breaking news
cell phone calls
-
ఆ ఒక్క ఫోన్ కాల్‌తో జీవితం మారిపోయింది!
1973 ఏప్రిల్ 3. న్యూయార్క్ నగరంలోని మన్హటన్ వీధులు ఎప్పటిలాగే రద్దీగా ఉన్నాయి. సిక్స్త్ ఎవెన్యూలో అటు ఇటు నడుస్తున్న జనం మధ్య ఒక వింత దృశ్యం ఆవిష్కృతమైంది. మోటరోలా కంపెనీలో పనిచేసే మార్టిన్ కూపర్ (martin cooper) అనే ఇంజినీర్ ఒక కిలో బరువు, తొమ్మిది అంగుళాల పొడవున్న ఒక ఇటుక లాంటి వస్తువును చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాడు. చుట్టుపక్కల వారు ఆశ్చర్యంగా చూస్తున్నారు.అప్పటి వరకు ఫోన్ అంటే ఒక వైరుతో గోడకు అతుక్కుని ఉండాలి, లేదా కారులో భారీ బ్యాటరీల సాయంతో నడవాలి. కానీ కూపర్ చేతిలో ఉన్నది ఒక ‘పోర్టబుల్’ సెల్యులార్ ఫోన్. పేరు డైనాటాక్. దాని నుంచి వెళ్ళిన మొదటి కాల్ ఎవరికో తెలుసా? అతని ప్రత్యర్థికి! అవును, బెల్ లాబొరేటరీస్‌లో తనలాగే మొబైల్ టెక్నాలజీపై పనిచేస్తున్న జోయెల్ ఏంగెల్కు కూపర్ కాల్ చేశాడు. ‘జోయెల్, నేను ఒక నిజమైన పోర్టబుల్ సెల్యులార్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను’ అని గర్వంగా ప్రకటించాడు. ఈ మాటలు విన్న ప్రత్యర్థి నుంచి చాలాసేపటివరకూ నిశ్శబ్దమే సమాధానం అయ్యింది. అది కేవలం ఒక ఫోన్ కాల్ మాత్రమే కాదు, ఒక ఆధిపత్య పోరాటంలో విజయ ప్రకటన!అప్పట్లో అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ (ఏటీ అండ్ టీ) సంస్థకు టెలిఫోన్ రంగంలో గుత్తాధిపత్యం ఉండేది. కారులో బ్యాటరీ సాయంతో పనిచేసే మొబైల్ రేడియో ఫోన్లను ఆ కంపెనీ తయారు చేసేది. కూపర్ ‘మనిషికి విముక్తి కావాలి, కారుకు ఫోన్ కట్టేయడం ఏమిటి?’ అని ప్రశ్నించేవాడు. 1947లోనే బెల్ లాబ్స్ శాస్త్రవేత్తలు ఒక పెద్ద ప్రాంతాన్ని చిన్న చిన్న ‘సెల్స్’గా విభజించి సమాచారాన్ని చేరవేయవచ్చని సిద్ధాంతీకరించారు. ఆచరణలో అది సాధ్యం కావడానికి దశాబ్దాలు పట్టింది.చదవండి: గుర్రం లాగిన రైలుబండి1950ల నాటి మొబైల్ ఫోన్లు సుమారు 18 నుంచి 36 కిలోల బరువుండేవి. కూపర్ సృష్టించిన డైనాటాక్ వచ్చే వరకు అవి మనిషి చేతిలోకి రాలేదు. అది సామాన్యులకు అందుబాటులోకి రావడానికి మరో పదేళ్లు పట్టింది. 1983లో మోటరోలా డైనాటాక్ గీ మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని ధర 3,995 డాలర్లు. ధనవంతులకు, వ్యాపార వేత్తలకు మాత్రమే అది పరిమితమైంది.అదృశ్య బంధనాల్లో మనిషిఈ మొబైల్ విప్లవం మనిషి జీవన శైలిని పూర్తిగా మార్చేసింది. ఇంటికి వెళ్తే ఆఫీసు పనితో సంబంధం ఉండేది కాదు. కానీ ఇప్పుడో? 24 గంటలూ ఎవరో ఒకరికి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి! సామాజికంగా చూస్తే, మనుషుల మధ్య దూరం పెరుగు తోంది. పక్కనే కూర్చున్న వ్యక్తితో మాట్లాడటం మానేసి, వేల మైళ్ల దూరంలో ఉన్న వ్యక్తితో ఫోన్లో గడపడం మనకు అలవాటైంది. ఉద్యోగ ఒత్తిడి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకప్పుడు ‘ఇటుక’లా ఉన్న ఫోన్, ఇప్పుడు మన మెదడును నియంత్రించే ఒక మహాశక్తిగా మారింది.చదవండి: జేఈఈ మెయిన్స్ ఆఫ్‌లైన్‌లో పెట్టలేరా?సాంకేతికత రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. అది ఇచ్చే సౌకర్యాలను అనుభవిస్తూనే, అది మన సామాజిక విలువ లను, వ్యక్తిగత ప్రశాంతతను దెబ్బతీయకుండా చూసుకోవడం మన బాధ్యత. కూపర్ ఆ రోజు వేసిన అడుగు ప్రపంచాన్ని దగ్గర చేసింది, కానీ మనల్ని మనకు దూరం చేయకుండా చూసు కోవాల్సిన బాధ్యత మన పైనే ఉంది. మొబైల్ కాల్ కేవలం ఒక ఇంజినీరింగ్ విజయం మాత్రమే కాదు, అది మానవ పరిణామ క్రమంలో ఒక కొత్త అధ్యాయం. -
ఇంటి దొంగ పనే.. ?
గుడివాడలో రూ.11 లక్షల చోరీ ఘటన వెనుక సెక్యూరిటీ గార్డు హస్తం? సెల్‌ఫోన్ కాల్స్ ఆధారంగా కూపీ లాగిన పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు గుడివాడ : పట్టణంలోని ఏలూరు రోడ్డులో కొద్దిరోజుల కిందట జరిగిన రూ.11 లక్షల దొంగతనం కేసులో కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచా రం. సెల్‌ఫోన్ కాల్స్ జాబితాల ఆధారంగా సీసీఎస్ పోలీసులు ఈ కేసు దర్యాప్తులో గణనీయ పు రోగతి సాధించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సీఎంఎస్ వాహనంలో బాధితుడు రాంప్రసాద్ వెంట వచ్చిన సెక్యూరిటీ గార్డుపైనే పోలీసులకు అనుమానం ఉన్నట్లు తెలిసింది. ఆ దిశగా పోలీ సులు విచారణ చేస్తున్నారు. గార్డు బంధువులే చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై గుడివాడ డీఎస్పీ నేతృత్వంలో రెండురోజులుగా దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఇతర జిల్లాలకు చెందిన దొంగల పనేనని పోలీసులు ముందుగా భావించారు. అయితే దొంగతనం జరిగిన తీరు.. సెక్యూరిటీ సిబ్బంది ఉండి కూడా కనీసం పట్టించుకోకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. సీఎం ఎస్ కస్టోడియన్ లక్కరాజు రాంప్రసాద్ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే ఆగంతకులు కూడా రావడంతో దీని వెనుక ఇంటిదొంగల హస్తం ఉందా? అని పోలీసులు అనుమానించారు. రాంప్రసాద్ వెంట ఉండే సిబ్బందిలో ఒకరు ఆయన కదలికలను ఎప్పటికప్పుడు నిందితులకు తెలియజేసి ఉంటారని భావిస్తున్నారు. దీంతో ఆయన ఇంటికి వచ్చిన వెంటనే దుండగులు కూడా వచ్చి కళ్లలో కారం చల్లి దొంగతనానికి పాల్పడగలిగారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు ముమ్మరం డీఎస్పీ నేతృత్వంలో కేసు దర్యాప్తు శరవేగంగా సాగుతోంది. పరారీలో ఉన్న నిందితుల కోసం సీసీఎస్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సెల్‌ఫోన్ కాల్స్ లిస్టే పట్టించిందా? ఈ కేసుకు సంబంధించి ఏలూరు రోడ్డులోని బ్యాంకుల వెలుపల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసు అధికారులు ముందుగా పరిశీలించారు. అయితే వాటిలో దృశ్యాలు స్పష్టంగా లేకపోవడంతో ఆ ప్రాంతంలో ఉన్న సెల్ టవర్ల పరిధిలో పనిచేసిన సెల్ఫోన్ల జాబితాలను సేకరించారు. ఘటన జరి గిన సమయానికి ముందు రాంప్రసాద్ వద్ద పనిచేస్తున్న వారికి ఫోన్‌కాల్స్ వచ్చాయి. దీంతో సెక్యూరిటీ గార్డు, డ్రైవర్ సెల్ఫోన్ల కాల్స్ లిస్టును పరిశీలించారు. రాంప్రసాద్ వద్ద పనిచేస్తున్న గార్డుకు నిందితులు పదేపదే కాల్స్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలిందని తెలిసింది. దీంతో అతడి బంధువులే చోరీకి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారని సమాచారం. నిందితులు ఎవరనేది కూడా పోలీసుల వద్ద సమగ్ర సమాచారం ఉన్నట్లు తెలిసింది.


