breaking news
check book
-
బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్!
డిజిటల్ చెల్లింపులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. బ్యాంక్ చెక్కుల వినియోగం మాత్రం పూర్తిగా తగ్గలేదు. ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు, ఆస్తుల కొనుగోలు, లేదా పెద్ద మొత్తాల చెల్లింపుల కోసం ఇప్పటికీ చెక్కులను ఉపయోగిస్తున్నారు. దీంతో.. చెక్కుల భద్రతపై బ్యాంకులు మరింత దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగానే కొత్త భద్రతలను ప్రవేశపెడుతున్నాయి.చెక్కుల్లో కొత్త భద్రతలు ఎందుకు?చెక్కుల ద్వారా జరిగే మోసాలను తగ్గించేందుకు బ్యాంకులు కొత్త భద్రతా విధానాలను ప్రవేశపెడుతున్నాయి. చెక్కును మార్చడం, నకిలీ చెక్కులు ఉపయోగించడం వంటి మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక కోడ్లు, ఇతర భద్రతలను చేర్చుతున్నారు.ఉదాహరణకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కొత్త చెక్ లీఫ్లపై అక్షరాలు, సంఖ్యల కలయికతో కూడిన అల్ఫాన్యూమరిక్ కోడ్‌ను ప్రవేశపెట్టింది. ఈ కోడ్ ద్వారా చెక్‌ను సులభంగా గుర్తించడంతో పాటు, దాని వివరాలను ధృవీకరించడంలో బ్యాంకుకు సహాయం అవుతుంది.అల్ఫాన్యూమరిక్ కోడ్ అంటే ఏమిటి?అల్ఫాన్యూమరిక్ కోడ్ అంటే.. అక్షరాలు, సంఖ్యలు కలిపి ఉండే ఒక ప్రత్యేక గుర్తింపు కోడ్. ఇది చెక్ లీఫ్‌ను గుర్తించడానికి, చెక్ క్లియరింగ్ సమయంలో ధృవీకరణను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. పాత చెక్బుక్లో ఈ కోడ్ లేనప్పటికీ చెల్లుబాటు అవుతాయి. అయితే.. ప్రతి బ్యాంకు దీనికి సంబంధించి తన ఖాతాదారులకు వేర్వేరు సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సందేహం ఉంటే.. మీ బ్యాంకు ద్వారా అధికారిక సమాచారం తెలుసుకోవడం మంచిది.ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలుచెక్కుల క్లియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చెక్ ట్రంకేషన్ సిస్టమ్(CTS)ను అమలు చేస్తోంది. ఈ విధానంలో చెక్‌ను ఫిజికల్‌గా ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు పంపకుండా.. చెక్ ఎలక్ట్రానిక్ ఇమేజ్, అవసరమైన సమాచారాన్ని చెల్లింపు బ్యాంకుకు పంపిస్తారు. దీంతో చెక్ క్లియరింగ్ ప్రక్రియ వేగంగా, సురక్షితంగా జరుగుతుంది.డిసెంబర్ 31, 2026 గడువుఅల్ఫాన్యూమరిక్ కోడ్ లేని కొన్ని చెక్కులకు, ముఖ్యంగా రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన చెక్కులకు, 2026 డిసెంబర్ 31 గడువు ఉందని కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే.. ఇది అన్ని బ్యాంకులకు వర్తించే సాధారణ RBI గడువు అని భావించకూడదు. ఖాతాదారులు తమ బ్యాంకు నుంచి వచ్చిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకోవాలి.పాత చెక్‌బుక్‌ను మార్చాల్సిన అవసరం ఉందా?, ఏదైనా చివరి తేదీ ఉందా?, అనే విషయాలను బ్యాంకు శాఖను సంప్రదించడం లేదా బ్యాంకు అధికారిక వెబ్సైట్ చూడడం ద్వారా తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: SBI ఖాతాదారులకు షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్!కొత్త చెక్బుక్కు ఛార్జీలు ఉంటాయా?కొత్త చెక్‌బుక్ కోసం వసూలు చేసే ఛార్జీలు బ్యాంకు, ఖాతా రకాన్ని బట్టి మారుతాయి. ఉదాహరణకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ ఖాతాదారులకు ఒక ఆర్థిక సంవత్సరంలో 25 లీఫ్‌లను ఉచితంగా అందిస్తుందని పేర్కొంది. అదనపు చెక్ లీఫ్లకు బ్యాంకు నిర్ణయించిన ఛార్జీలు వర్తించవచ్చు. అందువల్ల కొత్త చెక్‌బుక్ తీసుకునే ముందు మీ బ్యాంకు తాజా ఛార్జీల వివరాలను తెలుసుకోవడం మంచిది.చెక్ ఎంతకాలం చెల్లుతుంది?సాధారణంగా.. ఒక చెక్‌పై ఉన్న తేదీ నుంచి మూడు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. అందువల్ల చెక్‌ను ఎక్కువ కాలం ఉంచకుండా.. మూడు నెలల లోపే బ్యాంకులో జమ చేయాలి. చెక్ బౌన్స్ అయితే పరిస్థితులను బట్టి ఆర్థిక, చట్టపరమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లోని సెక్షన్ 138 కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. -
20 చెక్కులే ఉచితం... ఆ తర్వాత ఛార్జీలే
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు ఉచిత చెక్కుల విషయంలో పరిమితి విధించింది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ఏడాదికి 20 ఉచిత చెక్కుల సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత ప్రతీ చెక్కు వినియోగంపై రూ.5ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకు నూతన ఖాతాదారులకు తొలి ఏడాది 60, ఆ తర్వాత నుంచి ప్రతీ ఏడాది 50 చెక్కులను ఉచితంగా అందిస్తుండడం గమనార్హం. ఈ పరిమితి దాటిన తర్వాతే ప్రతీ చెక్కు వినియోగంపై రూ.5 చార్జీని వసూలు చేస్తుండగా.. ఇకపై ఈ పరిమితి ఏడాదికి 20 చెక్కులుగా అమల్లోకి రానుంది. మినహాయింపు సబ్కా సేవింగ్ అకౌంట్ ఖాతాదారులకు చెక్కుల విషయంలో ఎటువంటి పరిమితి ఉండదంటూ బ్యాంకు స్పష్టం చేసింది. ఇక బ్యాంకు మాతృశాఖ, ఇతర శాఖల్లో ప్రతీ నెలా నగదు జమ లావాదేవీల పరిమితిలోనూ మార్పు చేసింది. జూలై 1 నుంచి ఈ సవరణలు అమల్లోకి రానున్నట్టు ఐడీబీఐ బ్యాంకు ప్రకటించింది. -
ఎస్బీఐలో విలీనమైన బ్యాంకుల్లో మీకు చెక్‌బుక్ ఉందా?
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ) ఇటీవల విలీనమైన ఆరు బ్యాంకుల్లో ఏదైనా బ్యాంక్‌లో మీకు చెక్ బుక్ ఉందా? అయితే ఆ చెక్ బుక్‌లకు తుది గడువు డిసెంబర్ 31. జనవరి 1వ తేదీ నుంచీ ఆ చెక్కులను గనక జారీ చేస్తే అవి చెల్లవు. అటు తర్వాత తేదీతో జారీ అయ్యే చెక్కులు తప్పనిసరిగా ఎస్బీఐ నుంచి పొందినవై ఉండాలి. నిజానికి ఈ గడువు సెప్టెంబర్ 30తోనే ముగిసింది. కస్టమర్ల సౌలభ్యం నిమిత్తం దీన్ని ఈ నెలాఖరు వరకూ పొడిగించారు. ఐదు అనుబంధ బ్యాంకులు– స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయ్‌పూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, భారతీయ మహిళా బ్యాంకు ఎస్బీఐలో పూర్తిస్థాయిలో విలీనమైన సంగతి తెలిసిందే. విలీనమైన బ్యాంకుల కస్టమర్లు కొత్త చెక్‌బుక్ కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం లేదా కస్టమర్ స్వయంగా తన సొంత బ్యాంక్ బ్రాంచీకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. -
చెక్కుతో అక్రమంగా సొమ్ము డ్రా
విజయనగరం , ఆనందపురం(భీమిలి) : బ్యాంకు నుంచి వ్యక్తి గత రుణం పొందిన అనంతరం హామీగా ఇచ్చిన చెక్కుల ద్వారా బ్యాంకు కార్యకలాపాల ప్రతినిధులు వేలాది రూపాయలు డ్రా చేసిన వైనంపై సోమవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితుడు పి.వి.వి.ప్రసాదరావు అందించిన వివరాల ప్రకారం... విజయనగరంలోని ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి ప్రసాదరావు రూ.2 లక్షలు వ్యక్తిగత రుణం పొంది ఈ ఏడాది ఫిబ్రవరి 10న బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ప్రతినిధికి హామీగా బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఐదు చెక్కులు అందజేశాడు. అప్పటి నుంచి ప్రసాదరావు క్రమం తప్పకుండా వాయిదాలను బ్యాంక్‌కు చెల్లిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రసాదరావు సెప్టెంబర్ 7న కొత్తగా కారు కొనుగోలు చేసి విజయనగరం వరుణ్ మోటార్స్ వారికి రూ.21 వేల చెక్కును అందజేశారు. అయితే ఖాతాలో డబ్బులు లేవని వరుణ్ మోటార్స్ వారు ప్రసాదరావుకు తెలపడంతో ఖాతా లావాదేవీలను పరిశీలించారు. దీంతో తాను ఇండస్ ఇండ్ బ్యాంక్‌కు హామీగా ఇచ్చిన చెక్కు నంబరు 000030 ద్వారా పి.కుసుమ హరనాథ్ అనే వ్యక్తి ఈ ఏడాది ఆగస్ట్ 29న రూ.90 వేలు డ్రా చేసినట్టు గుర్తించారు. ఈ మేరకు సోమవారం స్థానిక సీఐ ఆర్.గోవిందరావుకి ఫిర్యాదు చేశారు. దీంతో కుసుమ హరనాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఇండస్ ఇండ్ బ్యాంక్ సిబ్బందే తనకు చెక్కు అందించినట్టు హరనాథ్ విచారణలో వెల్లడించారు. సీఐ గోవిందరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘104’ రికార్డుల మాయం
నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: జిల్లా వైద్యారోగ్యశాఖ, జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) అధికారుల నిర్లక్ష్యంతో రెండు నెలల కిందట ‘104’ సేవల రికార్డులు మాయమయ్యాయి. చెక్బుక్లూ కూడా అదృశ్యమయ్యాయి. ఈ విషయాన్ని సిబ్బంది గోప్యంగా ఉంచారు. రికార్డులు పొరపాటున పోయాయా? లేక ఎవరైనా కావాలనే చేశారా అనే విషయాలు తెలియడం లేదు. జిల్లా వైద్యారోగ్యశాఖ, ఆ శాఖ కార్యాలయంలో ఉన్న ఎన్ఆర్హెచ్ఎం విభాగాధికారుల సంయుక్త ఆధ్వర్యంలో 104 వైద్య సేవల నిర్వహణ సాగుతోంది. ఎన్ఆర్హెచ్ఎం విభాగంలో ఆరుగురు పని చేస్తున్నారు. వీరిలో డీపీఎంఓ, డీపీఎం, ఏఓ, సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు. జిల్లాలో 104 వైద్య సేవలందించే వాహనాలు 20 ఉన్నాయి. దాదాపు 80 మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నారు. వీరి జీతభత్యాలు, వాహనాలకు అవసరమైన నిధుల రికార్డులన్నీ ఎన్ఆర్హెచ్ఎం సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. 104 సిబ్బంది సర్వీస్ రికార్డులు, బ్యాంక్ అకౌంట్ల నంబర్లు తదితర సమాచారం అంతా ఈవిభాగం వద్దే ఉంటుంది. ఇటీవల 104 సిబ్బంది జీతభత్యాల రికార్డులు, చెక్‌బుక్‌లు కన్పించకుండా పోయాయి. ఇవి ఏమయ్యాయో తెలియడంలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు కూడా తెలియకుండా ఆ విభాగ సిబ్బంది గోప్యత పాటించారు. తాము మీటింగ్‌లకు పోయినప్పుడు ఎక్కడైనా పోయి ఉంటాయేమోనన్న ఉద్దేశంతో పలు కార్యాలయాల చుట్టూ సిబ్బంది పరుగులు తీస్తున్నట్టు తెలిసింది. ‘వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు’ 104 సిబ్బంది రెండు నెలలుగా జీతాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. అంతకు ముందు సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల జీతాలు ఆలస్యంగా రావడం, ఉద్యమ విరామం తర్వాత కూడా జీతాలు లేకపోవడంతో సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు. తమకు జీతాలు ఇప్పించాలని సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫైళ్లు కన్పించకుండా పోయిన విషయాన్ని దాచిన ఎన్ఆర్హెచ్ఎం సిబ్బంది మాత్రం రేపు ఇస్తాం, మాపు ఇస్తామంటూ మభ్యపెడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈనెల కూడా జీతాలు లేనట్టే.. 104 సిబ్బందికి ఈనెల కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇందుకు ఎన్ఆర్హెచ్ఎం సిబ్బంది తీరే కారణం. నెలాఖరు దగ్గరకు వచ్చింది. జీతాలు ఇచ్చేందుకు పదిరోజుల సమయం ఉంది. రికార్డులు, చెక్‌బుక్‌లు పోయిన విషయాన్ని ఎన్ఆర్హెచ్ఎం సిబ్బంది ఇప్పుడు తెలియచేసినా పోయిన వాటిని మళ్లీ తయారు చేసేందుకు కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ జరిగేందుకు దాదాపు 15 నుంచి 20 రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో 104 సిబ్బందికి ఈ నెలకూడా జీతాలు వచ్చే పరిస్థితి కనబడటంలేదు. 104 సిబ్బంది సమస్యలను అధికారులు ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఎస్బీఐకి బదులు ఐసీఐసీఐ బ్యాంకు ఇప్పటి వరకు 104 సిబ్బంది జీతభత్యాలు, వాహనాలకు అవసరమైన డీజిల్ కోసం ఎస్బీఐ ఖాతాలో దాదాపు రూ.4 కోట్లు నిధులు నిల్వ ఉన్నాయి. అంతేకాకుండా ఇతర ఆరోగ్య కార్యక్రమాలకు వినియోగించేందుకు ఎన్ఆర్హెచ్ఎం నిధులు ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఎస్బీఐ చెక్‌బుక్ కన్పించక పోవడం, జీతాలు ఇవ్వాలంటూ సిబ్బంది ఒత్తిడి తేవడంతో తప్పని పరిస్థితిలో ఐసీఐసీఐ బ్యాంకులో డ్రా చేసి ఇచ్చేందుకు ఆ విభాగ సిబ్బంది ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై డీపీఎంఓ డాక్టర్ పెంచలయ్యను వివరణ కోరగా 104 రికార్డులు పోలేదన్నారు. రెండుమూడు రోజుల్లో జీతాలు ఇస్తామన్నారు.


