breaking news
Buvaneswar kumar
-
ఆసియాకప్‌లో లీడింగ్ వికెట్ టేకర్.. మూడేళ్లుగా జట్టుకు దూరం
ఆసియాకప్-2025 (Asia Cup) సమయం అసన్నమవుతోంది. సెప్టెంబర్ 9న అబుదాబీ వేదికగా అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ మల్టీనేషన్ టోర్నమెంట్ కోసం ఆయా జట్లు తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. టీ20 ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా ఈవెంట్లో మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ ఉండగా, గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్లు ఉన్నాయి. ఈ ఖండాంతర టోర్నీ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు కూడా మరో రెండు రోజుల్లో దుబాయ్‌కు చేరుకోనుంది.నాలుగు రోజుల ప్రాక్టీస్ క్యాంపులో టీమిండియా తీవ్రంగా శ్రమించనుంది. మెన్ ఇన్ బ్లూ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈ (IND vs UAE)తో తలపడనుంది. ఈ నేపథ్యంలో.. ఈ ఆసియాకప్ టోర్నమెంట్(వన్డే, టీ20) చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లపై ఓ లుక్కేద్దాం.1984లో ప్రారంభమైన ఆసియాకప్ 2014 వరకు వన్డే ఫార్మాట్లో మాత్రమే జరిగింది. అయితే ఐసీసీ సూచన మేరకు 2016లో తొలిసారిగా ఆసియాకప్‌ను టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. ఈ ఖండాంతర టోర్నీ టీ20 ఫార్మాట్లో చివర సారిగా 2022లో జరిగింది. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఈ మార్క్యూ ఈవెంట్ పొట్టి ఫార్మాట్లో జరగనుంది.టాప్‌లో భువీ..ఆసియాకప్ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో టీమిండియా వెటరన్ భువనేశ్వర్ కుమార్ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆసియాకప్ టీ20 టోర్నీలో భువీ ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు 13 వికెట్లు పడగొట్టాడు. అతడి ఏకానమీ 5.34గా ఉంది. రెండో స్థానంలో యూఏఈ బౌలర్ అమ్జాద్ జావేద్ ఉన్నాడు. జావేద్ 7 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు పడగొట్టాడు.వీరిద్దరి తర్వాత మహ్మద్ నవీద్(111), రషీద్ ఖాన్(11), హార్దిక్ పాండ్య(11), అల్-అమీన్ హుస్సేన్(11) ఉన్నారు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆసియాకప్ టీ20ల్లో 6 వికెట్లు పడగొట్టాడు. అయితే బుమ్రా ఒక్క ఎడిషన్‌లో మాత్రమే భాగమయ్యాడు. ఆసియాకప్-2022కు గాయం కారణంగా బుమ్రా దూరమయ్యాడు. కాగా ఆసియాకప్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్న భువీ.. టీమిండియా తరపున చివరగా ఆడాడు.వన్డేల్లో అతడే టాప్..ఇక ఆసియాకప్ వన్డే ఫార్మాట్లో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ ముత్తయ్య మురళీధరన్(30) టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాత స్ధానాల్లో లసిత్ మలింగ(29), అజింతా మెండిస్(26), సయీద్ అజ్మల్(25), రవీంద్ర జడేజా(25) కొనసాగుతున్నారు. టాప్ 10లో భారత్ నుంచి జడేజా, ఇర్ఫాన్ పఠాన్(22) మాత్రమే ఉన్నారు. ఈ జాబితాలో కూడా బుమ్రా పేరు లేదు.చదవండి: బుమ్రాతో నాకు పోలికా?.. మేమిద్దరం..: వసీం అక్రమ్ -
రెచ్చిపోతున్న భారత బౌలర్లు
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో నాలుగో వన్డేలో భారత్ బౌలర్లు విజృంభిస్తున్నారు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియాకు యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ఆరంభాన్నిచ్చాడు. భువి ఒకే ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్లు హేల్స్, కుక్‌ను పెవలియన్ బాటపట్టించాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో భువి హేల్స్‌ను బౌల్డ్ చేయగా, కుక్.. రైనాకు క్యాచిచ్చాడు. దీంతో ఇంగ్లీష్ మెన్ 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్ షమీ ఆ వెంటనే బాలెన్స్‌ను అవుట్ చేసి ఇంగ్లండ్ కోలుకోనీకుండా చేశాడు. ఇంగ్లండ్ 8 ఓవర్లలో 23 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మోర్గాన్, రూట్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకట్ట వేసినా నింపాదిగా ఆడారు. భారత బౌలర్లు మోర్గాన్, రూట్ ను వెంటవెంటనే అవుట్ చేశారు. ఇంగ్లండ్ 33 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి116 పరుగులు చేసింది. 2-0 ఆధిక్యంలో ఉన్న ధోనీసేన ఈ మ్యాచ్ నెగ్గితే సిరీస్ సొంతమవుతుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దవగా, రెండు, మూడు వన్డేల్లో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే.