breaking news
chakrasna
-
జాగృత శక్తి! ఆరు చక్రాల రహస్యమేంటి?
రాజయోగలో యమ, నియమ, ఆసనాదులను గూర్చి చెబుతారు. అందులోనే కుండలిని గూర్చి ఉంటుంది. ప్రతి మనిషిలో ఆరు చక్రాలుంటాయనీ, ఆ చక్రాల్లో అట్టడుగున ఉన్న మూలాధార చక్రంలో కుండలిని ఉంటుందనీ, యోగాభ్యాసం ద్వారా దాన్ని క్రమంగా పైనున్న చక్రాలకు తీసుకపోవాలనీ చెబుతారు. యోగాన్ని అత్యంత శ్రద్ధతో అభ్యసించిన విశ్వమాత కృష్ణాబాయి ఇలా చెబుతారు:కుండలిని మూలాధార చక్రములో నిద్రాణమై ఉంటుంది. అప్పుడా వ్యక్తి దృక్పథం కేవలం భౌతికంగా ఉంటుంది. ఒక మహాత్ముని సంపర్కం వల్ల ఆ కుండలిని జాగృతమై దాని పై కేంద్రానికి చేరుతుంది. ఆ వ్యక్తికి అప్పుడు ధార్మిక జీవనం గడపాలనే ఆకాంక్ష కలుగుతుంది. కుండలిని పై కేంద్రానికి చేరుతుంది. అతడు అంత కంతకూ సత్సంగం, దేవాలయ సందర్శనను కోరుతాడు. కుండలిని ‘అనాహత’ అను నాల్గవ కేంద్రాన్ని చేరుతుంది. అప్పుడా వ్యక్తి గురువును తన ఆత్మీయునిగా భావిస్తాడు. అతని దృష్టిని ఆ భావన విస్తరింప చేస్తుంది.ఆ శక్తి (కుండలిని) విశుద్ధమనే అయిదవ చక్రాన్ని చేరినపుడు గురువు అవ్యక్త స్థితిని తెలుసుకుంటాడు. గురువుని గూర్చి, లేక ఆ భగవంతుని స్థితిని గూర్చి అధికంగా మాట్లాడుతాడు. తర్వాత కుండలిని పై చక్రమైన ఆజ్ఞాచక్రాన్ని చేరుతుంది. అప్పుడు ఆ సాధకునకు భగవద్దర్శనమై అతని మనస్సు క్రమంగా అవ్యక్తస్థితి వైపు ఆకర్షితమవుతుంది. అక్కడే అతనికి కొన్ని సిద్ధులు అబ్బుతాయి. అతడు వాటికి లోబడితే పతనమవుతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.బయటి నుండి గురువు సాధకుణ్ణి ఈ కేంద్రం వరకు మాత్రమే ప్రేరేపించగలడు. దీని తరువాత హృదయంలో ఉన్న గురువునుండి మార్గదర్శనం వస్తుంది (పుటలు 81, 82 – విశ్వమాత కృష్ణాబాయి – ఆనందా శ్రమం, కేరళం). ఆమె అంతవరకే చెప్పి తన గురువైన రామదాసు కృపవల్ల తనకు ఆజ్ఞా చక్రం నుండి కుండలిని అధికమైన వేగంతో మెరుపును మించిన కాంతితోను పైకి పోయిందనీ, తనకు అనిర్వచనీయమైన ఆనందం కలిగిందనీ అంతకుమించి ఇక ఏమీ చెప్పజాలననీ అంటారు.– రాచమడుగు శ్రీనివాసులు -
శాస్త్రోక్తంగా చక్రస్నానం
– వైభవంగా ద్వాదశారాధనం, పుష్పయాగం ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో సోమవారం ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా తీర్థవారి చక్రస్నానం నిర్వహించారు. ఉదయం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ప్రత్యేకంగా అలంకరించి దిగువ అహోబింలోని కోనేరు వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వస్త్రాలు మార్చి పీఠాధిపతి శ్రీ రంగానాథ యతీంద్ర మహాదేశికన్, ముద్రకర్త శ్రీమాన్ శఠకోప వేణుగోపాలన్ ఆ«ధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు స్వామి అమ్మవార్ల ఎదుట సుదర్శనమూర్తికి, నిత్య అభిషేకమూర్తులకు కలిపి పంచామృతాభిషేకం, అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం నవకలశ ప్థాపన, కుంకుమార్చనలు చేశారు. అనంతరం సుదర్శనమూర్తికి, నిత్య అభిషేక ఉత్సవమూర్తికి కోనేరులో చక్రస్నానం చేయించారు. వైభవంగా ద్వాదశరాధనం, పుష్పయాగం బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం ద్వాదశరాధనం, పుష్పయాగ కార్యక్రమాలు వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామికి ఆరాధన దోషాలను నివృత్తి చేసుకోవడం కోసం 12 మార్లు తిరువారాధన చేసి 12 రకాల భక్షాలను 12 రకాల అన్నముతో నివేదించారు. అనంతరం శ్రీ ప్రహ్లాదవరదస్వామి కొలువై భక్తులకు దర్శన మిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, ఈఓ మల్లిఖార్జున ప్రసాదులు పాల్గొన్నారు


