breaking news
cases against
-
భర్తల ఉద్యోగాలను ఊడగొడుతున్నారు..!
సాక్షి, న్యూఢిల్లీ: వైవాహిక వివాదాల నేపథ్యంలో భర్తలు పనిచేసే సంస్థల యాజమాన్యాలకు, ఉన్నతాధికారులకు భార్యలు నేరుగా ఫిర్యాదు చేసే ధోరణిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అసోంలో తన భర్త స్నేహితుడు తనపై దాఖలు చేసిన పరువు నష్టం దావాను ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు బదిలీ చేయాలని కోరుతూ ఓ మహిళ వేసిన పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఘజియాబాద్‌లో తన భర్తపై ఇప్పటికే పలు కేసులు పెట్టి న్యాయపోరాటం చేస్తున్నానని, అందువల్ల ఈ కేసును కూడా అక్కడికే బదిలీ చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. ‘చాలా మంది భార్యలు ఇదే చేస్తున్నారు. భర్తపై యజమానులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దాంతో వారు ఉద్యోగాలను కోల్పోతున్నారు. విడాకులు కోరడం వేరు. కానీ, వారి జీవనాధారాన్ని దెబ్బతీయడం వేరు. ఇది మరీ దారుణం‘అని పేర్కొన్నారు. పిటిషనర్ భర్త ఎయిర్ ఫోర్స్ అధికారి. నిబంధనలకు విరుద్ధంగా ఆయన సొంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడని ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ అధికారులకు పిటిషనర్ (భార్య) ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా భర్త సన్నిహితుడైన సహోద్యోగి ఆమెపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై జస్టిస్ నాగరత్న కల్పించుకుని.. ‘మీరు ఎయిర్ ఫోర్స్ అధికారులు కారు. మీరెందుకు ఫిర్యాదు చేశారు? వైవాహిక వివాదాలు ఉన్నంత మాత్రాన యజమానికి ఫిర్యాదు చేయడం భార్యలు చేయగలిగే అత్యంత దారుణమైన పని. ఆ ఫిర్యాదులతో వారు ఉద్యోగాలు కోల్పోతారు. ఆ తర్వాత మీరు ఎంత భరణం కోరగలరు?‘అని ప్రశ్నించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెల్మెట్‌ను భార్య, ఆమె సోదరుడు దొంగిలించారని భర్త మొదట తప్పుడు ఫిర్యాదు చేశాడని కోర్టుకు తెలిపారు. ఆ వస్తువు ఎక్కడుందో తెలుసుకోవడానికే తాము ఎయిర్‌ఫోర్స్ అధికారులకు వినతిపత్రం ఇచ్చామని వివరించారు. పరువు నష్టం దావాను భర్త దాఖలు చేయలేదని, అతని స్నేహితుడు దాఖలు చేశాడని న్యాయవాది పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, సమస్య పరిష్కారానికి ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ఈ కేసును మధ్యవర్తిత్వ కేంద్రానికి బదిలీ చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వివాదాలన్నింటినీ పరిష్కరించుకుని, ఆరోపణలను వెనక్కి తీసుకునేలా భార్యకు తగిన సలహా ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి జస్టిస్ నాగరత్న సూచించారు. -
213 మంది అభ్యర్థులపై కేసులు..!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నాయకులు నానాపాట్లు పడుతున్నారు. తొలిదశ ఎన్నికలకు సరిగ్గా ఐదు రోజుల సమయమే మిగిలి ఉంది. ఈలోపు బరిలో ఉన్న అభ్యర్థులకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలిదశ బరిలో ఉన్న అభ్యర్థుల్లో దాదాపు 213 మంది అభ్యర్థులు వివిధ కేసులను ఎదుర్కొంటున్నారు. నేషనల్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ చేసిన సర్వేతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలో మొదటి దశ పోలింగ్ జరిగే 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న సుమారు 213 అభ్యర్థులపై పలు కేసులున్నాయని ఏడీఆర్ తెలిపింది. వీటిలో హత్య, మహిళలపై దాడులు, కిడ్నాప్ కేసులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య అధికంగా ఉంది. 1,266 మంది అభ్యర్థులకు సంబంధించిన అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్ సంస్థ, వీరిలో 12 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయని పేర్కొంది. 10 శాతం అభ్యర్థులు తమ మీద పలు హత్య కేసులున్నాయని అఫిడవిట్లో తెలుపగా.. హత్యాయత్నం కేసులున్నట్టు 25 శాతం మంది, కిడ్నాప్ కేసులు ఉన్నట్టు నలుగురు, మహిళలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నట్టు 16 మంది అఫిడవిట్లలో పేర్కొన్నారు. విద్వేశపూరిత ప్రసంగాల కేసులు తమపై ఉన్నట్టు మరో 12 శాతం మంది, తమ మీద రెడ్ అలర్ట్ కేసులు ఉన్నట్టు 37 మంది తెలిపారు. ప్రధాన పార్టీలైన బీజేపీ నుంచి పోటీ చేస్తున్న 83 మంది అభ్యర్థుల్లో 30 మందిపై కేసులు ఉండగా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న 32లో ఎనిమిది మంది, బీఎస్పీ పోటీ చేస్తున్న 32లో ఎనిమిది మంది నేరచరితులు ఉన్నట్టు తెలిపింది. -
33 మందిని వెంటనే విడుదల చేయాలి
ఖానాపూర్: రోడ్డు కోసం అడవిని నరికిన సిరిచల్మా గ్రామస్తులు33 మందిపై పెట్టిన కేసులు ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని టీడీపీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జల్లా ఖానాపూర్ లోని ఎన్టీఆర్ చౌక్ వద్ద రాస్తారోకో చే శారు. ఈ రాస్తారోకోలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, చుట్టుప్రక్కల గ్రామాల సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు.


