breaking news
comments hilights
-
ఫొటో వైరల్: శోభనం గదిలో భార్యను వదిలి..
మానవుడి జీవితంలో మధురానుభూతి పంచేది తొలిరాత్రి. దీనికోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అలాంటి రోజు రానే వస్తే ఎంతో సంతోషించి పడక గదిలోకి వెళ్తారు. అలా వెళ్లిన ఓ పెళ్లి కొడుకు భార్యను పట్టించుకోకుండా కంప్యూటర్లో పని చేసుకుంటూ కూర్చున్నాడు. వధువేమో అతడినే చూస్తూ బెడ్‌పై కూర్చుని ఉంది. దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. కొత్తగా పెళ్లయిన దంపతులు పెళ్లి బట్టలతోనే అందంగా అలంకరించిన శోభనం గదిలోకి వెళ్లారు. అయితే భార్య బెడ్‌పై కూర్చుని ఉండగా భర్త కంప్యూటర్ ముందు వాలిపోయాడు. ఫొటో చూస్తుంటే ఎంతకీ అతడు రాలేదనే నిర్వేదంతో చూస్తూ కూర్చుండిపోయినట్టు కనిపిస్తోంది. ఈ ఫొటోలపై కామెంట్స్, షేర్లు ట్రెండవుతున్నాయి. సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ఆ ఫొటోను చూసినవారంతా ‘వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రభావం’ అని ఒకరు, ‘ఉండమ్మ హిస్టరీ డిలీట్ చేయని’ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వధూవరులు ఎక్కడివారో తెలియదు కానీ దానికి సంబంధించిన ఫొటో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆన్లైన్ క్లాస్‌ల ప్రభావం.. అందుకే టీచర్ శోభనం రోజు కూడా కంప్యూటర్లో బోధన చేస్తున్నాడని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. మా సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితికి అద్దం పడుతోందని మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తమ బాధను వెళ్లబోసుకున్నాడు. "hold on babe, let me finish my shift" #WFH pic.twitter.com/6Z6gO5kIvI — Diaper Don (@NamasteTrumpi) February 10, 2021 -
వివాదస్పద వ్యాఖ్యలతో దుమారం
ఎస్కేయూ : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎస్కేయూ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివాదస్పద వ్యాఖ్యలతో దుమారం చెలరేగింది. ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు తిరుమల రెడ్డి వామపక్ష విద్యార్థి సంఘాలు అస్థిత్వం కోల్పోతున్నాయని వ్యాఖ్యానించడం తీవ్ర చర్చకు దారి తీసింది. అక్కడే ఉన్న వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు. నేరుగా విద్యార్థి సంఘాల ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాలు గెలుపొందాయని గట్టిగా నిలదీశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఇటుకలపల్లి సీఐ రాజేంద్ర నాథ్ యాదవ్ కలుగచేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకవచ్చారు.