breaking news
Commissioner someskumar
-
స్వచ్ఛందంగా ముందుకు రండి..
డొమెస్టిక్ ఆస్తిపన్ను చెల్లించే వ్యాపారులకు జీహెచ్ఎంసీ ఆఫర్ లేదంటే జరిమానాలు భరించాల్సిందే.. ఆస్తిపన్ను అంచనాపై జీహెచ్ఎంసీ కొత్త ప్లాన్ త్వరలో అమల్లోకి సిటీబ్యూరో: ఆయా భవనాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోన్నా ఆస్తిపన్ను చెల్లింపులో మాత్రం నివాస గృహాలుగా చూపుతున్న వారిపై జీహెచ్ఎంసీ దృష్టిసారించింది. సదరు వ్యక్తుల నుంచి వాణిజ్య కేటగిరీ కింద ఆస్తిపన్ను వసూలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అలాంటి వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వివరాలు అందించేందుకు ‘సెల్ఫ్ అసెస్మెంట్’ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారికి జరిమానా విధించరాదని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయ లక్ష్యసాధనలో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన కమిషనర్ సోమేశ్‌కుమార్ వాణిజ్య భవనాల యజమానులకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోని వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను నియమించనున్నారు. ప్రత్యేక బృందాలు గుర్తిస్తే మాత్రం పెనాల్టీతో సహా వాణిజ్య కేటగిరీ పన్నును వసూలు చేస్తామని కమిషనర్ తెలిపారు. నాలుగోతరగతి ఉద్యోగులకు పదోన్నతి.. పదోన్నతులకు అర్హులైన నాలుగోతరగతి ఉద్యోగులను సైతం ఆస్తిపన్ను వసూళ్లకు వినియోగించుకోవాలని కమిషనర్ సోమేశ్‌కుమార్ భావిస్తున్నారు. జీహెచ్ఎంసీలో దాదాపు 300 మంది నాలుగోతరగతి ఉద్యోగులు పదోన్నతులకు అర్హత కలిగి ఉన్నారు. వీరికి శిక్షణనిచ్చి బిల్ కలెక్టర్లకు సహాయకులుగా ఆస్తిపన్ను వసూళ్లకు పంపించనున్నారు. బాగా పనిచేసే వారిని గుర్తించి పదోన్నతులతోపాటు వారిని బిల్ కలెక్టర్లుగా నియమించనున్నారు. పెరగనున్న బిల్ కలెక్టర్ పోస్టులు.. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 323 బిల్కలెక్టర్ల పోస్టులుండగా, ప్రసాదరావు కమిటీ సిపార్సుల మేరకు మరో 127 పోస్టులు పెరగనున్నాయి. ప్రస్తుతం 337 మంది పనిచేస్తుండగా మరో 113 మందిని నియమించేందుకు అవకాశం ఉంది. బాగా పనిచేసే నాలుగోతరగతి ఉద్యోగులకు పదోన్నతి కల్పించి బిల్‌కలెక్టర్లుగా మార్చనున్నారు. తద్వారా వారిని ప్రోత్సహించడంతోపాటు జీహెచ్ఎంసీ ఖజానాకు ఆదాయమూ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. సమ్మెల పేరిట బిల్ కలెక్టర్లు విధులకు డుమ్మా కొట్టినా, వీరి సేవలు ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు. -
అడుగుకో అగాధం
మహానగరం విస్తీర్ణం 625 చ.కి.మీ.. గుర్తించిన నీటి నిల్వ ప్రాంతాలు 477..అంటే.. 1.3 చ.కి.మీ.కి ఓ తటాకం.....వెరసి అడుగుకో అగాధం పొంచి ఉందన్నమాట.ఇదీ మహానగర దుస్థితి. ఇంతవరకూ వర్షం వస్తే నీరు నిలిచేప్రాంతాలెన్నో కూడా తెలియని జీహెచ్ఎంసీ సిబ్బంది కాకిలెక్కలతో కాలక్షేపం చేసేది. ఎట్టకేలకు కమిషనర్ సోమేష్‌కుమార్ చొరవతో ఇంజనీరింగ్ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకుదిగింది. వీటి లెక్కలను తేల్చి చెపిది. పకడ్బందీ మరమ్మతులకు సిద్ధమవుతోంది. ఇపి వరకు నగరంలో వర్షం కురిస్తేనీరు నిలిచే ప్రాంతాలెన్ని అంటే.. 108, 118, 121. జీహెచ్ఎంసీ అధికారులు తరచూ చెపేఠ956? పొంతన లేని సంఖ్యలివి.ట్రాఫిక్ పోలీసుల సర్వేతో ఇచ్చిన కొన్ని ప్రాంతాలకు.. మరికొన్ని ప్రాంతాలను చేర్చి చూపుతూ కాలం గడిపే పరిస్థితి. వాటికి మరమ్మతులు చేశామని చెబుతూనే.. మళ్లీ వారే వందకుపైగా నీటినిల్వ ప్రాంతాలున్నాయని సమాధానాలిచ్చేవారు. అదేమిటని ప్రశ్నిస్తే.. ఆయా ప్రాంతాల్లో రహదారులు దెబ్బతినడం.. తదిత ర కారణాలతో పాటు కొత్తవి కూడా వస్తుంటాయనేవారు. మరమ్మతులు చేసినప్పటికీ మళ్లీ దెబ్బతింటాయనేవారు. అంతే తప్ప.. ఒకసారి మరమ్మతు చేసిన వాటికి తిరిగి మరమ్మతులు అవసరం లేదని చెప్పే పరిస్థితి లేదు. నగరంలో నీటినిల్వ ప్రాంతాలెన్నో సరైన లేక్కా ఉండేది కాదు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. కమిషనర్ చొరవతో క్షేత్రస్థాయి పర్యటనలకు దిగిన ఇంజనీరింగ్ విభాగం నగరంలో ఏకంగా 477 నీటి నిల్వ ప్రాంతాలున్నట్లు గుర్తించింది. అక్కడిదో ఆగిపోలేదు. ఏయే ప్రాంతాల్లో తరచూ నీరు నిలుస్తోంది? గట్టిగా నాలుగు చినుకులు కురిస్తే చెరువులుగా మారుతున్న ప్రాంతాలేవి? అక్కడున్న రహదారి బీటీయా..సీసీయా ? ఎంత విస్తీర్ణంలో నీరు నిల్వ ఉంటోంది? అందుకు కారణమేమిటి? (రోడ్డు ప్రొఫైల్ సరిగ్గా లేకపోవడమా.. లేక వాలుగా ఉండటమా..) దాని పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఏ రకమైన మరమ్మతులు చేయాలి? రద్దీ దృష్ట్యా, నీటి నిల్వ పరిమాణం దృష్ట్యా దాని ప్రాధాన్యం ఏమిటి? గుర్తించిన వాటిలో అత్యంత సమస్యలు సృష్టిస్తున్నవి ఎక్కడెక్కడున్నాయి? ప్రాధాన్యతా క్రమంలో తొలుత వేటికి మరమ్మతులు చేయాలి? ఇతరత్రా వివరాలతో నివేదికను సిద్ధం చేసింది. కమిషనర్ సోమేశ్‌కుమార్ సూచన మేరకు.. తొలిసారిగా క్షేత్రస్థాయి సర్వే చేసి ఈ నివేదిక రూపొందించినట్లు చీఫ్ ఇంజనీర్ ఆంజనేయులు తెలిపారు. ఓవైపు ట్రాఫిక్ పోలీసుల సర్వేలు.. మరోవైపు తమ సర్వేలే కాక రెండో దఫా కూడా సర్వే చేస్తున్నామని చెప్పారు. సర్వే ఆధారంగా ఇప్పటి వరకు 477 నీటి నిల్వ ప్రాంతాలు, 41 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్నారు. వీటికి వేసవిలో శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేస్తామన్నారు. వర్షాకాలం రావడానికి ముందే ప్రాధాన్యతా క్రమంలో ఈ పనులు చేయనున్నారు. ఒకసారి మరమ్మతు పనులు చేశాక సమస్య తిరిగి పునరావృతమైతే అందుకు ఇంజనీర్లే బాధ్యత వహించాలని కమిషనర్ హెచ్చరించడంతో పకడ్బందీ చర్యలకు సిద్ధమవుతున్నారు. తాజాగా 57 ప్రాంతాల్లో నిలిచిన నీరు వరుసగా కురుస్తున్న వర్షాలతో నగరంలో మొత్తం 57 ప్రాంతాల్లో నీరు నిలిచింది. అందులో సెంట్రల్ జోన్ పరిధిలో 48 ప్రాంతాల్లో, సౌత్‌జోన్ పరిధిలో 9 ప్రాంతాల్లో నీరు నిలిచినట్లు జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది. వాటిలో లక్డీకాపూల్, ఎన్ఎండీసీ, మాసాబ్‌ట్యాంక్, అజీజ్‌నగర్, మెహదీపట్నం, టోలిచౌకి, ఎంజేమార్కెట్, బస్‌భవన్, సుల్తాన్‌బజార్ తదితర ప్రాంతాలున్నాయి. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కొన్ని.. హిమాయత్‌నగర్ వై జంక్షన్ నారాయణగూడ చౌరస్తా నింబోలి అడ్డ (రైల్వేబ్రిడ్జి కింద) ఫీవర్ ఆస్పత్రి, సుబ్రహ్మణ్యంహోటల్ దగ్గర, తిలక్‌నగర్, రైల్వే బ్రిడ్జి. మోడల్‌హౌస్ లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ ఇమేజ్ హాస్పిటల్ (అమీర్‌పేట) ద్వారకా మలుపు (లక్డీకాపూల్) హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎదుట (లక్డీకాపూల్) లక్కీ హోటల్ వద్ద (లక్డీకాపూల్) భారతీయవిద్యాభవన్ కేబీఆర్‌పార్కు వద్ద సీబీఆర్ ఎస్టేట్ హబ్సిగూడ చౌరస్తా-ఎన్ఎఫ్సీ బ్రిడ్జి నాగోల్ బ్రిడ్జి - హబ్సిగూడ సిగ్నల్, సారథి స్కూల్ గోల్కొండ హోటల్, మాసాబ్‌ట్యాంక్ గుడిమల్కాపూర్ మార్కెట్ ఎంజే మార్కెట్ జంక్షన్ గృహకల్ప బస్టాప్ సికింద్రాబాద్ మల్లన్న గుడి - గురుద్వారా రోడ్డు యాక్సిల్ బ్యాంక్, కర్బలా మైదాన్