breaking news
Bonala festival celebrations
-
ఫలమా.. ఫలహారమా?
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర సంస్కృతికి ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తల్తెత్తకుండా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిద్ధమైంది. ఆరు జోన్లలో వివిధ సర్కిళ్ల పరిధిలో రోడ్ల మరమ్మతులు, విద్యుద్దీపాలు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతుల కల్పనకు రూ.26 కోట్లు కేటాయిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 444 పనులను గుర్తించి నిధులు మంజూరు చేశారు.జోన్ల వారీగా ఇలా.. కేటాయింపుల్లో రాజేంద్రనగర్, చార్మినార్ జోన్లకు సింహభాగం నిధులు దక్కాయి. రాజేంద్రనగర్ జోన్ పరిధిలో అత్యధికంగా 160 పనుల కోసం రూ.8.79 కోట్లు కేటాయించారు. ఇందులో ముఖ్యంగా జంగమ్మెట్ సర్కిల్లో 96 పనులకు రూ.5.63 కోట్లు ఖర్చు చేయనున్నారు. చార్మినార్ జోన్లో 137 పనులకు రూ.8.65 కోట్లు మంజూరయ్యాయి. చార్మినార్ సర్కిల్లోనే రూ.3.98 కోట్లతో పనులు చేపట్టనున్నారు. గోల్కొండ జోన్లో 89 పనులకు రూ.5.95 కోట్లు, గోల్కొండ సర్కిల్లో రూ.2.54 కోట్లతో 27 పనులు చేపట్టనున్నారు. ఉజ్జయినీ మహంకాళి బోనాలకు కేంద్రమైన సికింద్రాబాద్ పరిధి లో 32 పనులకు రూ.1.35 కోట్లు మంజూరు చేశారు. శంషాబాద్ జోన్లో 20 పనులకు రూ.93.40 లక్షలు కేటాయించారు. ఖైరతాబాద్ ఈ జోన్లో కేవలం 6 పనులు గుర్తించి అత్యల్పంగా రూ.30.55 లక్షలు మంజూరు చేశారు. బిల్లులకు చిల్లు.. బోనాల ఏర్పాట్లకు నిధుల మంజూరు హర్షణీయమే.. కానీ.. ఈ సారైనా పనులు సక్రమంగా చేస్తారా? లేక గతంలో మాదిరిగానే బిల్లులతోనే ఫలహారంలా పంచుకుంటారా? అని నగర వాసులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనుభవాలను పరిశీలిస్తే.. బోనాల ఉత్సవాల వేళ జీహెచ్ఎంసీ చేసే ఖర్చులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సగం పనులు కూడా పూర్తి చేయకుండానే, ఉత్సవాలు ముగిసిన వెంటనే 'పనులు పూర్తయ్యాయి’ అంటూ దొంగ బిల్లులు సృష్టించి ఖజానాను గుల్ల చేయడం పరిపాటిగా మారింది. చాలా ప్రాంతాల్లో పాత రంగులపైనే మళ్లీ నాసిరకం సున్నాలు చల్లడం, గుంతల రోడ్లకు మొక్కుబడిగా మట్టి కొట్టడం మినహా శాశ్వత పనులు చేసిన దాఖలాలు లేవు. -
న్యూజిలాండ్‌లో ఘనంగా బోనాల వేడుకలు
ఆక్లాండ్: బోనాల పండుగ వేడుకలను దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మన బోనం మరోసారి అమ్మవారికి భక్తితో సమర్పించబడింది. ఆషాడ మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకొని న్యూజిలాండ్ దేశంలోని ఆక్లాండ్ నగరంలో ప్రసిద్ధ శ్రీ గణేష దేవాలయంలో బోనాల పండుగ వేడుకలను నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి శ్రీ చంద్రు అమ్మవారిని వివిధ కూరగాయలు, పండ్లతో శాకంబరి రూపంలో అలంకరించి, శ్రీ గణేష హోమం మొదలుకొని వివిధ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారికి సమర్పించిన బోనాలకు ఆయన ప్రత్యేక పూజలుచేసి ప్రపంచ శాంతి, ప్రజలందరి సంక్షేమం కొరకు ప్రార్థించారు. అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. కన్నుల పండుగగా సాగిన కార్యక్రమంలో ఉమారామారావు రాచకొండ దంపతులు అమ్మవారికి వెండి బోనం సమర్పించారు. భక్తులు బోనాలతోపాటు, చీరలు, సారే, ఒడి బియ్యం అమ్మవారికి భక్తి పారవశ్యంతో సమర్పించారు. రామమోహన్ దంతాల, ఇతర ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించిన ఈ కార్యకమంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు, తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు పాల్గొన్నారు. రమా వెంకటనరసింహా రావు, సునీత జగన్ మోహన్ రెడ్డి వడ్నాల, లక్ష్మీ కళ్యాణ్‌రావు కాసుగంటి, శ్రీదేవి కృష్ణ పూసర్ల, లతా జగదీశ్వర్ రెడ్డి మగతల, వర్ష రాహుల్ ఆరేపల్లి, భవాని రవి బోనాలు సమర్పించారు. అభిలాష్వి జేత, యాచమనేని అనూరాధ, కీర్తన, శ్రీ రష్మి, అశుతోష్, సునీత, విజయ్ కృష్ణ, నరేందర్ రెడ్డి, వినోద్ ఎరబెల్లి, ఇంద్ర సిరిగిరి, శ్రీధర్ రెడ్డి, కిరణ్ పోకలతో పాటు భక్తులు అధిక సంఖ్యలోపాల్గొన్నారు -
లండన్‌లో బోనాలు
హైదరాబాద్: తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల పండుగ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను తలపించేలా నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఈ సంవత్సరం జరుపుకునే బోనాల పండుగకు ప్రత్యేకత ఉందన్నారు.


