ఏడీఆర్‌ సంస్థ సర్వేలో వెల్లడి

Lok Sabha First Phase Almost 213 Candidates Have Criminal Cases Against Them - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నాయకులు నానాపాట్లు పడుతున్నారు. తొలిదశ ఎన్నికలకు సరిగ్గా ఐదు రోజుల సమయమే మిగిలి ఉంది. ఈలోపు బరిలో ఉన్న అభ్యర్థులకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలిదశ బరిలో ఉ‍న్న అభ్యర్థుల్లో దాదాపు 213 మంది అభ్యర్థులు వివిధ కేసులను ఎదుర్కొంటున్నారు. నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ అండ్ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) అనే సంస్థ చేసిన సర్వేతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

దేశంలో మొదటి దశ పోలింగ్‌ జరిగే 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న సుమారు 213 అభ్యర్థులపై పలు కేసులున్నాయని ఏడీఆర్‌ తెలిపింది. వీటిలో హత్య, మహిళలపై దాడులు, కిడ్నాప్‌ కేసులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య అధికంగా ఉంది. 1,266 మంది అభ్యర్థులకు సంబంధించిన అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్ సంస్థ, వీరిలో 12 శాతం మందిపై క్రిమినల్‌ కేసులున్నాయని పేర్కొంది. 10 శాతం  అభ్యర్థులు తమ మీద పలు హత్య కేసులున్నాయని అఫిడవిట్‌లో తెలుపగా.. హత్యాయత్నం కేసులున్నట్టు 25 శాతం మంది, కిడ్నాప్‌ కేసులు ఉన్నట్టు నలుగురు, మహిళలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నట్టు 16 మంది అఫిడవిట్లలో పేర్కొన్నారు. విద్వేశపూరిత ప్రసంగాల కేసులు తమపై ఉన్నట్టు మరో 12 శాతం మంది, తమ మీద రెడ్‌ అలర్ట్‌ కేసులు ఉన్నట్టు 37 మంది తెలిపారు. ప్రధాన పార్టీలైన బీజేపీ నుంచి పోటీ చేస్తున్న 83 మంది అభ్యర్థుల్లో 30 మందిపై కేసులు ఉండగా.. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న 32లో ఎనిమిది మంది, బీఎస్పీ పోటీ చేస్తున్న 32లో ఎనిమిది మంది నేరచరితులు ఉన్నట్టు తెలిపింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top