border attack
-
విరమణ.. ఉల్లంఘన
న్యూఢిల్లీ/వాషింగ్టన్/ఇస్లామాబాద్ కయ్యానికి కాలుదువ్విన దాయాదికి నాలుగు రోజుల్లోనే తత్వం బోధపడింది. సాయుధ ఘర్షణకు తెర దించుదామంటూ భారత్‌తో కాళ్లబేరానికి వచ్చింది. దాంతో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు ప్రభుత్వాలూ దాన్ని ధ్రువీకరించాయి. తమ మధ్యవర్తిత్వమే ఇందుకు కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా భారత్ దాన్ని తోసిపుచ్చింది. పాక్ విజ్ఞప్తి మేరకే ద్వైపాక్షిక చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. ‘‘శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. భూ, గగన, సముద్ర తలాల్లో పూర్తిస్థాయిలో కొనసాగుతుంది’’ అని విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ మీడియాకు వెల్లడించారు. కానీ కాసేపటికే పాక్ వంకర బుద్ధి ప్రదర్శించింది. శనివారం రాత్రి ఏడింటి నుంచీ మరోసారి దాడులకు దిగింది. సరిహద్దుల గుండా మళ్లీ డ్రోన్ ప్రయోగాలకు, కాల్పులకు తెగబడింది. కోరి కుదుర్చుకున్న విరమణ ఒప్పందానికి గంటల వ్యవధిలోనే తూట్లు పొడిచి తాను ధూర్తదేశాన్నేనని మరోసారి నిరూపించుకుంది. ఈ పరిణామంపై భారత్ మండిపడింది. రాత్రి 11 గంటలకు మిస్రీ మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఓవైపు విరమణ అంటూనే మరోవైపు సరిహద్దుల వెంబడి పాక్ తిరిగి దాడులు, కాల్పులకు దిగిందంటూ ధ్వజమెత్తారు. ఒప్పందం కుదిరిందన్న ట్రంప్పాక్ దొంగ నాటకాల నడుమ శనివారం రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటేదాకా పాక్ సైన్యం క్షిపణి, డ్రోన్ దాడులు, సరిహద్దుల వెంబడి కాల్పులు కొనసాగించింది. వాటికి దీటుగా బదులిచ్చిన భారత్ శనివారం తెల్లవారుజాము నుంచీ తీవ్రస్థాయిలో ప్రతి దాడులకు దిగింది. ఆరు పాక్ వైమానిక, రెండు రాడార్ కేంద్రాలను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల నడుమ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్య ప్రకటన చేశారు. సొంత సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ సోషల్‌లో సాయంత్రం ఐదింటి ప్రాంతంలో ఈ మేరకు పోస్ట్ చేశారు. ‘‘అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా జరిగిన చర్చోపచర్చల అనంతరం ఎట్టకేలకు ఇరు దేశాలూ తక్షణం పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి’’ అని పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా అవే వ్యాఖ్యలు చేశారు. ప్రధానులు నరేంద్ర మోదీ, షహబాజ్ షరీఫ్‌లకు అభినందనలు తెలిపారు. ట్రంప్ బృందం ఈ దిశగా అద్భుతంగా పని చేసిందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పుకొచ్చారు. సాయంత్రం ఆరింటికి విదేశాంగ కార్యదర్శి మిస్రీ మీడియా ముందుకొచ్చారు. ‘‘పాక్ విజ్ఞప్తి మేరకే విరమణకు ఒప్పుకున్నాం. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత డీజీఎంఓకు ఫోన్ చేశారు. వారి నడుమ చర్చల ఫలితంగా ఈ మేరకు ఒప్పందం కుదిరింది’’ అని స్పష్టం చేశారు. దీనిపై డీజీఎంఓల నడుమ సోమవారం పూర్తిస్థాయి చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ‘‘శాంతి సాధనకు ఇది నూతన ప్రారంభం. కాల్పుల విరమణకు చొరవ చూపినందుకు ట్రంప్, వాన్స్, రూబియోలకు కృతజ్ఞతలు’’ అంటూ పాక్ ప్రధాని షహబాజ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టి(పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో, ప్రజాప్రతినిధులు తదితరులు ఒప్పందాన్ని స్వాగతించారు. అనంతరం తన గగనతలాన్ని తెరుస్తున్నట్టు పాక్ ప్రకటించింది. బయటపడ్డ పాక్ నైజం కొద్ది గంటలైనా గడవకుండానే పాక్ తన బుద్ధి బయటపెట్టుకుంది. విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం రాత్రి ఏడింటి నుంచే మరోసారి సరిహద్దుల వెంబడి దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్ మొదలుకుని గుజరాత్ దాకా పలుచోట్ల డ్రోన్ దాడులు జరిగాయి. శ్రీనగర్‌లో భారీ పేలుడు శబ్దాలు విని్పంచాయి. బారాముల్లా తదితర చోట్ల సైనిక స్థావరాల సమీపంలో డ్రోన్లు ఎగురుతూ కని్పంచాయి. దీనిపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ‘‘శ్రీనగర్ అంతటా పేలుళ్ల శబ్దాలే. ఏమిటిది? విరమణకు అప్పుడే తూట్లా?’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు మొదలయ్యాయి. పాక్ దాడులకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. జమ్మూ, శ్రీనగర్, గుజరాత్‌లోని భుజ్ తదితర చోట్ల పాక్ డ్రోన్లను బలగాలు కూల్చేశాయి. కచ్ తదితర చోట్ల కూడా డ్రోన్లు కని్పంచినట్టు రాష్ట్ర మంత్రి హర్‡్ష సంఘవి ధ్రువీకరించారు. ముందుజాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల్లో పలుచోట్ల కరెంటు సరఫరా నిలిపేసి బ్లాకౌట్ పాటించారు. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే పాక్ ఉల్లంఘించింది. ఇది అత్యంత దుర్మార్గం. ఇందుకు పూర్తి బాధ్యత ఆ దేశానిదే. దీన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం. మతిలేని చర్యలను ఇకనైనా కట్టిపెట్టి కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ పూర్తిస్థాయిలో కట్టుబడాలి. లేదంటే తీవ్రస్థాయిలో ప్రతిక్రియ తప్పదు. దాడులను దీటుగా తిప్పికొట్టాల్సిందిగా సైన్యానికి పూర్తిస్థాయి ఆదేశాలిచ్చాం. – విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ -
ఉక్రెయిన్‌పై రష్యా ‘ప్లాన్ సీ’ దాడులు?
Russia Ukraine Conflict: ఒకవైపు అమెరికా అధ్యక్షుడు బైడెన్, పుతిన్ నడుమ చర్యలపై రష్యా యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చెప్పినట్లు.. ఇరు దేశాల అధ్యక్షుల నడుమ ఫేస్ టు ఫేస్ చర్చలు ఉండబోవని, కేవలం ఉక్రెయిన్ అంశం ఆధారంగా ‘భద్రత, యూరప్‌లో వ్యూహాత్మక స్థిరత్వం’ కోసం ఇరుదేశాల విదేశాంగ ప్రతినిధుల మధ్య మాత్రమే భేటీ జరగొచ్చని పేర్కొంది. ఈ తరుణంలో ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు ఇంకా ఆవరించే ఉండగా.. తాజాగా ఉక్రెయిన్ అంతర్గతంగా హెచ్చరికలు జారీ చేసింది. రష్యా ప్లాన్ సీ తరహా దాడులకు సిద్ధమైనట్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్లాన్ సీ అంటే ఏంటో కాదు.. సీ అంటే సైబర్ దాడులు. రష్యా రాజధాని మాస్కో కేంద్రంగా భారీ ఎత్తున్న సైబర్ ఎటాక్‌లు జరిగే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం ఈ దాడులు జరిగే అవకాశం ఉండొచ్చని, బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలను అప్రమత్తం చేసింది ఉక్రెయిన్ ప్రభుత్వం. అయితే రష్యా, ఉక్రెయిన్‌పై సైబర్ దాడులకు పాల్పడడం కొత్తేం కాదు. కానీ, సరిహద్దు పరిణామాల తర్వాత ఉక్రెయిన్‌లో సైబర్ దాడులు పెరిగిపోయాయి. ఈ దాడుల వెనుక రష్యానే ఉందని ఉక్రెయిన్ ఆరోపిస్తూ వస్తోంది కూడా. అయితే మాస్కో అధికారులు మాత్రం ఆ ఆరోపణల్ని ఖండిస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ ప్రభుత్వ ఆధీనంలోని సైబర్ సెక్యూరిటీ సీఈఆర్టీ-యూఏ సోమవారం హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్ బ్యాంకింగ్‌తో పాటు రక్షణ వ్యవస్థకు కూడా ముప్పు పొంచి ఉందని వారించింది ఆ ఏజెన్సీ. ఉక్రెయిన్ ఆక్రమణకు సిద్ధపడిన నేపథ్యంలో.. ముందుగా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయాలని రష్యా భావిస్తున్నట్లు పలు అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజధాని కీవ్‌లో ఉన్న ప్రముఖ బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలను మాస్కో ప్రభుత్వ హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుందని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. గతవారం ఉక్రెయిన్ రక్షణ విభాగపు వెబ్సైట్, పలు బ్యాంకుల వెబ్సైట్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన టెర్మినల్ సేవలకు విఘాతం ఏర్పడింది. దీని వెనుక మాస్కో హ్యాకర్ల హస్తం ఉందనేది ఉక్రెయిన్ ఆరోపణ. ఇప్పటికే యుద్ధవాతావరణంతో ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా కుదేలు అయిన సంగతి తెలిసిందే. మరోవైపు సరిహద్దులో పరిస్థితులు చల్లారినట్లే కనిపిస్తున్నప్పటికీ.. పశ్చిమ భాగంలో మోహరింపులు, వేర్పాటువాదుల నుంచి ఉక్రెయిన్‌పై దాడులు, ప్రతిగా ఉక్రెయిన్ జరుపుతున్న దాడుల్లో రష్యాకు ఆస్తి నష్టం వాటిల్లుతుండడం లాంటి పరిణామాలు నెలకొంటున్నాయి. ఇదిలా ఉండగా.. రష్యా భూభాగంలో ఉక్రెయిన్‌కు చెందిన ఐదుగురు విధ్వంసకారులను హతమార్చినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. సంబంధిత వార్త: భారతీయ విద్యార్థులకు ఉక్రెయిన్‌లో చుక్కలు.. పరిస్థితి చెయ్యి దాటిందా? -
ఉత్పాతాల ఛాయలో...
ఇవి పశ్చిమాసియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం, బ్రెజిల్ అంతర్గత పోరుకు నిదర్శనాలు! వీటిని ఫ్రేమ్‌లో బంధించిన సాహసి.. కరోల్ గూజి! ప్రపంచ ప్రఖ్యాత ఫొటో జర్నలిస్ట్. సంక్లిష్ట జీవితాలను కెమెరాతో ప్రపంచానికి చూపించి.. ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ పురస్కారాన్ని పొందారు.. ఒకటి.. రెండు కాదు నాలుగు సార్లు. ఈ ఘనత సాధించిన తొలి జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పనికి జెండర్ కాదు సామర్థ్యం ముఖ్యమని నిరూపించారు. నేపథ్యం.. అరవై మూడేళ్ల కరోల్.. అమెరికా వాస్తవ్యురాలు. చిన్నప్పుడే తండ్రి చనిపోతే తల్లి రెక్కల కష్టంతో పెరిగారు. తల్లి ఆర్థిక బాధ్యతలను పంచుకోవడానికి నర్స్‌గా ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ సమయంలోనే కరోల్ ఫ్రెండ్ ఒకతను ఆమెకు ఎస్ఎల్ఆర్ కెమెరాను కానుకగా ఇచ్చాడు. అది ఆమె లక్ష్యాన్ని ఫోకస్ చేసింది. ఫొటోజర్నలిస్ట్ కావాలని ఫొటోగ్రఫీ కోర్స్‌లో జాయిన్ అయ్యారు. ‘ది మియామీ హెరాల్డ్’లో ఇంటర్న్‌గా అవకాశం వచ్చింది. తర్వాత 1988లో ‘ది వాషింగ్టన్ పోస్ట్’లో స్టాఫ్ ఫొటోగ్రాఫర్‌గా ఉద్యోగం దొరికింది. 2014 వరకు అక్కడే ఉన్నారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ ఫొటో జర్నలిస్ట్‌గా జగమంత వేదిక చేసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, సంఘర్షణ పరిస్థితుల మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టారు? కళ్లముందు జరుగుతున్న నిజాలను లోకానికి తెలియజేయాలి. అవి ప్రకృతి వైపరీత్యాలైనా(హైతీ), సంఘర్షణాత్మక ప్రాంతాల్లోని పరిస్థితులనైనా. ఆ బాధితుల పట్ల మిగిలిన ప్రపంచానికున్న బాధ్యతను గుర్తు చేయాలి. ఫొటో జర్నలిస్ట్‌గా అది నా రెస్పాన్స్‌బులిటీ. అందుకే ఆ వాస్తవాల చుట్టే తిరుగుతున్నా ఇప్పటికీ. సవాళ్లు? నేను వచ్చిన కొత్తలో ఈ రంగంలో మహిళలు చాలా చాలా తక్కువ. అంతర్జాతీయ సమస్యల మీద రాసేవాళ్లు మరీ తక్కువ. ఇప్పుడలా లేదు. చాలా మారిపోయింది. చాలామంది అమ్మాయిలు ఈ కెరీర్‌ను ఎంచుకుంటున్నారు. మంచి పరిణామం. అయినా పని విషయంలో జెండర్ కాదు, సామర్థ్యాన్ని చూడాలి. వృత్తి పట్ల నిబద్ధతను చూడాలి. దేన్నయినా జనరలైజ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కో దృక్పథం. మహిళలకు భిన్నమైన జీవితానుభవాలుంటాయి. ఆ అనుభవాల్లోంచి వాళ్ల దృష్టికోణం ఏర్పడుతుంది. ఆ మాటకొస్తే మనం నివసించే ప్రాంతం, వాతావరణం, సంస్కృతి.. వీటన్నిటి ప్రభావమూ మన ఆలోచనల మీద ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్లే భిన్నమైన వాళ్లు. ఈ భిన్నత్వంతోనే ప్రపంచం బ్యాలెన్స్ అవుతోంది. తుపాకులు, బాంబుల మోతలో కెమెరాతో సైలెంట్‌గా ఎలా? బేసిగ్గా నేను వార్ ఫొటోగ్రాఫర్‌ని కాను. కాబట్టి ఫ్రంట్‌లైన్ ఎక్స్‌పీరియెన్స్ ఏమీ నాకు లేదు. కాని ఈ మధ్య ఐఎస్ఐఎస్ కాన్ఫ్లిక్ట్ జోన్‌కి వెళ్లాను. ఆ విధ్వంసం తర్వాత ఉండే ఎమోషనల్ డ్రామా నన్ను బాగా కలచివేసింది, భయపెట్టింది. సూసైడ్ బాంబర్స్‌గా తండ్రులు చనిపోతారు. తల్లులు గాయాలతో పడి ఉంటారు. తల్లిదండ్రుల కోసం ఆ పిల్లలు పెట్టే ఆర్తనాదాలు.. వెంటాడుతుంటాయి. ఆడవాళ్ల పరిస్థితుల్లో తేడాలు గమనించారా? మీరెక్కడ ఉన్నారన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ నా విషయానికి వస్తే.. మిగతా వాళ్లతో పోలిస్తే అమెరికన్ ఉమన్‌గా నాకు చాలా స్వేచ్ఛ ఉంటుంది. కొన్ని దేశాల సంస్కృతి వేరు. తగ్గట్టే స్త్రీల స్థితీ వేరుగానే ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులు చాలా మారినా లింగ వివక్ష, మహిళల పట్ల వేధింపులు మాత్రం తగ్గలేదు. మహిళలు, పిల్లలు ఇంకా వల్నరబులే. దీని మీద మెయిన్ స్ట్రీమ్ మీడియా దృష్టి పెట్టాలి. మహిళల దృక్పథంలో మనందరం పనిచేయాలి. భావప్రకటనా స్వేచ్ఛ ప్రపంచంలోని దాదాపు అన్ని చోట్లా ప్రమాదంలోనే ఉంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమిది. తమ హక్కుల గురించి మాట్లాడేందుకు, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛను మించిన ఆయుధాల్లేవు. ముఖ్యంగా ఆడవాళ్లకు. వీటి మీద ఆంక్షలు పెడుతూ ప్రజలకు నిజాలు తెలియనీయకుండా చేస్తున్నాయి ప్రభుత్వాలు. జర్నలిస్ట్‌లు.. జర్నలిస్ట్‌లు, ఫొటోజర్నలిస్ట్లు.. ఎవరైనా సరే.. నిజాలను వెలికి తీయాలి. మీ పనే మీ గురించి చెబుతుంది. పని.. విశ్వజనీనమైన భాష. – సరస్వతి రమ ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి ►ఇండియా పర్యటన ఇదే మొదటిసారి కాదు. చాలాసార్లు వచ్చాను అసైన్మెంట్స్ మీద. మదర్ థెరిస్సా అంతిమయాత్రనూ కవర్ చేశాను. హైదరాబాద్‌కు రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. ట్రాఫిక్ తప్ప అంతా బాగుంది (నవ్వుతూ)ఈ దేశం విజువల్‌గా బ్రైట్ అండ్ బ్యూటిఫుల్. పీపుల్ ఆర్ సో స్వీట్. -
సరిహద్దుల్లో కాల్పులు: 14 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ - అప్ఘానిస్థాన్ సరిహద్దు ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతం దండీ కచ్ ప్రాంతం మంగళవారం రక్తసిక్తంగా మారింది. ఆఫ్ఘానిస్థాన్కు చెందిన తీవ్రవాదుల బృందం పాక్ సరిహద్దు వద్ద పహారా కాస్తున్న సైనికులపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడింది. సైనికులు వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో సైనికులు ఎదురు కాల్పులకు దిగారు. ఇరుపులా హోరాహోరి కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. వారిలో 11 మంది తీవ్రవాదులు కాగా, ముగ్గురు సైనికులని మీడియా మంగళవారం తెలిపింది. భద్రత దళాలు ఓ తీవ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. అయితే అంతముందు అంటే ఈ రోజు ఉదయం కైబర్ ప్రాంతంలో వైమానిక దాడులలో ఐదు శిబిరాలను నాశనం కాగా, 20 మంది తీవ్రవాదులు మృతి చెందారని పేర్కొంది.