breaking news
celestial spectacle
-
ఐరోపాలో ‘చీకట్లు’ కమ్ముకున్న వేళ..
న్యూఢిల్లీ: ఆగస్టు 12(బుధవారం) నాడు ఐరోపా ఖండంలో అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు స్పెయిన్, గ్రీన్లాండ్, ఐస్లాండ్ తదితర ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలు ఆకాశం వైపు ఆసక్తిగా చూశారు. 1999 ఆగస్టు 11 తర్వాత ఐరోపా ప్రధాన భూభాగంలో కనిపించిన తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే కావడం విశేషం. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపైకి రావడం వల్ల, చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకోవడంతో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది.స్పెయిన్‌లోని పలు నగరాల్లో ప్రజలు ఈ ఖగోళ అద్భుతాన్ని కళ్లారా చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఆకాశం నిర్మలంగా ఉండటంతో, పగటిపూట కాసేపు చీకటి అలముకున్న దృశ్యాన్ని చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇక స్విట్జర్లాండ్‌లో ఖగోళ ప్రేమికులు గ్రహణాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. బ్రిటన్‌లో సూర్యుడిలో 90 శాతానికి పైగా భాగాన్ని చంద్రుడు కమ్మేయడంతో, అక్కడ వాతావరణం మరింత నాటకీయంగా మారింది.లండన్‌లోని ప్రసిద్ధ బిగ్ బెన్ టవర్ వద్ద ఈ అద్భుత దృశ్యాన్ని పలువురు ఫొటోల రూపంలో బంధించారు. హంగేరీలోనూ ప్రజలు ప్రత్యేక అబ్జర్వేషన్ టవర్ల ద్వారా ఈ గ్రహణాన్ని తిలకించారు. అయితే, భారతీయులకు మాత్రం ఈ అరుదైన దృశ్యం కనిపించలేదు. ఈ గ్రహణం సంభవించిన సమయంలో (భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 2:15 గంటల వరకు) భారతదేశంలో రాత్రి సమయం కావడంతో, సూర్యాస్తమయం కారణంగా భారత ఉపఖండంలో ఎక్కడా గ్రహణం కనిపించలేదు. -
ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం..
సాక్షి, న్యూఢిల్లీ: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఐదు గ్రహాలు ఒకే కక్ష్యపై కనువిందు చేశాయి. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, యురేనస్ గ్రహాలు ఒకే రేఖలో 50 డిగ్రీల పరిధిలో కనిపించాయి. ఆకాశంలో కనిపించే ఈ అరుదైన ఘటన సూర్యాస్తమయం తర్వాత కనిపించింది. సూర్యా స్తమయం తర్వాత పశ్చిమం వైపు 50 డిగ్రీల పరిధిలో ఐదు గ్రహాలు కనిపించాయి. భూమిపై నుంచి చూసేటప్పుడు.. ఐదు గ్రహాలు ఒకే రేఖపై ఆర్క్ ఆకారంలో కనిపించాయి. చదవండి: వామ్మో.. కోట్లు పలుకుతున్న లిక్కర్.. ఖాళీ బాటిల్ కూడా ఖరీదే గురూ! -
ఖగోళ అద్భుతం..99ఏళ్ల తరువాత
న్యూఢిల్లీ: ఆగస్టు21న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. అమెరికాఖండంలోని 14 రాష్ట్రాల్లో ఏర్పడనుందని నాసా ప్రకటించింది. 2017 ఆగస్టు 21 న సంభవించే ఇది చాలా అరుదైన గ్రహణమనీ, ఖగోళ అద్భుతం మని నాసా అభివర్ణించింది. మనిషి జీవితంలో ఒకసారి మాత్రమే లభించే అవకాశమని, 99 సంవత్సరాలలో ఇది మొదటిదని పేర్కొంది. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో, సూర్యుడు, భూమికి మధ్యనుంచి చంద్రుడు దాటుడూ ఒకవైపు సూర్యుడు మొత్తం కప్పి వేయడంతో ఆకాశంలో సూర్యుడు కనిపించడని పేర్కొంది. దాదాపు గంటన్నర పాటు ఈ సూర్యగ్రహణం కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖగోళ ఈవెంట్‌ను దాదాపు 300 మిలియన్ల కన్నా ఎక్కువ మంది వీక్షించనున్నారని నాసా అంచనా వేసింది. అలాగే ఈ గ్రహణాన్ని వీక్షించాలనుకునేవారు సరైన భద్రా ప్రమాణాలను పాటించాలని నాసా సిఫారసు చేసింది. ముఖ్యంగా ఎక్లిప్ గ్లాసెస్ లేదా హ్యాండ్ హెల్డ్ సోలార్ వ్యూయర్ లాంటి ప్రత్యేక ప్రయోజన సౌర ఫిల్టర్లను మాత్రమే వాడాలని సూచించింది. మరోవైపు ఈ గ్రహణం కారణంగా ఆగస్టు 21వ తేదీన అమెరికా అంతటా మిట్ట మధ్యాహ్నం సూర్యుడు మాయం కానున్నాడు. గ్రేట్ అమెరికన్ సోలార్ ఎక్లిప్స్ అని పిలిచే ఈ గ్రహణం పోర్ట్లాండ్ నుంచి ఓరెగాన్ మీదుగా, దక్షిణ కరోలినాలోని చార్లెస్టన్ సూర్యుడు మాయమయ్యి చీకటి ఆవరిస్తుంది. రెండు నిమిషాల కొన్నిసెకన్లపాటు ఆకాశంలో చుక్కలు కూడా కనిపిస్తాయట. కాగా 99 సంవత్సరాల క్రితం, 1918, జూన్ 8వ తేదీన వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడా వరకు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది.


