breaking news
big budget films
-
పాపం.. సౌదీ అరేబియా.. వరల్డ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ..!
భారీ బడ్జెట్ సినిమాలు తీయాలంటేమన తెలుగులో రాజమౌళికి మాత్రమే సాధ్యం. వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ ప్రస్తుతం వారణాసి మూవీని తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలపై అంతకుమించిన వసూళ్లు వస్తాయనే ఆశ మేకర్స్‌కు ఉంటుంది. దర్శకుడు, నటీనటులు, కథపై వసూళ్లు అనేది ఆధారపడి ఉంటుంది. కేవలం బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే సరిపోదు. మేకింగ్ కూడా ఆ రేంజ్లో ఉంటేనే వర్కవుట్ అవుతుంది. కానీ ఈ విషయంలో మన రాజమౌళికి వచ్చిన ఇబ్బందేం లేదు. ఆయన తీసిన భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి.అయితే పులికి చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అనే సామెత మన వినే ఉంటాం. అలా ఇతర దేశాల్లాగే సినీరంగంలో తాము కూడా ప్రపంచస్థాయికి ఎదగాలని సౌదీ అరేబియా ఆశలు పెట్టుకుంది. అనుకోవడమే కాదు.. భారీ బడ్జెట్‌తో డెజర్ట్ వారియర్ అనే మూవీని నిర్మించింది. ప్రపంచంలోనే ఫేమస్ అయిన స్టార్స్‌ను పెట్టి ఈ సినిమా కోసం ఏకంగా రూ.1400 కోట్ల ఖర్చు చేసింది. కట్ చేస్తే.. సీన్ అంతా రివర్స్ అయింది. అనుకున్నది ఒక్కటీ.. అయిందొక్కటి అన్న తీరుగా మారిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కేవలం రూ.6 కోట్లు మాత్రమే సాధించింది. ఈ వసూళ్లతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా రికార్డ్ సృష్టించింది. మొత్తం బడ్జెట్లో కేవలం 0.4 శాతం వాటా మాత్రమే వసూలు చేయగలిగింది. అంటే ఏకంగా 99.6 శాతం నష్టాలు తెచ్చిపెట్టింది. అయితే కొవిడ్ కారణంగా ఆలస్యం కావడం, భారీ సెట్లు, అంతర్జాతీయ సాంకేతిక నిపుణులతో మూవీని తెరకెక్కించడంతో బడ్జెట్ పెరిగినట్లు తెలుస్తోంది.ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో సౌదీ అరేబియా పేరును తీసుకు రావాలని అనుకోవడం మంచిదే. అయితే భారీ బడ్జెట్ మాత్రమే కాకుండా కథపై కూడా దృష్టి పెట్టి ఉంటే మరింత బాగుండేదని సినీ ప్రియులు అంటున్నారు. ఈ డిజాస్టర్ మూవీతో తమ దేశంలోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలని సౌదీ అరేబియా చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇక నుంచైనా సౌదీ అరేబియా మన దర్శకధీరుడు రాజమౌళి సలహాలు తీసుకుంటే మంచిదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సౌదీ అరేబియా ఏంబీసీ గ్రూప్ ద్వారా 'డెజర్ట్ వారియర్' లాంటి చారిత్రక వార్ మూవీని నిర్మించింది. దాదాపు 7వ శతాబ్దపు అరేబియా నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పటి చక్రవర్తి కిస్రాకు వ్యతిరేకంగా యువరాణి హింద్ సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమాకు రూపొందించారు. ఈ మూవీకి రూపెర్ట్ వ్యాట్ (రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫేమ్) దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మార్వెల్ నటుడు ఆంథోనీ మాకీ, ఆస్కార్ విజేత బెన్ కింగ్స్లీ, ఐషా హార్ట్, షార్ల్టో కోప్లీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. -
ఇక భారీ చిత్రాల హంగామా
ఇక భారీ చిత్రాల హంగామా త్వరలో మొదలు కానుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమలహాసన్, సియాన్ విక్రమ్, ఇళయదళపతి విజయ్, విశాల్ నటించిన భారీ బడ్జెట్ చిత్రాలు వరుసగా తెరపై సందడి చేయడానికి సిద్ధం అవుతున్నాయి. దీంతో జనవరి వరకు చిన్న బడ్జెట్ చిత్రాలు విడుదలకు అవకాశం లేదు. ఇది చిన్న నిర్మాతలకు బాధాకరమైన విషయమే. ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ నిర్మాతలు వడ్డీల భారం మోయాల్సి వస్తుందని బాధపడుతున్నారు. ఇక వచ్చే వారం నుంచి విడుదలయ్యే భారీ చిత్రాల వివరాల్లోకెళితే దీపావళికి విజయ్ కత్తి, విశాల్ పూజై బరిలోకి దిగుతున్నాయి. దీపావళికి కత్తి విజయ్, సమంత జంటగా నటించిన చిత్రం కత్తి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో విజయ్ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. కత్తి చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. మాస్ మసాలా పూజై విశాల్ నటించిన పూజై చిత్రం కూడా మాస్ మసాలా చిత్రమే. క్రేజీ బ్యూటీ శ్రుతిహాసన్ హీరోయిన్. ఈ ముద్దుగుమ్మ పూజైపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కారణం ఈమెకి అర్జంటుగా ఇక్కడ హిట్ అవసరం. కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కించిన మరో హై వోల్టేజ్ యాక్షన్చిత్రం పూజై. యువన్ శంకర్‌రాజా సంగీతం అందించారు. నటి ఆండ్రియూ ఐటమ్సాంగ్అదనపు ఆకర్షణగా నిలుస్తుందంటున్నారుు చిత్ర యూనిట్ వర్గాలు. శంకర్ చిత్రం ఐ ఈ చిత్రాల హవా కొనసాగుతుండగానే స్టార్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన అత్యంత భారీ బ్రహ్మాండమైన చిత్రం ఐ తెరపైకి రానుంది. ఎమిజాక్సన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు అందించారు. భారీ చిత్రాల నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన మరో అద్భుత చిత్రం ఐ. సినిమా ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం క్రేజ్ డిసెంబర్ వరకు ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. రజనీ బర్త్‌డే కానుక డిసెంబర్ 12కు ఒక ప్రత్యేకత ఉంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టినరోజది. ఆ రోజున ఆయన నటిస్తున్న మెస్మరైజింగ్ చిత్రం లింగాను విడుదల చేయనున్నట్లు దర్శక, నిర్మాతలు ముందుగానే ప్రకటించారు. కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒకపాత్ర 80 కాలంలోనిది కాగా మరో పాత్ర సమకాలానికి చెందిందని సమాచారం. ఈ పాత్రలో రజని జీన్స్ ప్యాంటు, షర్టు ధరించి నడిచొస్తున్న స్టిల్స్ చూసి ఆయన అభిమానుల మనసు ఇప్పుడే ఉరకలేస్తోంది. ఇక చిత్రం విడుదలైన తరువాత ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అనే అంచనాలు పెరుగుతున్నారుు. ముంబయి బ్యూటీ సోనాక్షి సిన్హా, అందాల భామ అనుష్కతో లింగా చిత్రానికి అదనపు ఆకర్షణే. ఈ చిత్రం హవా జనవరి వరకు సాగుతుందనడానికి ఎలాంటి సందేహం ఉండదు. చివర్లో విశ్వరూపం 2 ఈ ఏడాది చివరిలోనే విశ్వనాయకుడు కమల్ విశ్వరూపం-2 తెరపైకి రానున్నట్లు సమాచారం. విశ్వరూపం చిత్రంలోనే సంచలనం సృష్టించిన కమల్ దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలుండటం సహజమే. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి రెండు రోజులు షూటింగ్ జరపాల్సి ఉందట. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలోనే తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నిజానికి కమల్ నటించిన ఉత్తమ విలన్ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ముందుగా ఈ చిత్రాన్నే విడుదల చేయాలనుకున్నారు. కారణాలేమైనా ఈ చిత్రం జనవరి తరువాతనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కమలహాసన్ నటిస్తున్న పాపనాశం చిత్రాన్ని కూడా 2015లోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలా భారీ చిత్రాలు వరుసగా తెరపైకి రానుండడంతో చిన్న చిత్రాలు విడుదలయ్యే అవకాశాలు లేదు. అయితే ఈ చిత్రలు ఓవర్ ఫ్లోపై ఆశపెట్టుకున్న కొందరు చిన్న నిర్మాతలు తమ చిత్రాలను ధైర్యం చేసి వాటితో పాటు రిలీజ్ చేసే అవకాశం లేకపోలేదు. ధనుష్ నటించిన అనేగన్, ఆర్య హీరోగా నటిస్తున్న మిగామాన్, శివకార్తికేయన్ కాకీచట్టై, విజయ్ సేతుపతి నటించిన ఇడం పొరుల్, ఎవల్, జయంరవి నటించిన భూలోకం తదితర 15 చిత్రాలు జనవరి తరువాతనే తెరపైకి వచ్చే అవకాశం ఉంది.


