breaking news
Contractor killed
-
ఛత్తీస్‌గఢ్‌లో మావోల ఘాతుకం
చర్ల/పర్ణశాల: ఛత్తీస్‌గఢ్‌లో తమ హెచ్చరికలను పట్టించుకోకుండా రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ హరిశంకర్ సాహూను మావోయిస్టులు హతమార్చారు. ఈ ఘటన సుక్మా జిల్లాలో గురువారం జరిగింది. దోర్నపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇప్పనపల్లి గ్రామం దగ్గర మిస్మా–చిరోర్డ్‌గూడ రోడ్డు పనులను ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం కింద చేపట్టారు. ఏడాది క్రితమే పనులు మొదలైనా మావోల హెచ్చరికలతో నిలిపివేశారు. కాగా, కాంట్రాక్టర్ ఆ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం మళ్లీ ప్రారంభించారు. దీంతో గురువారం ఉదయం సాయుధులైన దాదాపు డజను మంది మావోయిస్టులు రోడ్డు నిర్మాణప్రాంతానికొచ్చి పనులు ఆపేయాలని అక్కడి కార్మికులను బెదిరించారు. అక్కడే ఉన్న హరిశంకర్‌ను తలపై పదునైన ఆయుధాలతో కొట్టి చంపారు. హరిశంకర్ ఎస్యూవీ వాహనం, మరో ఐదు వాహనాలను తగలబెట్టారు. రోడ్డు పనులకు వాడుతున్న ట్రక్కులు, రోడ్డు రోలర్లనూ దహనం చేశారు. -
బొలేరోను ఢీకొన్న లారీ : కాంట్రాక్టర్ మృతి
చిత్తూరు జిల్లా పాకాల మండలం పదిపెట్లబైలు వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బొలేరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఆ ఘటనలో బొలేరోలో ప్రయాణిస్తున్న కాంట్రాక్టర్ మల్లిఖార్జున నాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అదే రహదారిలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి గాయపడిన మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మల్లిఖార్జున నాయుడు మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. మృతుడు మల్లిఖార్జున నాయుడు రొంపిచర్ల మండలం దద్దాలవారిపల్లెకు చెందిన వారని పోలీసులు తెలిపారు. -
అల్లుడే సూత్రధారి
ఐడీఏ బొల్లారం రోడ్, న్యూస్‌లైన్: సివిల్ కాంట్రాక్టర్ హనుమంతు హత్య కేసును ఐడీఏ బొల్లారం పోలీ సులు ఛేదించారు. వ్యాపార వివాదాల నేపథ్యంలోనే మేనేల్లుడే అతడిని సుపారీ హత్య చేయించినట్టు నిర్ధారించారు. సూత్రధారితో పాటు హత్యలో పాల్గొన్న నలుగురిని అరెస్టు చే సి రిమాండ్‌కు తరలించారు. బుధవారం ఐడీఏ బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలో రామచంద్రాపురం డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... బొల్లారం పారిశ్రామికవాడకు చెందిన యాదయ్య సివిల్ కాంట్రాక్టర్. ఇతని మేనమాన హనుమంతు కూడా సివిల్ కాంట్రాక్టర్. ఇద్దరి మధ్య వ్యాపారంలో పోటీ మొదలైంది. అల్లుడి కంటే తక్కువ రేట్ కోడ్ చేసి అతనికి వచ్చే పనులను హనుమంతు దక్కిం చుకొనేవాడు. దీంతో యాదయ్య ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో మామను అడ్డు తొలగించుకోవాలని గతేడాది ఆగస్టులో అమీన్పూర్ సమీపంలో యాద య్య హత్యాయత్నం చేయగా...తీవ్రగాయాలకు గురైన హనుమంతు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. బాధితుడు ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేసి.. తన మకాంను ఉప్పల్‌కు మార్చాడు. ఆ తర్వాత సుల్తాన్పూర్ కు చెందిన రాజు ఇద్దరి మధ్య రాజీ కు దిర్చాడు. అయితే, అల్లుడితో ఎప్పటికైనా ప్రాణహాని తప్పదనే ఉద్దేశంతో అతడిని హత్య చేస్తే ఒక షట్టర్‌తో పాటు రూ. 2 లక్షల సుపారీ ఇస్తానని హనుమంతు.. రాజుకు ఆఫర్ ఇచ్చాడు. యాదయ్యను చంపేందుకు బీహార్ నుంచి తుపాకీ తె స్తానని చెప్పి రాజు రూ.50 వేలు అడ్వా న్స్ తీసుకొని ఓల్డ్‌సిటీ నుంచి రూ. 2,500లతో బొమ్మ తుపాకీ కొన్నాడు. ఆ తర్వాత రాజు.. యాదయ్యను కలిసి హనుమంతు సుపారీ ఇచ్చిన విషయం చెప్పాడు. అయితే, తన మామనే చంపితే రూ. 12 లక్షలు సుపారీ ఇస్తానని యా ద య్య అన్నాడు. అంతేగాక రాజుకు రూ.80 వేలు అడ్వాన్స్ ఇచ్చాడు. హనుమంతు హత్యకు పథకం వేసిన రాజు సిద్దిపేటకు చెందిన తన స్నేహితుడు ర మేష్‌రెడ్డి, వరంగల్‌కు చెందిన సంజీవరెడ్డిలను ఆగస్టు 15న బాచుపల్లికి రప్పిం చాడు. హనుమంతుకు ఫోన్ చేసి.. యా దయ్యను చంపేశానని, తన వద్దకు రావాలని చెప్పాడు. తర్వాత హనుమంతు బొలేరో వాహనంలో నలుగురూ సిద్దిపేటలోని అతని సైట్‌కు వెళ్లారు. యాద య్య మృతదేహం బొమ్మనకుం టలోని కోళ్లఫారంలో ఉందని అక్కడికి తీసుకెళ్లారు. నలుగురూ మద్యం తాగారు. ఆ తర్వాత రాజు, రమేష్‌రెడ్డి, సంజీవరెడ్డితో పాటు కోళ్లఫారంలో పని చేసే నర్సిం హులు కలిసి కండువాలతో హనుమంతకు ఉరేసి చంపేశారు. శవాన్ని అతని వాహనంలోనే సుల్తాన్పూర్ సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్‌రోడ్డు వద్దకు తీసుకొచ్చారు. ప్రమాదం లో చనిపోయినట్టు చిత్రీకరించేందుకు హనుమంతు శవాన్ని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి కల్వర్టు సమీపంలోని ఎత్తై ప్రదేశం నుంచి కిందకి తోసేశారు. హత్యగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సూత్రధారి యాదయ్యతో పాటు రాజు, రమేష్‌రెడ్డి, సంజీవరెడ్డి, నర్సిం హులును అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బొమ్మ తుపాకీ, రూ. 80 వేల నగ దు, హత్యకు ఉపయోగించిన కండువాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులు రాజు, రమేష్‌రెడ్డి, సంజీవరెడ్డిలకు నేరచరిత్ర ఉందని వీరికి జైల్లో పరిచయం ఏర్పడిందని పోలీసులు చెప్పారు.