breaking news
CDK
-
హైదరాబాద్‌లో వ్యాపార విస్తరణ.. కొత్త కేంద్రం ప్రారంభం
ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామి సంస్థ అయిన సీడీకే, హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి అదనంగా 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ విస్తరణ ఉత్తర అమెరికాలో తమ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి అవసరమైన నైపుణ్యం, సాంకేతికతపై పెట్టుబడి పెట్టడానికి సంస్థకు ఉన్న నిబద్ధతను నొక్కి చెబుతోంది.మాదాపూర్‌లోని రహేజా మైండ్‌స్పేస్‌లో ఉన్న ఈ కేంద్రం, ఉత్పత్తిని వేగవంతం చేయడంతో పాటు వినియోగదారులకు మరింత సేవలను అందించనుంది. ఇది ఉత్తర అమెరికాలోని R&D, ఇన్నోవేషన్ బృందాలతో కలిసి పనిచేస్తూ.. సమగ్ర విధానాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ అత్యాధునిక కార్యాలయం ఉద్యోగుల మధ్య సహకారం, సృజనాత్మకత, శ్రేయస్సును పెంపొందించే విధంగా రూపొందించారు. ఇందులో ఓపెన్ వర్క్‌స్పేస్‌లు, అత్యాధునిక సమావేశ గదులు, వినోద ప్రాంతాలు ఉన్నాయి. తద్వారా భారత్ అపారమైన ప్రతిభకు, నిరంతర ఆవిష్కరణలకు ఒక శక్తి కేంద్రమని సీడీకే మరోసారి స్పష్టం చేసింది. -
నవంబర్ 4న సీబీఎల్ షురూ
సాక్షి, హైదరాబాద్: సీడీకే గ్లోబల్ కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్ (సీబీఎల్) నవంబర్ 4నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు చెందిన సీడీకే గ్లోబల్ కంపెనీ, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీజీబీఏ) సంయుక్తంగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాయి. పీజీబీఏలో మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో దాదాపు 200 కార్పొరేట్ కంపెనీలకు చెందిన 500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.