్ చానల్ చర్చ నిర్వహించింది. ఆ చర్చలో ఉడీ ఉగ్రదాడిలో అసువులు బాసిన 18 వీర జవాన్లపై ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓం పురి చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి.." ఎవరు వారిని(భారత సైన్యాన్ని) ఆర్మీలో చేరమన్నారు? ఎవరు వారిని ఆయుధాలు పట్టుకోమన్నారు. మేమేమి జవాన్లను ఆర్మీలో చేరమని చెప్పలేదుగా.15 నుంచి 20 మానవ బాంబులు తయారుచేయండి. పాకిస్తాన్‌ను పేల్చడానికి వాటిని వాడండి. ఇజ్రాయిల్, పాలస్తీనా మాదిరి భారత్-పాకిస్తాన్‌లు కూడా యుగయుగాలుగా శత్రువులుగా మారలనుకుంటున్నారా? కోట్లమంది ముస్లింలకు భారత్ పుట్టినిల్లు. భారత్-పాకిస్తాన్ విభజన అంటే కేవలం దేశాల విభజనే మాత్రమే కాదు, కుటుంబాలు విడిపోవడం కూడా. భారతీయుల కుటుంబసభ్యులు అక్కడ ఉన్నారు. అక్కడ వారు ఇక్కడా ఉన్నారు. సరిహద్దు కుటుంబాలు ఎలా యుద్ధం చేసుకుంటారు?. పాకిస్తాన్ నటులను, సెలబ్రిటీలపై నిజంగా నిషేధం విధించాలంటే, భారత ప్రభుత్వాన్ని వారి వీసాలు రద్దు చేయమనండి" అంటూ న్యూస్ చానల్ చర్చా కార్యక్రమంలో రెచ్చిపోయారు. ముందు కూడా పాకిస్తాన్ నటులకు ఆయన మద్దతిచ్చారు. వాలిడ్ వీసాతో వారు ఇక్కడ పనిచేస్తున్నారని, వారిని నిషేధించడం సరికాదన్నారు. పాకిస్తానీ నటులపై నిషేధం, పరిస్థితుల్లో మార్పు తేవన్నారు. దీంతో ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.