chalasani sreenivas
-
కేంద్రానికి తొత్తుగా మారిన చంద్రబాబు
కడప వైఎస్ఆర్ సర్కిల్: దేశంలో, రాష్ట్రంలో మానవత్వాలు లేని ప్రభుత్వాలు అధికారంలో ఉండటం ప్రజలు చేసుకున్న దురదృష్టకరమని విభజన హామీల అమలు సాధన కమిటీ కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని అంబేడ్కర్ సర్కిల్లో జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలంటూ ఆర్సీపీ చేపట్టిన అమరణ నిరాహార దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని గత ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ తిరుమల వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి దాదాపు మూడున్నరేళ్లయినా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమను పోరాటాల ద్వారానే సాధించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుతో సీమ ప్రాంతంలోని గాలేరు నగరి, హాంద్రీనీవా వంటి ప్రాజెక్టుల పూర్తి కాలేదన్నారు. ప్రాజెక్టుల పూర్తికి దాదాపు రూ. 6వేల కోట్లు అవసరం కాగా పాత బిల్లుల కింద కేవలం రూ.3వేల కోట్లు చెల్లించడం దారుణమన్నారు. విభజన హామీలు నెరవేర్చాలని ముఖ్య మంత్రి చంద్రబాబు కేంద్రంతో చర్చించి నిలదీయాల్సింది పోయి కనీసం అడిగిన దాఖలాలు కూడా లేవని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్. రవిశంకర్‌రెడ్డి, సీనియర్ నాయకులు లింగమూర్తి, నగర కార్యదర్శి మగ్బూల్ బాషా, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి జకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
సీమాంధ్ర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు
పార్టీలను కోరిన ఆంధ్రా మేధావుల వేదిక నేత చలసాని సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర సమగ్రాభివృద్ధికోసం అన్ని రాజకీయపార్టీలు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఆంధ్రా మేధావుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వేదిక ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ ‘సీమాంధ్ర ముందున్న సవాళ్లు-మెరుగైన భవిష్యత్తుకు మార్గదర్శక ప్రణాళిక’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. చలసాని మాట్లాడుతూ.. హేతుబద్ధతతో, ఒక జాతీయ విధానంతో అందరికీ న్యాయం చేస్తూ రాష్ట్ర విభజన చేసినట్టయితే బాగుండేదన్నారు. సీమాంధ్రలో ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓ పుస్తకాన్ని రూపొందించి ప్రజల్లోకి తీసుకెళతామని, తద్వారా రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచి సీమాంధ్ర ఆర్థికాభివృద్ధికోసం ప్రణాళిక రూపొందించేలా చేస్తామని చెప్పారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. సీమాంధ్రలో వనరులను ఉపయోగించుకుని అన్నిరంగాల్లో అభివృద్ధి అయ్యేలా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో విద్యుత్, సహజ వనరులు, మౌలిక సదుపాయాలు, నీటిపారుదల, ఆర్థిక రంగం, రాజధాని లాంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కాంతారావు, విశ్రాంత ఐపీఎస్ గుర్రప్ప, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. -
సీమాంధ్రుల హక్కుల కోసం పోరాటం
భీమవరం, న్యూస్‌లైన్ : సీమాంధ్రుల హక్కుల కోసం పోరాటం చే యనున్నట్లు ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో పోల వరం ప్రాజెక్ట్, ముంపు ప్రాంతాలు అనే అంశ ంపై సదస్సు నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతం జల వనరులు, విద్యుత్, మౌలిక సదుపాయాలు వంటి సమస్యలతో సతమతమవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి, భద్రాచలం ప్రాంతాన్ని సీమాంధ్రలో కలపకపోతే గోదావరి డెల్టా ప్రాంతం ఉప్పు కయ్యలుగా మారిపోతుందన్నారు. సీమాంధ్రలో ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను కలుపుతూ కేంద్ర కేబినేట్ తీర్మానం చేసిం దని, అరుుతే ఆర్డినెన్స్ రూపంలో రావాల్సి ఉందన్నారు. ఇందుకోసం పోరాటం చేయూల్సిన అవసరం ఉందన్నారు. సీమాంధ్రలో రాజధాని నిర్మాణం, మౌలిక వసతులు ఏర్పాటుకు కూడా కేంద్ర ఆర్డినెన్స్ విడుదల చేయూల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా భవిష్యత్‌లో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దుమ్ముగూడెం, చర్ల మండలాలను సీమాంధ్రలో కాలపాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పొందుపర్చాలన్నారు. దీనికి సీమాంధ్రలో పోరా టాన్ని ఉధృతం చేస్తామన్నారు. కార్యాచరణ రూపకల్పనకు ఈనెల 16వ తేదీన హైదరాబాద్‌లో మేధావులసదస్సు ఏర్పాటు చేశామన్నారు. సదస్సులో న్యాయవాదులు, వైద్యులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, మేధావులు పాల్గొంటారన్నారు. జల వనరుల నిపుణులు డాక్టర్ పీఏ రామకృష్ణంరాజు పవర్ పారుుంట్ ప్రజంటెషన్ ద్వారా పోలవరం ముంపు ప్రాంతాలు, సీమాంధ్రలో కలపాల్సిన మండలాలపై వివరించారు. సదస్సులో రైతు నాయకులు మంతెన సూర్యనారాయణరాజు, రుద్రరాజు పండు రాజు, పాతపాటి మురళి, మెంటే సోమశ్వరరావు, విద్యావేత్తలు ఆదిత్య కృష్ణంరాజు, సమైక్యాంధ్ర నాయకుడు వడ్డి సుబ్బరావు, గంటా సుందరకుమార్, బోడపాటి పెదబాబు, జంపన ఫణిబాబు, ముగ్దుం అలీ పాల్గొన్నారు.