breaking news
Build Houses
-
ప్లాటుకు పరీక్ష.. పాస్ అయితేనే ఇల్లు!
ఇల్లు కట్టే కలను సాకారం చేసుకోవాలంటే, ముందుగా భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని (ప్లాటు) ఎంపిక చేసుకోవడం అత్యంత కీలకం. ఇది కేవలం ఆస్తి పెట్టుబడి మాత్రమే కాదు. మీ కుటుంబ భద్రత, ఆరోగ్యం, జీవనశైలి అన్నీ దీనిపై ఆధారపడి ఉంటాయి. భూమి బలహీనంగా ఉంటే, ఎంత ఖరీదైన నిర్మాణమైనా భవిష్యత్తులో ప్రమాదమే. అందుకే, భవన నిర్మాణానికి ముందు భూమి స్వరూపాన్ని శాస్త్రీయంగా పరీక్షించుకోవడం తప్పనిసరి. సాయిల్ టెస్టింగ్ (Soil Testing) ద్వారా భూమి బలాన్ని, నీటి నిల్వ సామర్థ్యాన్ని, నిర్మాణానికి అనువైనదేనా అనే విషయాలను ముందుగానే తెలుసుకోవచ్చు. ఇది భవిష్యత్తులో వచ్చే నిర్మాణ సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఈ అంశాలు కీలకంతెలుగు రాష్ట్రాల్లో భూమి స్వరూపం ప్రాంతానుసారంగా మారుతుంది. ఎర్ర మట్టి (Red Soil) బలమైన నిర్మాణానికి అనుకూలంగా ఉంటుంది. నల్ల మట్టి (Black Cotton Soil) తేమను ఎక్కువగా పీల్చుకుంటుంది, కదలికలతో భవనానికి ప్రమాదం కలిగించవచ్చు. ఇసుక నేలలో (Sandy Soil ) నీటి పారుదల బాగుంటుంది కానీ నిర్మాణానికి పనికిరాదు. భౌగోళిక స్థితి కూడా కీలకం. తక్కువ ఎత్తులో ఉండే ప్రాంతాలు వరదలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొండ ప్రాంతాలు భద్రతకు మంచివైనా, నిర్మాణ వ్యయం పెరుగుతుంది. అందువల్ల, స్థలం ఎంపికలో మట్టి స్వరూపం, నీటి ప్రవాహం, పరిసరాల భద్రత.. ఇలా అన్ని అంశాలూ కీలకం.ఇవిగో ఇవీ పరీక్షలుభూమి బలాన్ని, నిర్మాణానికి అనువైనదేనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు కొన్ని ముఖ్యమైన సాయిల్ టెస్టులు ఉన్నాయి. బేరింగ్ కెపాసిటీ టెస్ట్ (Bearing Capacity Test) ద్వారా భూమి ఎంత బరువు మోయగలదో తెలుసుకోవచ్చు. మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్ (Moisture Content Test) మట్టిలో తేమ శాతం ఎంత ఉందో తెలియజేస్తుంది. అట్టెర్బర్గ్ లిమిట్స్ (Atterberg Limits) పరీక్ష ద్వారా మట్టి ద్రవ, ప్లాస్టిక్ లక్షణాలు అంచనా వేయవచ్చు. కంపాక్షన్ టెస్ట్ (Compaction Test) ద్వారా భూమిని ఎంత గట్టిగా పాకబెట్టవచ్చో తెలుసుకోవచ్చు. పీహెచ్ టెస్ట్ (pH Test) ద్వారా మట్టి ఆమ్లత/క్షారత స్థాయిని తెలుసుకోవచ్చు. గ్రెయిన్ సైజ్ అనాలిసిస్ (Grain Size Analysis) ద్వారా మట్టి కణాల పరిమాణం, నిర్మాణానికి అనువైనదేనా అనే విషయం అర్థమవుతుంది. ఈ పరీక్షల ఆధారంగా ఇంటికి ఎలాంటి పునాది వేయాలి.. పిల్లర్లు ఎంత లోతు నుంచి నిర్మించాలి అనే విషయాలను ఇంజినీర్లు నిర్ణయిస్తారు.ఎక్కడ చేస్తారీ పరీక్షలు?తెలంగాణలో సాయిల్ టెస్టింగ్ సేవలు హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ వంటి నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో కొన్ని ప్రైవేటు టెస్టింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా భూమి శాస్త్రీయ విశ్లేషణ పొందవచ్చు. అలాగే, ప్రభుత్వ వ్యవసాయ శాఖ ద్వారా కూడా కొన్ని ప్రాంతాల్లో సాయిల్ టెస్టింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాలో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమైన కేంద్రాలు విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, శ్రీకాకులంలలో ఉన్నాయి. ఈ ల్యాబ్స్ ద్వారా భూమి పరీక్షలు చేయించుకుని, నివేదిక ఆధారంగా పునాది, నిర్మాణ సామగ్రి, నీటి పారుదల వంటి అంశాలు నిర్ణయించుకోవచ్చు. జియోటెక్నికల్ నివేదిక తీసుకోవడం, ఫౌండేషన్ ప్లానింగ్ చేయడం, డ్రైనేజ్ డిజైన్ రూపొందించడం భవన నిర్మాణానికి ముందు అనుసరించాల్సిన చర్యలు.సాధారణంగా డెవలప్ చేసిన వెంచర్లలో ప్లాటు తీసుకుంటుంటే ఈ పరీక్షలన్నీ డెవలపర్లే చేయిస్తారు. కానీ స్థలం కొంటున్నవారు కూడా టెస్ట్ చేయిస్తే మంచిది. నిపుణులు చెబుతున్న సూచన ప్రకారం, స్థలం ఎంపిక చేసిన వెంటనే సాయిల్ టెస్టింగ్ చేయించాలి. ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్స్ లేదా సివిల్ ఇంజినీర్ల ద్వారా నివేదిక పొందాలి. నివేదిక ఆధారంగా నిర్మాణ పునాది, నిర్మాణ పదార్థాలు, డ్రైనేజీ వంటి అంశాలు నిర్ణయించాలి. ఇది భవిష్యత్తులో వచ్చే నిర్మాణ సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సాయిల్ టెస్టింగ్ ఖర్చు కాదు.. ఇది భద్రతకు పెట్టుబడి.ఇదీ చదవండి: కోటి రూపాయలు లేకపోతే సొంతిల్లు కష్టమే.. -
PMAY: గ్రామాల్లో మరో 2 కోట్ల ఇళ్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్(పీఎంఏవై–జీ) పథకం కింద గ్రామాల్లో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2024–25 నుంచి 2028–29కాలానికి గ్రామాల్లో పీఎం ఆవాస్‌యోజన అమలుపై గ్రామీణాభివృద్ధి శాఖ ఇచి్చన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–పట్టణ(పీఎంఏవై–యూ) పథకం కింద రూ.2.30 లక్షల కోట్ల సాయం అందించనున్నారు. ఉద్యానరంగంలో చీడపీడలు తగ్గించడం, మెరుగైన విత్తనాలను సృష్టించడం, పూలు, పండ్ల దిగుబడి పెంచడమే లక్ష్యంగా క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్(సీపీపీ)కి కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఉద్యానరంగంలో విప్లవాత్మక మార్పుల కోసం రూ.1,765.67 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.ఆ ‘క్రీమీలేయర్’ రాజ్యాంగంలో లేదు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో క్రీమీలేయర్ అమలుకు ఆస్కారం లేదని కేంద్రం వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల అమలు విషయంలో క్రీమీలేయర్ నిబంధన లేదని స్పష్టంచేసింది. తాజాగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో దీనిపై భేటీలో విస్తృతంగా చర్చ జరిగిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. -
అవ్వకు ఇల్లు కట్టించిన ఎస్ఐ.. మానవత్వంలో ‘రాజా’రాం
వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన మేడిపల్లి సమ్మవ్వ(సమ్మక్క) కుమారుడు సంపయ్య ఇరవై ఏళ్లక్రితం చనిపోగా, భర్త అయి లయ్య ఏడాది క్రితం అనారో గ్యంతో కాలం చేశాడు. దీంతో ఎవరూ లేని ఆమె గ్రామంలో భిక్షాటన చేస్తూ బతుకుతోందని స్థానికులు ఎస్సై నార్లాపురం రాజారాం దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన ‘ఆమె అనాథ కాదు.. బాగోగులు నేను చూసుకుంటా.. ఉండేందుకు ఇల్లు కటించే బాధ్యత నాదే’’ నని చెప్పి... అన్నట్టుగానే సొంత డబ్బులతో ఇల్లు కట్టించి సోమవారం గృహప్రవేశం చేయించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఏసీపీ సంపత్‌రావు ప్రత్యేక పూజలు చేసి రిబ్బన్ కటింగ్ చేసి గృహప్రవేశం చేశారు. అనంతరం సమ్మవ్వకు ఏసీపీ చేతుల మీదుగా నిత్యవసర సరుకులు అందించారు. అనాథ అవ్వను దత్తత తీసుకున్న రాజారాంను అందరూ అభినందించారు. – నల్లబెల్లి -
ఇంటి దోపిడీ రూ.4,930.15 కోట్లు!
సాక్షి, అమరావతి: పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో టీడీపీ సర్కార్ రూ.4,930.15 కోట్ల దోపిడీకి పాల్పడినట్లు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. తొమ్మిది కాంట్రాక్టు సంస్థలతో కలసి టీడీపీ పెద్దలు పేదల పొట్ట కొట్టినట్లు స్పష్టం చేసింది. సాంప్రదాయ పద్ధతుల్లో ఇళ్ల నిర్మాణానికి రూపొందించిన అంచనాలతోనే గత ప్రభుత్వం షేర్ వాల్ టెక్నాలజీకి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంచనా వ్యయాన్ని చదరపు అడుగుకు రూ.800 చొప్పున పెంచేసింది. పోటీ లేకుండా చేసి తొమ్మిది సంస్థలకు అధిక ధరలతో పనులను అప్పగించారని నిపుణుల కమిటీ తప్పుబట్టింది. వీఎన్‌సీ–ఎస్వీసీ(జేవీ), వీఎన్‌సీ, కేఎంవీ, షాపూర్జీ పల్లోంజీ, ఎన్సీసీ, కేపీసీ, టాటా, ఎల్ అండ్ టీ, సింప్లెక్స్ ఇన్ఫ్రాస్టక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే పాల్గొనేలా నిబంధనలు రూపొందించారని పేర్కొంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక, భూసేకరణ లేకుండానే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంతో ధరల సర్దుబాటు కింద అధిక మొత్తం పరిహారం చెల్లించాల్సిన దుస్థితి దాపురించిందని పేర్కొంది. పనుల్లో తీవ్ర జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై జరిమానా విధించకపోవడాన్ని తప్పుబట్టింది. అడగడుగునా నిబంధనల ఉల్లంఘనపై ఏపీ టిడ్కో అధికారులను ప్రశ్నిస్తే ‘ఉన్నత స్థాయి ఒత్తిళ్ల మేరకు పెద్దలు ఎలా చెబితే అలా చేశాం..’ అని సమాధానం ఇచ్చారని పేర్కొంది. కఠిన చర్యలకు కమిటీ సిఫారసు.. పేదలకు ఉచితంగా ఇళ్లను నిర్మించి ఇవ్వాల్సి ఉండగా వారిపై అప్పుల భారం మోపి మరీ నిధులను కాజేసిన వైనంపై విధానపరమైన నిర్ణయం తీసుకుని అక్రమాలకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ నిపుణుల కమిటీ ఈనెల 17వతేదీన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఏపీ టిడ్కో (ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో చేపట్టిన పట్టణ పేదల ఇళ్ల నిర్మాణంపై కమిటీ విచారణ జరిపి రికార్డులు తనిఖీ చేసింది. క్షేత్రస్థాయిలో విచారించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పేదలకు సొంతింటి పేరుతో దోపిడీ.. రాష్ట్రంలో పట్టణ ప్రాంత పేదలకు 225 చోట్ల 4,54,909 గృహాలను నిర్మించే పనులను 34 ప్యాకేజీలుగా విభజించి 2017 ఏప్రిల్‌లో ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో టెండర్లు పిలిచారు. ఇళ్లను మూడు రకాలుగా 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని నిర్ణయించారు. ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1.5 లక్షల చొప్పున మొత్తం రూ.3 లక్షలు చెల్లిస్తాయి. ఈ నిధులతో సాంప్రదాయ పద్ధతుల్లో ఇళ్లను నిర్మించే అవకాశం ఉన్నా టీడీపీ సర్కారు పేదలపై పెనుభారం మోపింది. గత సర్కార్ వ్యవహరించిన విధానాల వల్ల 300 చదరపు అడుగుల ఇంటి నిర్మాణ వ్యయం రూ.5.72 లక్షలకు(లబ్ధిదారుడిపై భారం రూ.2.72 లక్షలు), 365 చదరపు అడుగులకు రూ.6.74 లక్షలకు (లబ్ధిదారుడిపై భారం రూ.3.74 లక్షలు), 430 చదరపు అడుగుల ఇంటి నిర్మాణ వ్యయం రూ.7.71 లక్షలకు (లబ్ధిదారుడిపై భారం రూ.4.71 లక్షలు) పెరిగిందని కమిటీ తేల్చింది. ఫలితంగా ఇళ్ల నిర్మాణ వ్యయం రూ.25,170.99 కోట్లకు చేరుకుందని నిపుణుల కమిటీ పేర్కొంది. లబ్ధిదారుడి వాటా రూపంలో బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి మరీ ఈ డబ్బులను టీడీపీ సర్కార్ దోచేసింది. చ.అడుగుకు రూ.800 పెంపు సాంప్రదాయ పద్ధతుల్లో ఇళ్ల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.1100కి మించదని అయితే షీర్ వాల్ టెక్నాలజీ పేరుతో చదరపు అడుగుకు రూ.1900కు పెంచేశారని పేర్కొంది. ఒప్పందం ప్రకారం 15 నెలల్లోగా ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా రెండేళ్లు గడిచినా అసంపూర్తిగానే ఉన్నాయని కమిటీ తెలిపింది. 100 మిమీల మందం కలిగిన గోడలతో నిర్మిస్తున్న ఇళ్లు చలి, ఎండలను ఆపలేవని అభిప్రాయపడింది. గ్రావెల్లో గోల్మాల్ రూ.60 లక్షలు! కృష్ణా జిల్లా జక్కంపూడి వద్ద జీ+3 విధానంలో 10,624 ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతాన్ని నిపుణుల కమిటీ ఈనెల 12న తనిఖీ చేసింది. ఈ పనులను 4.53 శాతం అధిక ధరలకు అంటే రూ.649.44 కోట్లకు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది మే 27 నాటికే పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇంతవరకు ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ఇక్కడ నిర్మిస్తున్న ఇళ్లకు గ్రావెల్‌ను 16 కి.మీ.ల నుంచి తరలిస్తున్నట్లు బిల్లులు చెల్లించారు. నిజానికి ఇళ్లు నిర్మిస్తున్న ప్రదేశం నుంచే గ్రావెల్‌ను తవ్వి సేకరించారు. ఇందులో కాంట్రాక్టర్‌కు రూ.60 లక్షలు దోచిపెట్టారు. రూ.649.44 కోట్లతో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను ఒకే డీఈఈ, రెండు జిల్లాల్లో విస్తరించిన రూ.మూడు వేల కోట్ల విలువైన పనులను ఒక ఎస్ఈ, ఒక ఈఈ, 12 మంది డీఈలు పర్యవేక్షిస్తున్నారని.. దీనివల్ల పనుల నాణ్యత లోపించిందని నిపుణుల కమిటీ తేల్చింది. తనిఖీలు తుంగలోకి.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ అకౌంట్ కోడ్ (పేరా 294 నుంచి 297) ప్రకారం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనులను తనిఖీ చేసి రికార్డు చేసేవరకు బిల్లులు చెల్లించకూడదు. రూ.5 లక్షల కంటే ఎక్కువ అంచనా వ్యయం ఉన్న వాటిల్లో ఈఈ స్థాయి అధికారి కనీసం 30 శాతం పనులను తనిఖీ చేయాలి. రూ.50 లక్షలకు మించితే మూడింట ఒక వంతు లేదా మూడింట రెండొంతుల పనిని ఎస్ఈ స్థాయి అధికారి తనిఖీ చేశాకే బిల్లులు చెల్లించాలి. అయితే ఈ నిబంధనలు ఉల్లంఘించి తనిఖీలు లేకుండా, చెక్ మెజర్మెంట్ చేయకుండానే బిల్లులు చెల్లించారని నిపుణుల కమిటీ తేల్చింది. కాంట్రాక్టర్లకు లబ్ధి ఇలా... - ఇళ్ల నిర్మాణ ప్రాంతంలో రూ.7 లక్షలతో మోడల్ హౌస్ నిర్మించాల్సి ఉండగా రాష్ట్రవ్యాప్తంగా 225 ప్రాంతాల్లో ఏ ఒక్క చోట కూడా కాంట్రాక్టర్లు వీటిని కట్టలేదు. దీనివల్ల కాంట్రాక్టర్లకు రూ.15.75 కోట్ల మేర లబ్ధి చేకూరింది. - రూ.9.50 లక్షలతో 500 చదరపు అడుగుల్లో ఏపీ టిడ్కోకు సైట్ ఆఫీస్ నిర్మించి ఇవ్వాలి. కానీ ఒక్కచోట కూడా కాంట్రాక్టర్లు దీన్ని పాటించకపోవడంతో వారికి రూ.21.38 కోట్ల మేరకు ప్రయోజనం కలిగింది. - ఒక్కో స్టీల్ ఫ్రేమ్, షట్టర్స్(యూనిట్)ను రూ.6 వేల చొప్పున అధిక ధరకు కొనుగోలు చేసి కాంట్రాక్టర్లకు రూ.272.95 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు. కిటీకిలను కూడా ఒక్కో యూనిట్ రూ.6 వేల చొప్పున అధిక ధరకు కొనడంతో కాంట్రాక్టర్లకు రూ.272.95 కోట్ల మేర లబ్ధి కలిగింది. - ఇళ్లలో అంతర్గత విద్యుదీకరణ, నీటి సరాఫరా, పారిశుద్ధ్యం పనులకు చదరపు అడుగుకు రూ.175 చొప్పున చెల్లిస్తామని ఎస్టిమేట్లలో పేర్కొన్న ఏపీ టిడ్కో చదరపు అడుగుకు రూ.50 చొప్పున అధికంగా చెల్లించింది. ఇందులో కాంట్రాక్టర్లకు రూ.578.80 కోట్లను దోచిపెట్టారు. - విట్రిఫైడ్ టైల్స్ ఫ్లోరింగ్ పనుల్లోనూ కాంట్రాక్టర్లకు చదరపు అడుగుకు రూ.20 చొప్పున అధికంగా చెల్లించారు. పెయింటింగ్‌లో చదరపు అడుగుకు రూ.30 చొప్పున అధికంగా ఇచ్చారు. దీనివల్ల కాంట్రాక్టర్లకు రూ.578.80 కోట్ల మేర లబ్ధి చేకూరింది. - అల్యుమినియం షట్టరింగ్ వల్ల చదరపు అడుగుకు నిర్మాణ వ్యయం రూ.200 చొప్పున పెరిగి పేదలపై రూ.3186.92 కోట్ల భారం పడిందని నిపుణుల కమిటీ నిర్ధారించింది. కనీసం రిజిస్టర్లూ లేవు... - డిజైన్ 1893–2016 ప్రకారం రిజిడ్ మోనోలిథిక్ కన్స్టక్షన్ విధానంలో వంద మీమీల గోడ నిర్మించాల్సి ఉండగా ఒకే లేయర్ రీయిన్పోర్స్మెంట్ వినియోగిస్తుండటాన్ని కమిటీ తప్పుబట్టింది. - ఐబీఎం ప్రమాణాల ప్రకారం విస్కస్ మాడిఫైడ్ ఏజెంట్ క్యూబిక్ మీటర్‌కు 0.4 కేజీని వినియోగించాలి. సిమెంటు, నీటి నిష్పత్తి 0.43 శాతం ఉండాలి. క్షేత్ర స్థాయి పరీక్షలు, కోర్ డెస్ట్ల్లో వాటి పరిమాణాలు చాలా తక్కువగా ఉండటంతో పనులు నాసిరకంగా ఉన్నాయి. - ఒప్పందం ప్రకారం విద్యుత్ ఉపకరణాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం పనుల్లో ఉపయోగించే ఉపకరణాలు, డోర్స్, ప్లోరింగ్, టైల్స్ సరఫరా చేయడం లేదు. చౌకగా దొరికే నాసిరకమైన ఉపకరణాలను వినియోగిస్తున్నారు. - సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ప్రమాణాల మేరకు ఏపీ టిడ్కో అధికారులు రిజిస్టర్లు నిర్వహించడం లేదు. -
'పేదలకు ప్రభుత్వేఇల్లు కట్టిస్తుంది'
హైదరాబాద్: తెలంగాణలో పేదలకు ప్రభుత్వేఇల్లు కట్టిస్తుందని సీఎం కేసీఆర్ హామీయిచ్చారు. ఒక్కో ఇంటి్కి రూ. 5 లక్షలు ఖర్చు పెట్టనున్నట్టు చెప్పారు. 67 మున్సిపాలిటీల్లో ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని 550 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన ఇళ్ల తరహాలో అన్ని మున్సిపాలిటీల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామన్నారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ ఈ వివరాలు వెల్లడించారు.