breaking news
confession statement
-
ముంబై ఉగ్ర దాడులను ప్రత్యక్షంగా పర్యవేక్షించా
ముంబై: పదహారేళ్ల క్రితం ముంబైలో పాక్ ప్రేరేపిత లష్కరే తొయిబా ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం వెనక తన పాత్ర ఉందని ఆ దేశానికి చెందిన ఉగ్రవాది తహవ్వుర్ హుస్సేన్ రాణా అంగీకరించాడు. ఆ క్రమంలో పలు సంచలన విషయాలు వెల్లడించాడు. ‘‘ముంబై దాడుల వెనక పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ హస్తముంది. నేను ముంబైలోనే ఉండి దాడులను పర్యవేక్షించా. పథకం ప్రకారమే ఆనాడు ముంబైలో ఉన్నా. భారత్‌లో ఉంటూ పాక్‌కు, ఆ దేశ సైన్యానికి నమ్మకమైన ఏజెంట్‌గా పనిచేశా’’అని విచారణలో వెల్లడించాడు. కెనడా పౌరసత్వం, పాక్ మూలాలున్న రాణాను అమెరికా అరెస్టు చేసి విచారణ నిమిత్తం భారత్‌కు అప్పగించడం తెలిసిందే. తిహార్ జైలులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో ఉన్న రాణాను తాజాగా ముంబై క్రైం బ్రాంచ్ దర్యాప్తు నిపుణులు ప్రశి్నస్తున్నారు. ఈ క్రమంలో అతను పలు సంచలన విషయాలను వెల్లడించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. పక్కాగా లక్ష్యాల ఎంపిక తన చిన్ననాటి స్నేహితుడు, ముంబై ఉగ్ర దాడి సూత్రధారుల్లో ఒకడైన డేవిడ్ కోల్మన్ హెడ్లీతో కలిసి పాక్‌లో లష్కరే ఉగ్ర శిక్షణ శిబిరాలకు పలుమార్లు హాజరైనట్టు రాణా వెల్లడించాడు. ‘‘మేమిద్దరం అక్కడ శిక్షణ తీసుకున్నాం. ముంబైలో పాగా వేసేందుకు అక్కడ ఇమిగ్రేషన్ కార్యాలయం పెట్టే ఆలోచన నాదే. దాని ముసుగులో పలు ఆర్థిక లావాదేవీలు జరిపా. 2008 నవంబర్ 26న మొదలైన ముంబై దాడుల వేళ నగరంలోనే ఉండి, మా ప్లాన్ సక్రమంగా అమలవుతోందో లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షించా. ఎక్కడెక్కడ దాడులు చేయాలి, అందుకు ఏ ప్రాంతాలు అనువైనవి, ఎక్కడైతే ప్రాణనష్టం భారీగా ఉంటుందని అన్నీ బేరీజు వేసుకున్నా. ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వేస్టేషన్ తదితరాలను దాడులకు ఎంపిక చేసుకున్నాం. అందుకు ఐఎస్ఐ సాయపడింది. పాక్ సైన్యానికి నమ్మినబంటును గనకే ఖలీజ్ యుద్ధం వేళ నన్ను సౌదీ అరేబియాకు పంపారు’’అని చెప్పాడు.హెడ్లీతో సహవాసం ‘‘హెడ్లీ, నేను 1974–79 మధ్య హసన్ అబ్దల్ క్యాడెట్ కాలేజీలో కలిసి చదువుకున్నాం. హెడ్లీ తండ్రి పాకిస్తానీ, తల్లి అమెరికన్. సవతి తల్లి పోరు పడలేక తను అమెరికా పారిపోయి కన్నతల్లితో ఉండేవాడు. 2003–04 మధ్య హెడ్లీ, నేను లష్కరే ఉగ్రశిక్షణ తీసుకున్నాం. ఉగ్ర దాడుల కంటే నిఘా కార్యకలాపాల్లో లష్కరేది క్రియాశీల పాత్ర అని హెడ్లీ చెప్పాడు. ముంబైలో నేను తెరిచిన ఇమిగ్రేషన్ ఆఫీసు మా ఉగ్ర నిఘా కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. దాన్ని ఓ మహిళ నడిపేది. 2008లో దాడులకు వారం ముందు భారత్ వచ్చా. నవంబర్ 20, 21 తేదీల్లో ముంబైలోని పోవాయ్ ప్రాంతంలో హోటల్లో దిగా. దాడులకు ముందే ముంబై వీడా. దుబాయ్ మీదుగా బీజింగ్ చేరుకున్నా. పాకిస్తాన్ అధికారులు సాజిద్ మిర్, అబ్దుల్ రహా్మన్ పాషా, మేజర్ ఇక్బాల్ నాకు తెలుసు’’అని రాణా చెప్పాడు. హెడ్లీ తప్పుడు డాక్యుమెంట్ల సాయంతో భారత్ రావడానికి రాణా సాయపడ్డట్టు దర్యాప్తులో తేలింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు..
-
తప్పునాదే.. తెలుసుకున్నా: కచ్చా బాదామ్ సింగర్
రాత్రికి రాత్రే దక్కిన ఫేమ్, డబ్బుతో గర్వం తన తలకెక్కిందని, అదే తన కొంప ముంచేందుకు ప్రయత్నించిందని అంటున్నాడు కచ్చా బాదమ్ సింగర్ భూబన్ బద్యాకర్. ఎక్కడో పశ్చిమ బెంగాల్ లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామంలో గల్లీలో పల్లీలు అమ్ముకుంటూ తిరిగే భూబన్.. ఆ అమ్మే క్రమంలో పాటలు పాడుతూ ఇంటర్నెట్ ద్వారా వరల్డ్‌వైడ్ ఫేమస్ అయ్యాడు. Kacha Badam రీమిక్స్‌తో అతని జీవితమే మారిపోయింది కూడా. కానీ.. ఆ తర్వాత వరుసగా జరిగిన పరిణామాలు.. విమర్శలతో తనకు ఇప్పుడు తత్వం బోధపడింది అంటున్నాడు భూబన్. ‘నేనొక సెలబ్రిటీని అనుకోవడం కంటే.. ఇప్పటికీ నేనొక పల్లీలు అమ్ముకునే వ్యక్తిగా అనుకోవడమే మంచిది. ఎందుకంటే.. ఎటూకానీ వయసులో సడన్‌గా వచ్చిన పేరు, డబ్బు నన్ను పైకి తీసుకెళ్లాయి. నాశనం చేయాలని ప్రయత్నించాయి. ఆ రంగు, హంగులు చూసి నాకు గర్వం తలకెక్కింది. కానీ, ఇప్పుడు నేల దిగొచ్చా. వాస్తవమేంటో అర్థం చేసుకున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సెకండ్ హ్యాండ్ కారు కొని.. యాక్సిడెంట్‌కు గురైన కచ్చా బాదమ్ సింగర్ భూబన్.. కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండి డిశ్చార్జి అయ్యాడు. ప్రస్తుతం రెండు పాటలు రికార్డింగ్ చేస్తున్నభూబన్.. వీలైనంత మేర సాధారణ జీవితం గడిపేందుకు రెడీ అంటున్నాడు. తప్పంతా నాదే. నేనేం సెలబ్రిటీని కాదు. అవసరం అయితే మళ్లీ పచ్చి పల్లీలు అమ్ముకుంటూ బతికేస్తా. నన్ను నమ్మండి.. నేను సాధారణంగా బతికేందుకే ప్రయత్నించా. గాల్లో మేడలు కట్టాలని నేనెప్పుడు అనుకోలేదు. కానీ, సోషల్ మీడియా సెలబ్రిటీ అనే మరక నన్ను దిగజార్చే ప్రయత్నం చేసింది అంటూ చెప్పుకొచ్చాడు భూబన్. కచ్చా బాదమ్‌తో ఫేమస్ అయిన భూబన్.. ఆ తర్వాత పేటెంట్ హక్కులు, రెమ్యునరేషన్ అంటూ వార్తల్లోకి ఎక్కాడు. అటుపై కాస్త డబ్బు చేతిలో పడడంతో సాధారణ జీవనానికి బై చెప్పి.. పోష్ లుక్‌తో కొన్ని ఈవెంట్లలో కాస్త తలపొగరు ఆటిట్యూడ్‌తో కనిపించాడు. దీంతో భూబన్పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి కూడా. -
రాజధానిపై చంద్రబాబు గందరగోళ ప్రకటనలు
-
స్వాతిని నేనొక్కడే హత్య చేశా
రామ్‌కుమార్ సంచలన వాంగ్మూలం కేకే.నగర్: ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతిని హత్య చేసింది తానొక్కడినేనని ఇందులో మరెవరికీ సంబంధం లేదని హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్ సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో చూలైమేడుకు చెందిన మహిళా ఇంజినీర్ స్వాతి గత నెల 24వ తేదీ హత్యకు గురైన సంఘటన తెలిసిందే. ఈ హత్యకు కారణమైన సెంగోట్టై సమీపంలో గల మీనాక్షిపురానికి చెందిన రామ్‌కుమార్ (24)ను అరెస్టు చేసి జైలులో ఉంచారు. రామ్‌కుమార్‌ను పోలీసులు కస్టడీలో ఉంచి మూడు రోజులు విచారణ జరపటానికి ఎగ్మూర్ కోర్టు అనుమతి ఇచ్చింది. గత 13వ తేదీ బుధవారం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు విచారణ జరిపారు. స్వాతితో ఎలా పరిచయం ఏర్పడింది?, ఆమెను హత్య చేయడానికి వేరే ఎవరైనా సహాయం చేశారా? వంటి పలు రకాల ప్రశ్నలు వేశారు. ఆ సమయంలో అతడిచ్చిన వాంగ్మూలంలోని వివరాలు ఇలా ఉన్నాయి. ఫేస్బుక్ ద్వారా స్వాతి తనకు పరిచయమైందని, ఆమెపై ప్రేమతో నేరుగా చూడడానికి చెన్నైకు వచ్చినట్లు తెలిపాడు. తన రూపాన్ని చూసి స్వాతి అసహ్యంచుకుని అవమానంగా మాట్లాడిందని, నా ప్రేమను నిరాకరించడమే కాకుండా నన్ను, నా కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడడంతో ఈ హత్య చేసినట్లు రామ్‌కుమార్ ఒప్పుకున్నాడు. స్వాతిని బెదిరించాలని కత్తితో వచ్చానని ఆమె నన్ను అసహ్యంగా తిట్టడంతో భరించలేక హత్య చేశానని ఇందులో మరెవరికీ సంబంధం లేదని రామ్‌కుమార్ తెలిపాడు. రామ్‌కుమార్ వద్ద పోలీసులు విచారణ శుక్రవారంతో పూర్తికావడంతో ఎగ్మూర్ నేర విభాగ న్యాయస్థానంలోని న్యాయమూర్తి గోపీనాథ్ సమక్షంలో పోలీసులు అతడిని హాజరు పరిచారు. అతడు ఇచ్చిన వాంగ్మూలాన్ని, వీడియో సీడీని న్యాయమూర్తికి సమర్పించారు. న్యాయమూర్తి గోపీనాథ్ రామ్‌కుమార్ వద్ద సుమారు అరగంట సేపు ప్రత్యేకంగా విచారణ జరిపారు. అనంతరం అతడిని గట్టి బందోబస్తు నడుమ పుళల్ జైలులో నిర్బంధించారు.