breaking news
Captain America - Civil War
-
ఫ్రాన్స్ నిరసనల్లో ‘సూపర్ హీరోలు’
ఫ్రాన్స్‌లో నిరసనల సెగ రోజురోజుకూ పెరుగుతోంది. ఓ వైపు పోలీసుల బాష్ప వాయు ప్రయోగాలు, వాటర్ క్యానన్లతో ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నాలు జరుగుతుండగా.. మరో వైపు నిరసనల్లోకి సూపర్ హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చారు. బ్లాక్ పాంథర్, కెప్టెన్ అమెరికా, స్పైడర్‌మ్యాన్, సూపర్‌మ్యాన్, డెడ్‌పూల్ వంటి సూపర్‌హీరోల వేషధారణలో ఆందోళనల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా పారిస్‌లో జరిగిన నిరసనల్లో బ్లాక్ పాంథర్, కెప్టెన్ అమెరికా వేషధారణలో ఉన్న ఇద్దరు వ్యక్తులు సందడి చేశారు. వారు తమదైన శైలిలో విన్యాసాలు చేస్తుండగా.. చుట్టూ ఉన్న ఆందోళనకారులు వారితో ఫొటోలు దిగారు. అనంతరం వారిద్దరూ నిరసనకారులతో కలిసి నినాదాలు చేస్తూ ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. మరో వైపు భద్రతా సిబ్బంది బారికేడ్లతో ఆ ప్రాంతాన్ని కాపలా కాస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి.నిరసనల్లో పాల్గొంటున్నవారు పోలీసుల చర్యలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలామంది ముఖాలకు మాస్కులు ధరించడంతో పాటు కళ్లకు రక్షణ కళ్లద్దాలు పెట్టుకుంటున్నారు. దాదాపు అందరూ హెల్మెట్లు ధరించి కనిపిస్తున్నారు. పోలీసులు లాఠీచార్జి చేసినా, బాష్పవాయు గోళాలు ప్రయోగించినా వాటి ప్రభావం తగ్గించుకునేందుకు ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఫ్రాన్స్‌లో జీవన వ్యయం పెరగడం, విద్యా రంగానికి నిధులు తగ్గడం వంటి అంశాలపై ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. దాదాపు నాలుగు లక్షల మంది వీధుల్లోకి రావడంతో ప్రభుత్వం భద్రతా బలగాలను భారీగా మోహరించింది. ఈ క్రమంలో దాదాపు వెయ్యి మందిని అరెస్ట్ చేసినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి.ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నూనెజ్ కీలక వ్యాఖ్యలు చేస్తూ.. దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన దోపిడీలు, హింసను నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారిందని ఆయన పేర్కొన్నారు. తన పదవికి రాజీనామా చేసేందుకు కూడా ఆయన ముందుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అందుకు అంగీకరించలేదని సమాచారం.Matter so serious even Captain America, Darth Vader, Napoleon, and Pigeon Doctor joined the French protest🤣 🇫🇷 https://t.co/MmBirO5fTs— Max (@max4geopolitics) October 18, 2026ఇదీ చదవండి: బతకడం కోసం కాలునే కోసుకున్నాడు! -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
కేప్టెన్ అమెరికా - సివిల్ వార్ : ట్రైలర్ అమెరికన్ సూపర్‌హీరో ఫిల్మ్ ‘కేప్టెన్ అమెరికా : సివిల్‌వార్’ రెండో ట్రైలర్ ఇది. ట్రైలర్ విడుదలై 24 గంటలైనా కాకముందే హిట్స్ రెండు కోట్లు దాటాయి! కేప్టెన్ అమెరికా అనే వ్యక్తి మార్వెల్ కామిక్స్‌లో సూపర్‌హీరో. భూగోళంపై ఆధిపత్యం సంపాదించేందుకు భారీ విధ్వంసాన్ని సృష్టించే అవెంజర్స్‌ను ఈ హీరో నిరోధిస్తుంటాడు. అయితే అందుకు ప్రభుత్వ విధానాలు అడ్డొస్తాయి. ఆ విధానాలకు అతీతంగా కేప్టెన్ హీరో ఎప్పటికప్పుడు స్వయం నిర్ణయాలు తీసుకుంటూ కథను సాఫీగా ముగిస్తాడు. ఇదే కథాంశంతో 2014లో వచ్చిన ‘కేప్టెన్ అమెరికా : ది వింటర్ సోల్జర్’, అంతకు ముందు 2011లో వచ్చిన ‘కేప్టెన్ అమెరికా : ది ఫస్ట్ అవెంజర్స్’ చిత్రాలకు ఈ తాజా చిత్రం సీక్వెల్ అని చెప్పాలి. చిత్రం మే 6న విడుదల అవుతోంది. హాలీవుడ్ అత్యుత్తమ సినీ టెక్నాలజీ ఏ స్థాయిలో ఉందో ఈ ట్రైలర్‌లోని సన్నివేశాలను చూస్తే తెలుస్తుంది. పాప్‌స్టార్ : నెవర్ స్టాప్ నెవర్ స్టాపింగ్ కెరియర్లో ఫ్లాప్ అయితే ఏం జరుగుతుంది? జీవితం కుప్పకూలి పోతుందా? మరో ఆప్షనే లేకుండా పోతుందా? కింద పడిన కెరియర్లోనే మళ్లీ పైకి లేచేందుకు వీలవుతుందా? ‘పాప్ : నెవర్ స్టాప్ నెవర్ స్టాపింగ్’ సినిమాలో ఈ ప్రశ్నలకు సమాధానం దొరకొచ్చు. యాండీ శామ్బర్గ్ పాటగాడు. అతడి సెకండ్ ఆల్బమ్ అట్లర్ ఫ్లాప్ అవుతుంది. దాంతో డిప్రెషన్లో పడిపోతాడు. అందులోంచి బయటపడడానికి మళ్లీ కష్టపడతాడు. తన లిరిసిస్ట్, డీజే, పబ్లిసిస్ట్లతో కలిసి కొత్తగా మరో ప్రయత్నం చేస్తాడు. సక్సెస్ కొడతాడు. అతడే కిందపడి, తిరిగి పైకి లేచే క్రమంలో ప్రేక్షకులను ఎన్నో హాస్యసన్నివేశాలు అలరిస్తాయి. కొంచెం కిక్ కూడా ఇస్తాయి. ఆ కిక్‌ని శాంపిల్‌గా ఈ వీడియోలో వీక్షించవచ్చు.


