సీమాంధ్రుల హక్కుల కోసం పోరాటం | fight for seemandhra rights | Sakshi
Sakshi News home page

సీమాంధ్రుల హక్కుల కోసం పోరాటం

Mar 8 2014 3:02 AM | Updated on Sep 2 2017 4:27 AM

సీమాంధ్రుల హక్కుల కోసం పోరాటం చే యనున్నట్లు ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో పోల వరం ప్రాజెక్ట్, ముంపు ప్రాంతాలు అనే అంశ ంపై సదస్సు నిర్వహించారు.

 భీమవరం, న్యూస్‌లైన్ :
 సీమాంధ్రుల హక్కుల కోసం పోరాటం చే యనున్నట్లు ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో పోల వరం ప్రాజెక్ట్, ముంపు ప్రాంతాలు అనే అంశ ంపై సదస్సు నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతం జల వనరులు, విద్యుత్, మౌలిక సదుపాయాలు వంటి సమస్యలతో సతమతమవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి, భద్రాచలం ప్రాంతాన్ని సీమాంధ్రలో కలపకపోతే గోదావరి డెల్టా ప్రాంతం ఉప్పు కయ్యలుగా మారిపోతుందన్నారు.
 
  సీమాంధ్రలో ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను కలుపుతూ కేంద్ర కేబినేట్ తీర్మానం చేసిం దని, అరుుతే ఆర్డినెన్స్ రూపంలో రావాల్సి ఉందన్నారు. ఇందుకోసం పోరాటం చేయూల్సిన అవసరం ఉందన్నారు. సీమాంధ్రలో రాజధాని నిర్మాణం, మౌలిక వసతులు ఏర్పాటుకు కూడా కేంద్ర ఆర్డినెన్స్ విడుదల చేయూల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా భవిష్యత్‌లో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దుమ్ముగూడెం, చర్ల మండలాలను సీమాంధ్రలో కాలపాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పొందుపర్చాలన్నారు. దీనికి సీమాంధ్రలో పోరా టాన్ని ఉధృతం చేస్తామన్నారు. కార్యాచరణ రూపకల్పనకు ఈనెల 16వ తేదీన హైదరాబాద్‌లో మేధావులసదస్సు ఏర్పాటు చేశామన్నారు. సదస్సులో న్యాయవాదులు, వైద్యులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, మేధావులు పాల్గొంటారన్నారు.
 
  జల వనరుల నిపుణులు డాక్టర్ పీఏ రామకృష్ణంరాజు పవర్ పారుుంట్ ప్రజంటెషన్ ద్వారా పోలవరం ముంపు ప్రాంతాలు, సీమాంధ్రలో కలపాల్సిన మండలాలపై వివరించారు. సదస్సులో రైతు నాయకులు మంతెన సూర్యనారాయణరాజు, రుద్రరాజు పండు రాజు, పాతపాటి మురళి, మెంటే సోమశ్వరరావు, విద్యావేత్తలు ఆదిత్య కృష్ణంరాజు, సమైక్యాంధ్ర నాయకుడు వడ్డి సుబ్బరావు, గంటా సుందరకుమార్, బోడపాటి పెదబాబు, జంపన ఫణిబాబు, ముగ్దుం అలీ పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement