breaking news
case filed on 8 members
-
కోలుకుంటున్న భూ బాధితులు
సాక్షి, బుచ్చెయ్యపేట(చోడవరం): మండలంలోని ఎంబీపాలెంలో గ్రామస్తుల దాడిలో గాయపడిన మహిళలు అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. తమ భూమిలో జీడి పిక్కలు సేకరిస్తున్న గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు కలం వెంకట లక్ష్మి, అప్పాన మహాలక్ష్మిలపై అదే గ్రామానికి చెందిన కొందరు ఈ భూములు తమవంటూ శుక్రవారం దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. అపస్మారక స్థితికి చేరిన ఇద్దరినీ 108లో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల, చేతులు, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలైన అక్కాచెల్లెళ్లు మంచానికే పరిమితం అయ్యారు. 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోడానికి నాయకులు, అధికారులు కలిసి తమను భయాందోళనలకు గురి చేస్తున్నారన్నారు. తమకు న్యాయం జరగడం లేదంటూ ఆరోపించారు. సెలవులతో ధర్నా వాయిదా.. మహిళలపై దాడికి నిరసనగా శనివారం బుచ్చెయ్యపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు బాధిత మహిళల కుటుంబీకులు, గ్రామస్తులు యోచించారు. శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులతో అధికారులు అందుబాటులో ఉండరని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఎనిమిది మందిపై ఫిర్యాదు బాధితుల ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ కుమారుడు కరణం నూకరాజుతో పాటు తహసీల్దార్ కె.వెంకట శివ, గ్రామానికి చెందిన అప్పాన అప్పలనాయుడు, ముత్యాలు, బేరా పడమటమ్మ, బర్ల చిన్న, పురిటి రాజు, సత్యంలు తమపై దాడితోపాటు అత్యాచారానికి ప్రయత్నించారని, బలవంతంగా భూములను లాక్కోవడానికి చూస్తున్నారని బాధితులు బుచ్చెయ్యపేట ఎస్ఐకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్ఐ కృష్ణారావు తెలిపారు. తహసీల్దార్ తమను డబ్బులు డిమాండ్ చేశారని, తన గదిలోకి రమ్మన్నారని బాధిత మహిళలు ఆరోపించారు. -
హెచ్ఎంను కత్తితో పొడిచిన విద్యార్థి
వేలూరు: క్లాసులు జరుగుతున్న సమయంలో విద్యార్థులు ఇతర తరగతి గదులకు వెళ్లకూడదన్నందుకు ఓ విద్యార్థి సోమవారం ప్రధానోపాధ్యాయుడిని కత్తితో పొడిచాడు. తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుపత్తూరు రైల్యేస్టేషన్ రోడ్డులో ఉన్న రామకృష్ణా ప్రభుత్వ పాఠశాలకు బాబు (56) హెడ్మాస్టర్గా ఉన్నారు. ఇదే పాఠశాలలో తిరుపత్తూరు హౌసింగ్ బోర్డుకు చెందిన హరిహరన్ అనే విద్యార్థి (16) పదకొండో తరగతి చదువుతున్నాడు. క్లాసులు జరుగుతున్న సమయంలో హరిహరన్ తన క్లాస్‌రూమ్‌లో కాకుండా మరో గదిలో కనిపించడంతో హెచ్ఎం మందలించారు. దీంతో హరిహరన్ తన వద్దనున్న కత్తితో హెచ్ఎంను కడుపులో పొడిచాడు. రక్తపు మడుగులో పడి కేకలు వేయడంతో స్కూల్ టీచర్లు, విద్యార్థులు హెచ్ఎంను తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి, ఆ తర్వాత వేలూరుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న హరిహరన్ కోసం గాలిస్తున్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ : 8 మందిపై కేసులు నమోదు
శంషాబాద్: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై రంగారెడ్డి జిల్లా పోలీసులు శనివారం రాత్రి పంజా విసిరారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే రహదారిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టిన శంషాబాద్ ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. 3 కార్లు, 6 బైక్‌లు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని కోర్టులో హాజరు చేస్తామని పోలీసులు తెలిపారు.