chamundeswari temple
-
మైసూరు మహాదేవి చాముండేశ్వరి
మనం మైసూర్ వెళ్తే 1008 మెట్లకి పసుపు కుంకుమ రాస్తూ మహిషాసుర మర్దినీ స్తోత్రాన్ని భక్తితో స్మరిస్తూ మెట్లు ఎక్కుతుంటారు భక్తులు. ఇలా మెట్లెక్కి దేవి దర్శనం చేసుకోవడం అనేది అమ్మ అనుగ్రహం ఉంటే కానీ జరగదని భక్తుల నమ్మకం. అలాగే దేవి నవరాత్రులు రోజులు వస్తే దేశం అంతటా వినబడే పేరు మైసూరు చాముండేశ్వరి ఉత్సవాలు. విదేశాల నుంచికూడా యాత్రికులు వచ్చి ఆసక్తితో చూస్తారు. ఏనుగు అంబారీ మీద మైసూరు రాజుల ఊరేగింపు ఎంతో ప్రసిద్ధి. మైసూరు మహా నగరంలో చాముండా పర్వతం మీద కొలువై ఉన్నారు చాముండేశ్వరీ దేవి. ఈ పర్వతాన్ని మొదట్లో మహాబల గిరి అని పిలిచేవారట. జగన్మాత చాముండేశ్వరి అవతారం ఎత్తి మహిషాసురుడిని వధించడంతో చాముండ పర్వతంగా పేరు పడింది. అమ్మచేతిలో మరణించే ముందు – ముందుగా తనకే దేవి భక్తులు పూజ చేసి దేవి దర్శనానికి వెళ్లాలని వరం పొందాడు మహిషాసురుడు. ఇప్పటికి జగన్మాత చాముండేశ్వరి దేవి దర్శనానికి వెళ్తున్నప్పుడు ముందుగా మహిషాసురుని దర్శించుకుని ఒక పుష్పాన్ని సమర్పిస్తారు. చాముండేశ్వరి దేవాలయం పక్కనే మహిషాసురుడి భయంకరమైన ప్రతిమ ఉంటుంది.శ్రీ చాముండేశ్వరి దేవాలయానికి మెట్ల దారి గుండా నడిచి వెళ్ళవచ్చు. బస్సు సౌకర్యం కూడా ఉంది. ఏడు అంతస్తులతో నిర్మించిన ఈ దేవాలయం శిల్ప కళా వైభవంతో అద్భుతంగా ఉంటుంది. ఏడవ అంతస్థు అర్ధ వృత్తాకారంగా ఉంటుంది. కలశ గోపుర ప్రతిష్ట గావించారు. ఆలయ ప్రవేశ ద్వారం అంతరాలయం దాటి గర్భగుడిలో వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవిని చూడడానికి రెండు కన్నులు చాలవు. దేవి దర్శనానికి వెళ్తున్నప్పుడు అరటి పండ్లు, పువ్వులు, పచ్చ రంగు చీర గాజులు కుంకుమ బియ్యం మల్లెపూల దండ దేవి సమర్పించి భక్తులు తమ కోరికలు విన్నవించుకుంటారు. ఆ తరువాత ఉద్దనహళ్లి వెళ్లి చాముండేశ్వరి దేవి సోదరి జ్వాలాముఖి త్రిపుర సుందరీ ఆలయాన్ని దర్శించుకోవాలి. ఇక్కడ దేవి ఉగ్రరూపిణిగా దర్శనం ఇస్తారు. శ్రీ చాముండేశ్వరి దేవాలయం దగ్గర మహా నందీశ్వరుని పెద్ద శిల్పం జీవ కళ ఉట్టి పడుతుంటుంది. దేవాలయాన్ని పెద్ద పెద్ద నల్లని రాతి పలకలతో నిర్మించారు. సుమారు వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం ఇది. మొదట్లో రాజ వంశస్థులకి మాత్రమే దేవి దర్శనం ఉండేది. ఆ తరువాత ప్రజలకి జగన్మాత దర్శనం అనుగ్రహం లభించింది. మైసూరు రాజులూ చామరాజ, ఒడయార్ వంశస్థులు దేవి దాసులు అయ్యారు. ఇప్పటికి రాజవంశీకుల ఆధ్వర్యంలోనే దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ చాముండేశ్వరి దేవిని దర్శించుకుని కొల్లూరు శ్రీ మూకాంబిక దేవి దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ. ఆ ఆలయం ఇక్కడకు దగ్గర కూడా.– ఈఎస్ మాధవన్, విశాఖపట్నం (చదవండి: సామాన్యులు సైతం సులభంగా భగవంతుని అనుగ్రహం పొందాలంటే..) -
చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించిన రామ్ చరణ్, ద్రావిడ్
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా వారాంతం ప్రారంభంలోనే చాముండేశ్వరిని దర్శించుకున్నారు. రామ్ చరణ్ తన 'గేమ్ ఛేంజర్' చిత్ర బృందంతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం చాముండేశ్వరి దర్శనం చేసుకున్నారు. రామ్ చరణ్ తన తదుపరి చిత్రం గేమ్ ఛేంజర్ షూటింగ్ కోసం మైసూరులో ఉంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయానికి వెళ్లారు. రాహుల్ ద్రావిడ్ తన కుమారుడి క్రికెట్ ఆట చూసేందుకు మైసూర్ వచ్చారు. ఇదే సమయంలో చాముండి కొండను ఆయన సందర్శించారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ తన భార్య విజయతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అండర్-19 కూచ్ బెహార్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ కర్ణాటక, ఉత్తరాఖండ్ మధ్య మైసూరులోని మానసంగోత్రిలో ఉన్న శ్రీకాంత్ దత్తా నరసింహరాజ వడయార్ స్టేడియంలో జరుగుతోంది. ఇందులో ద్రవిడ్ కుమారుడు ఆడుతున్నాడు. అతని ఆటను చూసేందుకు ద్రావిడ్‌తో పాటు అతని భార్య మైసూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈ స్టార్స్ చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ద్రావిడ్,రామ్ చరణ్‌తో సెల్ఫీలు దిగారు. -
చాముండేశ్వరీ ఆలయంలో చోరీ
చిలప్‌చెడ్(నర్సాపూర్): చాముండేశ్వరీ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు దొంగతానానికి పాల్పడిన సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఆలయ తలుపులు తెరిచేందుకు మోతీలాల్ శర్మ వెళ్లగా గేట్ తాళం పగులగొట్టి ఉందని, ఈ విషయం ఆలయ నిర్వహకుడు శోభన్‌కు తెలియజేయగా, అతను పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా దుండగులు ఆలయ మెయిన్ గేటు తాళం పగులగొట్టి, ప్రసాదం కౌంటర్ గ్రిల్స్ తొలగించి కౌంటర్లోని సుమారు రూ.6వేలు దొంగలించి, బీరువాలోని రికార్డులు చిందరవందర చేసినట్టు గ్రహించారు. అక్కడే ఉన్న కంప్యూటర్ మానిటర్, ఎంప్లిఫైర్ తో పాటు హోమగుండం వద్ద ఉన్న చిన్న హుండీ దొంగలించారని వారు గుర్తించారు. ఆ హుండీని ఆలయం వెనుకల పడేశారని వెల్లడించారు. అనంతరం గుడిలోని సీసీ పుటేజీలను పరిశీలించగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వ్యక్తి హుండీని ఎత్తుకెళ్లినట్లు రికార్డు అయినప్పటికీ ఫుటేజ్ క్లారిటీ లేదని పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యమే కారణమా..? ఆలయంలో సిబ్బంది నిర్లక్ష్యంతోనే దొంగతనం జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయంలో నిద్రించాల్సిన సిబ్బంది, వాచ్మెన్లే ఆలయంలో లేరని, మొత్తం 8 సీసీ కెమెరాలు ఉన్న ఆలయంలో కేవలం ఐదు మాత్రమే ఎందుకు పనిచేస్తున్నాయని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే పనిచేస్తున్న వాటినలో రెండు మాత్రమే క్లారిటీ ఉన్నాయని. ఆలయ నిర్వహకులు సీసీ కెమెరాల నిర్వహణ కూడ సక్రమంగా నిర్వహించకపోవడం గమనార్హం. కాగా త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఎస్సై పేర్కొన్నారు. -
చాముండేశ్వరీదేవి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
గంగపట్నం(ఇందుకూరుపేట): మండలంలోని గంగపట్నంలో కొలువైన చాముండేశ్వరీదేవి అమ్మవారి నూతన సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. కొర్నా బలరామయ్య జ్ఞాపకార్థంగా కేబీఆర్ ఆర్థోపెడిక్ ఆస్పత్రి(నెల్లూరు) ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ నటులు భానుచందర్, చంద్రమోహన్, గుండు హనుమంతురావు ముఖ్యఅతిథులుగా హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా భానుచందర్ మాట్లాడుతూ మానవ జన్మ ఉత్తమమైనదన్నారు. సమాజంలో అందరూ సమానమేనన్నారు. కోరికలు నెరవేర్చుకోవాలంటే ముందు మనిషి ఆరోగ్యాన్ని కాపడుకోవాలన్నారు. వ్యాయామం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. చంద్రమోహన్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. గుండు హునుమంతరావు మాట్లాడుతూ అమ్మవారి క్యాలెండర్ ఆవిష్కరణకు హాజరుకావడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేబీఆర్ ఆర్థోపెడిక్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ జీ సతీష్‌కుమార్ సతీమణి డాక్టర్ స్వప్న, మదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు కొర్నా నారాయణరావు ముదిరాజ్, కొనగట్ల రఘురాం ముదిరాజ్, జిల్లా నాయకులు జీ ఎల్లయ్య ముదిరాజ్, పీఎల్ రావు ముదిరాజ్, కొలపర్తి రమేష్, తదితరులు పాల్గొన్నారు.


