breaking news
childrean killed
-
తల్లినే ఎక్కువ ఇష్టపడుతున్నారని, ముక్కుపచ్చలారని చిన్నారులపై తండ్రి దారుణం
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలను నీటి కాలువలోకి నెట్టివేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు బుధవారం వారి మృతదేహాలను వెలికితీసిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులలో తొమ్మిదేళ్ల బాలిక, రెండన్నరేళ్ల బాలుడు ఉన్నారు. ఈ జంట హత్యలకు కారణం తెలిసి పోలీసులు కూడా నివ్వుపోయాడరు.యాద్గిర్ ఎస్పీ పృథ్వీక్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు శాంతప్పకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు (9,6) ఒక అబ్బాయి ( సుమారు మూడేళ్లు). తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటి నుండి బయలుదేరి, మోటార్‌సైకిల్‌పై బిగుడి వద్ద ఉన్న కాలువకు వెళ్లాడు. తన ఆరేళ్ల కుమార్తెను మాత్రం వదిలి మిగిలిన ఇద్దర్నీ నిర్దాక్షిణ్యంగా కాలువలోకి నెట్టేశాడు. ఆ తరువాత ఆ చిన్నారని తనతో పాటు యాద్గిర్ పట్టణానికి తీసుకెళ్లాడు. అనంతరం బిగుడి (Bigudi) ప్రాంతంలోని తన ఇద్దరు పిల్లలను కాలువలోకి విసిరినట్లు పోలీసులకు సమాచారం అందించాడు. తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి అక్కడికి రాగా, పోలీసులు కూడా ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే రాత్రి కావడంతో, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టలేకపోయారు. మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు అగ్నిమాపక శాఖ సహాయంతో గాలింపు చర్యలు తిరిగిచేపట్టారు. అదే సమయంలో కాలువలోకి నీటి ప్రవాహాన్ని నిలిపివేయాలని కృష్ణ భాగ్య జల నిగమ్ లిమిటెడ్ (KBJNL) అధికారులను కోరారు.ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయంప్రాథమిక విచారణలో తేలిన వివరాల ప్రకారం ఆ ఇద్దరు పిల్లలు తమ తల్లి రేణుకకు దగ్గరగా ఉండేవారని, తనతో అంతగా కలిసి ఉండేవారు కాదని అందుకే చంపేశానని పోలీసులకు తెలిపారు. కిడ్నాప్, హత్య కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శాంతప్పను అదుపులోకి తీసుకుని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని యాద్గిర్ ఎస్పీ వెల్లడించారు. -
తండ్రి పాపమా ?.. విధి శాపమా ?
లోకం పోకడ తెలియని అన్నదమ్ములు ఆ పసోళ్లు.. మేనరికం పాపమో.. విధి శాపమో.. పదేళ్లు వచ్చినా పట్టుమని పది మందితో ఆడుకోలేని మానసిక దివ్యాంగులు వాళ్లు .. ఆనందమొచ్చినా.. ఆవేదన వచ్చినా ఎదిగీ ఎదగని ఆ రెండు మనసులకే అర్థమయ్యేవి. అనురాగం నిండిన అమ్మ పేగులో ఆవేదన.. మమకారం పంచిన నాన్న గుండెల్లో ఆందోళన వాళ్ల కన్నీళ్లలో కలిసిపోతుండేవి. శనివారం ఆ తండ్రి ఆందోళన క్షణికావేశంగా మారిందో.. కన్నబిడ్డలు పడుతున్న కష్టం చూసి కడుపు తరుక్కుపోయిందో.. ఆ పిల్లల పాలిట మృత్యువైంది. మాచర్ల పట్టణ శివారులో జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఉషోదయాన విషాద గీతికై జిల్లా నలుమూలలా ప్రతిధ్వనించింది. ఇద్దరు మానసిక దివ్యాంగుల హత్య మాచర్లరూరల్ : పుట్టుకతో మానసిక వికలాంగులుగా ఉన్న చిన్నారులు ఇంట్లోనే హత్యకు గురయ్యారు. తండ్రే వారిని హతమార్చి ఉంటాడని బంధువులు అనుమానిస్తున్నారు. పట్టణ శివారులోని వికాస్ డీఎడ్ కాలేజి సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామానికి చెందిన కుర్రి బ్రహ్మారెడ్డి, అనిత దంపతులు ఉపాధి కోసం 5 ఏళ్ల నుంచి పట్టణ శివారులోని శ్రీ వికాస్ డీఎడ్ కళాశాల సమీపంలో నివసిస్తున్నారు. బ్రహ్మారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వీరికి శశాంక్‌రెడ్డి (11), అదీప్‌రెడ్డి (9), 9 నెలల చింతన్‌రెడ్డి అనే ముగ్గురు కుమారులున్నారు. వీరిలో శశాంక్‌రెడ్డి, అదీప్‌రెడ్డి పుట్టకతోనే మానసిక దివ్యాంగులుగా జన్మించారు. వీరి ఆరోగ్యం కోసం వివిధ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా వారిలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. శుక్రవారం రాత్రి ఎప్పటిలాగే బ్రహ్మారెడ్డి పిల్లలతో కింద పోర్షన్లో నిద్రించాడు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంటి నుంచి బ్రహ్మారెడ్డి బయటకు వెళ్లిపోవడం గమనించిన నాయనమ్మ మాలకొండమ్మ తెల్లవారుతున్నా బ్రహ్మారెడ్డి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెంది ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులను పరిశీలించగా శశాంక్‌రెడ్డి, అదీప్‌రెడ్డి ఉలుకూపలుకూ లేకుండా పడివున్నారు. బహ్మారెడ్డి కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తెల్లవారకముందే బయటకు వెళ్లిపోవడంతో బంధువులు అతనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ దిలీప్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను విచారించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బ్రహ్మారెడ్డి కోసం గాలిస్తున్నారు. -
వాగులో పడి ఇద్దరు చిన్నారుల మృతి
మందమర్రి: అదిలాబాద్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. జిల్లాలోని మందమర్రి మండలం తిమ్మాపూర్ కి చెందిన నరేష్, ఖలీల్ అనే ఇద్దరు చిన్నారులు గ్రామ సమీపంలోని పాలవాగులో మృత దేహాలై కనిపించారు. స్థానికులు గుర్తించి చిన్నారుల మృత దేహాలను వెలికి తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


