breaking news
committ
-
మరో రైతు బలవన్మరణం
కరీంనగర్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది రైతులు బలవన్మరణాలు చూడటానికి కాదని, తాము అండగా ఉంటామని, దయచేసి ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో హామీ ఇచ్చినా తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. పురుగుల మందు తాగి బండి నరేశ్ అనే కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాల్వశ్రీరామ్ పూర్ మండలం, జాఫర్ ఖాన్ పేటలో బండి నరేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలోకి వెళ్లారు. -
రైతు ఆత్మహత్య
కోరుట్ల(కరీంనగర్): అప్పుల బాధతో ఉరేసుకొని చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం అయిలాపురం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన రిబ్బాస రాజమల్లయ్య(48) తనకున్న ఎకరం భూమిలో మొక్కజొన్న సాగుచేసుకోవడతంఓ పాటు గొర్ల పెపకం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య అనారోగ్యానికి గురికావడంతో పాటు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక పోవడంతో.. అప్పులు పెరిగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.