Chief officers
-
అమెరికా ఆర్మీ చీఫ్‌పై వేటు
వాషింగ్టన్: పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమెరికా 41వ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ద ఆర్మీ జనరల్ ర్యాండీ జార్జితోపాటు మరో ఇద్దరు సైనికాధికారులపై వేటు పడింది. తక్షణమే రాజీనామా చేయాలంటూ అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ వారిని ఆదేశించినట్లు పెంటగాన్ గురువారం వెల్లడించింది. అయితే, ఈ ఉద్వాసనకు కారణం ఏమిటన్నది బయటపెట్టలేదు. ర్యాండీ జార్జి జో బైడెన్ హయాంలో ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. 2023 ఆగస్టు నుంచి పదవిలో కొనసాగుతున్నారు. కనీసం నాలుగేళ్లపాటు సైన్యాధిపతిగా పనిచేయాల్సి ఉండగా, ట్రంప్ ప్రభుత్వ ఆదేశాలతో మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత పది మందికిపైగా అత్యున్నత సైనిక జనరల్స్, అడ్మిరల్స్‌ను తొలగించారు. అదే కోవలో ర్యాండీ జార్జిని సైతం పక్కనపెట్టినట్లు పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు ఇరాన్‌పై భీకర యుద్ధం జరుగుతుండగానే మరోవైపు ఆర్మీ చీఫ్‌ను హఠాత్తుగా తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఆర్మీ ట్రాన్స్ఫర్మేషన్, ట్రైనింగ్ కమాండ్ చీఫ్ జనరల్ డేవిడ్ హడ్నీ, చీఫ్ ఆఫ్ కంప్లెయింట్స్ మేజర్ జనరల్ విలియమ్ గ్రీన్‌పైనా హెగ్సెత్ వేటు వేశారు. క్షేత్రస్థాయి యుద్ధాల్లో అనుభవం జనరల్ ర్యాండీ జార్జికి అనేక యుద్ధాల్లో క్షేత్రస్థాయిలో పాల్గొన్న అనుభవం ఉంది. వెస్ట్ పాయింట్ మిలటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. మొదటి గల్ఫ్ యుద్ధంతోపాటు ఇరాక్, అఫ్గానిస్తాన్ యుద్ధాల్లో ఇన్ఫాంట్రీ ఆఫీసర్‌గా సేవలందించారు. 2021, 2022లో అప్పటి రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ వద్ద సైనిక సహాయకుడిగా పనిచేశారు. నిజానికి 2025 ఫిబ్రవరిలోనే సైనికాధికారుల తొలగింపు మొదలైంది. తొలి విడతలో పలువురు కీలక అధికారులకు ఇంటిదారి పట్టారు. అప్పట్లో వేటు నుంచి తప్పించుకున్న ర్యాండీ జార్జి ఏడాది తర్వాత ఉద్వాసనకు గురికాక తప్పలేదు. హెగ్సెత్ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా సమర్పించినట్లు తెలిసింది. ర్యాండీ జార్జి అందించిన సేవలను కొనియాడుతూ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్లో కాదు.. అమెరికాలోనే ఆ మార్పు ఇరాన్లో పాలకులను మార్చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ఆరంభించారు. ట్రంప్ ఆశిస్తున్న ఆ మార్పు ఇరాన్లో కాకుండా అమెరికాలోనే జరుగుతోంది. ఫిబ్రవరి 28న ఇరాన్లో దాడులు ప్రారంభం కాగా, ఆ తర్వాత అమెరికాలో చాలామంది కీలక నేతలు, అధికారులు పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వీరిలో ట్రంప్ సన్నిహితులు కూడా ఉన్నారు. తాజాగా క్రిస్టీ నోయెమ్, పామ్ బాండీపై ట్రంప్ వేటేశారు. కీలక సైనికాధికారులు కూడా తొలగింపునకు గురయ్యారు. త్వరలోనే మరికొందరిని ఇంటికి పంపబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు లేకపోవడం ట్రంప్‌ను కలవరపరుస్తోంది. ఆయన పట్ల జనాదరణ తగ్గుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. నూతన సైన్యాధిపతిగా క్రిస్టోఫర్ లానీవ్ జనరల్ ర్యాండీ జార్జి స్థానంలో తాత్కాలిక సైన్యాధిపతిగా జనరల్ క్రిస్టోఫర్ లానీవ్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు పెంటగాన్ వర్గాలు తెలియజేశాయి. గత ఏడాది అక్టోబర్‌లో క్రిస్టోఫర్‌ను ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా అధ్యక్షుడు ట్రంప్ నామినేట్ చేశారు. ఆ సమయంలో హెగ్సెత్కు క్రిస్టోఫర్ అగ్రశ్రేణి సైనిక సహాయకుడిగా పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు కేవలం టూ–స్టార్ జనరల్ హోదా కలిగిన క్రిస్టోఫర్ ఇప్పుడు సైన్యాధిపతిగా పదోన్నతి పొందడం విశేషం. ఇరాన్లో భూతల దాడులకు అమెరికా సైన్యం సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. వేలాది మెరైన్లతోపాటు 82వ ఎయిర్‌బార్న్ డివిజన్ ట్రూపర్లు పశ్చిమాసియా దిశగా కదులుతున్నారు.అటార్నీ జనరల్ పామ్ బాండీకి ఉద్వాసన అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీని అధ్యక్షుడు ట్రంప్ పదవి నుంచి తొలగించారు. తన పాలనను గట్టిగా సమరి్థంచే దీర్ఘకాల స్నేహితురాలిపై అకస్మాత్తుగా వేటు వేశారు. బాండీ పనితీరు పట్ల ట్రంప్ కొన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎఫ్‌స్టీన్ ఫైల్స్ ఉదంతంలో తనపై దర్యాప్తు విషయంలో ఆమె సరిగ్గా వ్యవహరించలేదని ట్రంప్ భావిస్తున్నారు. బాండీ స్థానంలో టాడ్ బ్రాంచ్‌ను ఏజీగా నియమించారు. తన ఉద్వాసనపై బాండీ స్పందించారు. ‘‘ఏజీ పదవి లభించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ట్రంప్‌కు, ఆయన ప్రభుత్వానికి సేవలు అందిస్తూనే ఉంటా’’ అని తెలిపారు. గత నెలలో హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్టీ నోయెమ్నూ ట్రంప్ తొలగించారు. -
అమల్లోలేని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: ‘అమల్లో లేని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేస్తోంది. ఓటర్లను తప్పుదారి పట్టిస్తోంది. ఇది ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధం. టీడీపీపై తగిన చర్యలు తీసుకోండి’ అని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ సోమవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదుతోపాటు తగిన ఆధారాలను అందజేశారు. అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ నెల 28వ తేదీన కోడుమూరు, మంత్రాలయంలలో జరిగిన ప్రచార సభల్లో ప్రసంగిస్తూ సీఎం వైఎస్ జగన్‌పై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఈ నెల 28న ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజు ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. -
అక్కడంతా ఆమ్యామ్యాలే!
- ఇద్దరు ప్రధాన అధికారుల హవా.. - ఫైలు కదలాలంటే చేయి తడపాల్సిందే! - బ్రోకర్ల అండతో యథేచ్ఛగా అవినీతి దందా - ఆర్టీఏ కార్యాలయం ఎదుటేబ్రోకర్ ఆఫీసులు.. - రోజుకు సుమారు 500 ఫైళ్ల లావాదేవీలు - నెలకు రూ.2 కోట్లకు పైగా అక్రమార్జన సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘అనంత’ ఆర్టీఏ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. వెహికల్ రిజిస్ట్రేషన్...లెసైన్స్...పనేదైనా బ్రోకర్‌ను సంప్రదించాల్సిందే! బ్రోకర్‌తో సంబంధం లేకుండా ‘పని’కావాలని మొండిపట్టు పడితే ఆ పని ఎప్పటికి అవుతుందో తెలీదు. అధికారులు కూడా బ్రోకర్ల అండతోనే ఫైళ్ల క్లియరెన్స్... లావాదేవీలు సాగిస్తున్నారు. దీంతో ఇక్కడ ఏ పని కావాలన్నా ప్రభుత్వానికి నికరంగా చెల్లించాల్సిన మొత్తాని కంటే అదనంగా 2-4రెట్లు సమర్పించుకోవాల్సిందే. ఇద్దరు అధికారుల హవా! ఆర్టీఏ కార్యాలయంలో వాహనాల రిజిస్ట్రేషన్, లెసైన్స్‌ల జారీ ముగ్గురు ప్రధాన అధికారుల చేతుల మీద సాగుతోంది. వీరిలో ఇద్దరు ఇక్కడి లావాదేవీలు గుప్పిట్లో పెట్టుకున్నారు. వీరిద్దరి కింద దాదాపు 50 మంది బ్రోకర్లు ఉన్నారు. కార్యాలయం గేటు బయటే వీరి ఆఫీసులు ఉన్నాయి. జీపు, కారు, టాటాఏఎస్, మ్యాజిక్ లాంటి నాలుగుచక్రాల వాహనాల రిజిస్ట్రేషన్‌కు నిబంధనల ప్రకారం 650 రూపాయలు చలానా ఖర్చు అవుతోంది. నెంబర్ ప్లేటుకు మరో 600 రూపాయలవుతుంది. అయితే బ్రోకర్లు 2,500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇందులో రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఖర్చును చెల్లిస్తారు. తక్కిన డబ్బును మూటగడతారు. ఇలా ఒక్కో బ్రోకర్ రోజుకు దాదాపు రూ.10-13వేల దాకా ఆర్జిస్తున్నట్లు తెలిసింది. అంటే! ఇక్కడున్న 50 మంది బ్రోకర్లు రోజువారి ఆదాయం 5లక్షలపైమాటే! ఈ మొత్తం సొమ్ము సాయంత్రం అయ్యేసరికి ఆర్టీఏ కార్యాలయంలోని ఇద్దరు అధికారులకు ఇస్తారు. ఈ ఇద్దరు ఎవరు ఎన్ని ఫైళ్లు తీసుకొచ్చారు? ఎవరి వాటా ఎంతా అనేది తేల్చుతారు? వారు కింది నుంచి పై స్థాయి వరకూ ‘వడ్డి’ంపులు చేస్తారని కార్యాలయంలోని ఉద్యోగులే గుసగుసలాడుతున్నారు. ఇంగ్లీషుతోనే అసలు సమస్య! వాహనదారులు, డ్రైవర్లు పూర్తి చేయాల్సిన దరఖాస్తులన్నీ ఇంగ్లీషులోనే ఉన్నాయి. వీటిని పూరించడం చాలామందికి తెలీదు. దీంతో బ్రోకర్లను సంప్రదిస్తారు. వీరు వచ్చిందేతడవుగా బ్రోక్లర్లు ‘మీకెందుకు తిప్పలు, మీరు వెళితే లేనిపోని సాకులు చూపి ఆలస్యం చేస్తారు. పైగా నాలుగైదు రోజులకు బాడుగలు పోతాయి. మాకివ్వండి మేం చేస్తాం’ అని ఆందోళన రేపుతారు. దీంతో వాహనదారులు బ్రోకర్లు సరెండర్ అవుతారు. వారు అడిగినంత డబ్బులు చెల్లిస్తున్నారు. బ్రోకర్లను సంప్రదించకుండా నేరుగా ఫైలు అధికారి వద్దకు వెళితే అడ్డంకులు తప్పవు! దానిపై రాతను పసిగట్టి పక్కనపడేస్తారు. మరీ ఇబ్బంది పడితే మొహమాటం లేకుండా ఆ ఇద్దరి వద్ద ఉన్న అసిస్టెంట్లు రేటు చెప్పేస్తారు. వారు చెప్పినంత కచ్చితంగా ఇవ్వాల్సిందే! లేదంటే ‘గ్రీన్‌ఇంక్’ పెన్ పేపర్‌పై కదలదు. అదే బ్రోకర్ల ద్వారా వచ్చినవి అయితే నిమిషాల్లో పని చేస్తారు. ఇలా బ్రోకర్ల ద్వారా కార్యాలయంలో రోజుకు దాదాపు 500 ఫైళ్లు నడుస్తున్నట్లు సమాచారం. ఎల్ఎల్ఆర్కూ వసూళ్లే!! లెసెన్స్‌ల కోసం వెళ్లే డ్రైవర్లు ముందుగా ఎల్ఎల్ఆర్ తీసుకోవాలి. ఎల్‌ఎల్‌ఆర్‌కు 120 రూపాయలు ఖర్చవుతుంది. అయితే ఇక్కడ మాత్రం అదనంగా 300-500 రూపాయలు చెల్లించాలి. వాహన పరీక్ష (డ్రైవర్ల టెస్ట్)కు వెళితే అక్కడ మరో మూడు వందల రూపాయలు అదనంగా ఇచ్చుకోవాలి. పని పూర్తయిన తర్వాత తీరా లెసైన్స్ చేతికి రావాలంటే అక్కడా చేయి తడపాల్సిందే!! ఈ విధంగా కార్యాలయంలో ఫైలు కదిలే ప్రతీ టేబుల్ వద్ద ముడుపులు తప్పనిసరిగా చెల్లించుకోవల్సిన పరిస్థితి. కార్యాలయంలోని పరిస్థితిని ఆరా తీస్తే వాహనదారులు, లెసైన్స్ దారులంతా ‘ముడుపులు’ ఇవ్వకపోతే పని కాదని... ఇది ఆర్టీఏ కార్యాలయంలో సర్వసాధారణమైపోయిందని చెబుతున్నారు. దీనిపై ‘సాక్షి’ వాయిస్ అడిగితే వాహనాలు ఉన్నోళ్లం మేం ఆరోపిస్తే... మళ్లీ మా పని అవుతుందా? సార్! అని నిరాకరిస్తున్నారు. అన్నిశాఖల ప్రక్షాళనపై దృష్టి సారించిన కలెక్టర్ కోన శశిధర్ ఆర్టీఏ కార్యాలయం వైపు కూడా దృష్టి సారించాలని ‘మాముళ్ల’ భారం తగ్గించాలని కోరుతున్నారు.


