breaking news
Candiru
-
సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. విండోస్ సాయంతో
ప్రపంచ దేశాలకు చెందిన రహస్యాల్ని దొంగిలించేందుకు రోజుకో స్పై వైరస్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ తమ ఆపరేటింగ్ సిస్టమ్స్ సాయంతో రెండు స్పై వైరస్లు (డెవిల్స్ టంగ్ అని పిలిచే ) దాడి చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. 10 దేశాలకు చెందిన 100 మంది యాక్టివిస్ట్‌లు, జర్నలిస్ట్‌లు, ప్రభుత్వంపై అసమ్మతివాదులపై సైతం ఈ స్పైవేర్ దాడి జరిగిందని సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ యూనివర్సిటీ ఆఫ్ టోరంటో సిటిజన్ ల్యాబ్ తెలిపింది. ఇజ్రాయిల్ కు చెందిన 'కాండిరు' అనే సంస్థ తయారు చేసిన ఈ స్పైవేర్ టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, హంగేరీ, ఇండోనేషియాతో పాటు ఇతర దేశాల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ విండోస్ల సాయంతో ఇన్ స్టాల్ చేశారని, ఇన్ స్టాల్ చేసిన అనంతరం దాడులకు సిద్ధపడినట్లు మైక్రోసాఫ్ట్ డిజిటల్ సెక్యూరిటీ యూనిట విభాగానికి చెందిన జనరల్ మేనేజర్ క్రిస్టిన్ గుడ్విన్ తెలిపారు. సిటిజెన్ ల్యాబ్ పరిశోధకులు స్పైవేర్ దాడుల గురించి చెప్పడంతో మైక్రోసాఫ్ట్ అప్రమత్తమైంది. ఈ దాడుల గురించి 'కాండిరు' పేరు ప్రస్తావించకుండా ఇజ్రాయిల్ కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ స్పై వైరస్‌తో దాడిచేసిందని ప్రస్తావించింది. సిటిజెన్ ల్యాబ్ ప్రకారం..ప్రపంచ దేశాల్ని టెక్నాలజీ పరంగా భయబ్రాంతులకు గురిచేసేందుకు కాండిరు ఈ స్పైవేర్లు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. 16 మిలియన్ యూరోల ($ 18.9 మిలియన్లు) కు కాండిరు తన క్లయింట్లకు ఒకే సారి 10టార్గెట్లను ట్రాక్ చేసేందుకు ఇచ్చినట్లు, అదనంగా 1.5 మిలియన్ యూరో (8 1.8 మిలియన్) చెల్లిస్తే మరో 15 టార్గెట్లను ట్రాక్ చేసేందుకు వీలుపడుతున్నట్లు తేలింది. ఇక కాండిరుకు యూరప్, రష్యా, మిడిల్ ఈస్ట్, ఆసియా, లాటిన్ అమెరికాలో క్లయింట్లు ఉన్నారని ఇజ్రాయెల్ వార్తాపత్రిక హారెట్జ్ తెలిపింది. ఇజ్రాయిల్‌కు చెందిన స్థానిక మీడియా సంస్థలు కాండియా ఉజ్బెకిస్తాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఖతార్ దేశాలతో ఒప్పందాలు కుదర్చుకున్నట్లు వెల్లడించింది. కాండిరు తన క్లయింట్లకు 'అంగీకరించిన భూభాగాలలో' మాత్రమే పనిచేయడానికి పరిమితం చేసుకుంది. అయితే యు.ఎస్, రష్యా, చైనా, ఇజ్రాయెల్, ఇరాన్ వెలుపల కార్యకలాపాలను పరిమితం చేసే ఒప్పందాలపై సంతకం చేసినట్లు, మైక్రోసాఫ్ట్ ఇటీవలే ఇరాన్ స్పైవేర్ తన కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. -
‘ఆపరేషన్ వీక్’తో హడల్
చండూరు, న్యూస్‌లైన్ :ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యాన్ని దూరం చేసేందుకు జిల్లా స్థాయిలో ‘ఆపరేషన్ వీక్’ పేరుతో ఏర్పాటు చేసిన బృందాలు ఆకస్మిక దాడులు చేస్తూ హడలెత్తిస్తున్నాయి. దీంతో అన్ని డిపార్టుమెంట్లలో పనిచేస్తున్న అధికారుల్లో జంకు మొదలైంది. గతంలో రేషన్‌షాపులపై డేగకన్ను వేసేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. కానీ వారు ఒక సివిల్సప్లై శాఖకే పరిమితం కావడంతో మిగతా శాఖల్లో నిర్లక్ష్యం నెలకొంది. దీంతో ఇటీవల బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ చిరంజీవులు ఆపరేషన్ వీక్ అనే పేరుతో బృందాలను సెప్టెంబర్ 17 తేదీన ఏర్పాటు చేశారు. డివిజన్ స్థాయిలో అసిస్టెంట్ పౌరసరఫరాల అధికారి టీం లీడర్‌గా, ముగ్గురు డీటీలు, ఇద్దరు ఆర్ఐలు, ఏఎస్డబ్ల్యూఓ, ఉప విద్యాశాఖాధికారి, ఐసీడీఎస్ శాఖ నుంచి ఓ అధికారి సభ్యులుగా ఉంటారు. జిల్లా మొత్తంలో 5 టీంలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో ఇద్దరు ఏఎస్ఓలు, ముగ్గురు డీటీలతో మరో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. వీరు మిగతా టీంలను పర్యవేక్షిస్తారు. ఈ టీంలకే ఆపరేషన్ వీక్ అనే పేరు పెట్టారు. సోషల్ వెల్ఫేర్, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వసతి గృహాలు, సివిల్ సప్లై గోదాంలు, రేషన్ షాపులు, ఐసీడీఎస్ కార్యాలయాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీలు చేస్తారు. నెలలో ఓ వారం మొత్తం అన్ని శాఖలకు సంబంధించిన తనిఖీలు నిర్వహిస్తారు. ఆపరేషన్ వీక్ బృందాల దృష్టికి వచ్చిన సమస్యలను 8వరోజు జాయింట్ కలెక్టర్ సమక్షంలో జరిగే ప్రత్యేక సమావేశంలో వివరిస్తారు. దీంతో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటారు. జిల్లాలో 174 కేసులు నమోదు కొత్తగా ఏర్పాటు చేసిన ఆపరేషన్ వీక్ బృందాలు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 24 వరకు వివిధ శాఖల్లో తనిఖీలు చేపట్టి 174 కేసులు నమోదు చేశారు. ఇందులో 26 రేషన్ షాపులపై, 18 శాఖ పరమైనవి, సోషల్ వెల్ఫేర్‌లో 40 కేసులు, బీసీ వసతి గృహ అధికారులపై 30, ఐసీడీఎస్‌లో 30, ఎస్టీ వసతి గృహ అధికారులపై 30 కేసులు నమోదు చేశారు. వచ్చేనెల చివరి వారంలోనూ తనిఖీలు ఉం టాయి. బృందాల పనితీరును జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నారు.