breaking news
clean shaven look
-
నిత్యం పొడవాటి గడ్డంతోనే..! ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా?
తెలంగాణకు చెందిన ఆ కాంగ్రెస్ నేత స్టైలే వేరు. రాజకీయాలపై మాట్లాడితే మాటల తూటాలే. చూడటానికి కూడా గంభీరంగా ఉంటారు. ఆయనకంటూ ప్రత్యేక హెయిర్ స్టైల్, గడ్డం, నడక తీరు ఉంటుంది. ఎప్పుడూ బారెడు గడ్డం, పొడవాటి మీసంతో జనాల్లో కనిపించే ఆ కాంగ్రెస్ నేత ఒక్కసారిగా మారిపోయారు. నిత్యం గడ్డం, మీసాలు పెంచుతూ ఉండే ఆయన ఉన్నట్టుండి క్లీన్‌షేవ్‌తో దర్శనమిచ్చారు .దీంతో ఆయనను గుర్తుపట్టడం కొందరికి కష్టమైపోయింది. తిరుపతి వెంకన్న భక్తుడైన ఆ కాంగ్రెస్ నేత ఎవరో కాదు.. మన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. ఆయన తిరుమల శ్రీవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించి మొక్కుతీర్చుకున్నారు. దీంతో జగ్గారెడ్డిని గడ్డం మీసాలు లేకుండా గుర్తుపట్టలేకపోతున్నారు కొందరు. అసలు ఆయనేనా అని పరీక్షించి చూస్తున్నారు. ప్రస్తుతం జగ్గారెడ్డి కొత్త లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, జగ్గారెడ్డికి దైవ భక్తి ఎక్కువ. తరుచూ పూజల్లో పాల్గొంటారు. పండుగల సందర్భంగా చందాల కోసం వచ్చిన భక్తులకు తనకు తోచిన సాయాన్ని చేస్తూనే ఉంటారు.. ఇటీవల రాహుల్ భారత్ జోడో యాత్ర ఆయన నియోజకవర్గంలో (సంగారెడ్డి) ప్రవేశించిన సందర్భంగా జగ్గారెడ్డి కొరడాలతో కొట్టుకుంటూ పోతురాజులను అనుకరించిన విషయం తెలిసిందే. చదవండి: ED Raids Telangana: గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన -
అభిమానులకు షాక్ ఇచ్చిన ప్రభాస్
జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన సౌత్ సినిమా బాహుబలి. ఈ సినిమాతో దర్శక నిర్మాతలే కాదు.. హీరోగా నటించిన ప్రభాస్ కూడా అంతర్జాతీయ స్థాయి స్టార్‌గా మారిపోయాడు. అందుకే బాహుబలి తరువాత ప్రభాస్ చేయబోయే సినిమాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభాస్ ఏం చేసినా అది న్యూస్ హెడ్ లైన్‌గా మారుతోంది. తాజాగా ప్రభాస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బాహుబలిలో పొడవాటి జుట్టు, మెలితిరిగిన మీసం, గడ్డంతో కనిపించిన ప్రభాస్ ఈ ఫోటోలో క్లీన్ షేవ్‌లో కనిపిస్తున్నాడు. ఇటీవల ప్రముఖ హెయిర్ స్టయిలిస్ట్ హకీమ్ అలీం తన సోషల్ మీడియా పేజ్‌లో ప్రభాస్ ఫోటో ఒకటి పోస్ట్ చేశాడు. స్టైలిష్ లుక్‌లో ఉన్న ప్రభాస్‌ను చూసి ఇది సాహో లుక్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన ఫోటోలో ప్రభాస్ డిఫరెంట్‌గా కనిపిస్తుండటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడూ ప్రభాస్ క్లీన్ షేవ్‌లో కనిపించలేదు. చక్రం లాంటి సినిమాల కోసం గడ్డం తీసేసినా మీసాలు లేకుండా ఇంత వరకు కనిపించలేదు. మరి ఒక్కసారిగా ప్రభాస్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అన్ని అభిమానులు ఆలోచనలో పడ్డారు.