breaking news
Bibi ka alam procession
-
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ‘బీబీ కా అలవా’ నుంచి ప్రారంభమయ్యే ‘బీబీ కా ఆలమ్’ ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నెల 26వ తేదీ(శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.ట్రాఫిక్ మళ్లింపు:బీబీ కా అలవా మార్గం: బీబీ కా అలవా వైపునకు వాహనాల రాకపోకలు అనుమతించబడవు. ఈ ట్రాఫిక్‌ను సునార్‌గల్లీ ‘టి’ జంక్షన్ వద్ద దబీర్‌పురా దర్వాజా మరియు గంగా నగర్ నాలా, యాకుత్‌పురా వైపునకు మళ్లిస్తారు.షేక్ ఫైజ్ కమాన్ మార్గం: షేక్ ఫైజ్ కమాన్ వైపునకు వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను జబ్బార్ హోటల్ వద్ద అవసరాన్ని బట్టి దబీర్‌పురా దర్వాజా లేదా చంచల్‌గూడ వైపునకు మళ్లిస్తారు.ఏతేబార్ చౌక్ మార్గం: ఏతేబార్ చౌక్ నుండి బడా బజార్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను ఏతేబార్ చౌక్ వద్ద పరిస్థితిని బట్టి కోట్లా అలీజా లేదా పురాణీ హవేలీ వైపునకు మళ్లిస్తారు.గంగా నగర్ నాలా (యాకుత్‌పురా): ప్రధాన ఊరేగింపు గంగా నగర్ నాలాకు చేరుకున్నప్పుడు, పురాణీ హవేలీ నుండి ఏతేబార్ చౌక్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను పురాణీ హవేలీ వద్ద చత్తా బజార్, దబీర్‌పురా, ఎస్జే రోటరీ వైపునకు మళ్లిస్తారు.బీబీ బజార్ చౌరస్తా: ఊరేగింపు గంగా నగర్ నాలాకు చేరుకున్నప్పుడు, మొఘల్‌పురా మరియు వోల్టా హోటల్ నుండి ఏతేబార్ చౌక్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను బీబీ బజార్ చౌరస్తా వద్ద పారిస్ కేఫ్ లేదా తలాబ్ కట్ట వైపునకు మళ్లిస్తారు.గుల్జార్ హౌజ్: ఊరేగింపు ఏతేబార్ చౌక్‌కు చేరుకున్నప్పుడు, మిట్టీ కా షేర్ మరియు మదీనా నుండి ఏతేబార్ చౌక్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను గుల్జార్ హౌజ్ వద్ద మదీనా లేదా మిట్టీ కా షేర్ వైపునకు మళ్లిస్తారు.హాఫెజ్ డంకా మసీదు: ఊరేగింపు కోట్లా అలీజాకు చేరుకున్నప్పుడు, మొఘల్‌పురా వాటర్ ట్యాంక్ నుండి చౌక్ మైదాన్ ఖాన్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను హాఫెజ్ డంకా మసీదు వద్ద పారిస్ కేఫ్ లేదా బీబీ బజార్ వైపునకు మళ్లిస్తారు.చార్మినార్ ప్రాంతం: ఊరేగింపు చార్మినార్‌కు చేరుకున్నప్పుడు, శక్కర్‌కోట్ నుండి గుల్జార్ హౌజ్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. దీనిని మిట్టీ కా షేర్ జంక్షన్ వద్ద ఘన్సీ బజార్ లేదా చేలాపురా వైపునకు మళ్లిస్తారు. అదే సమయంలో ఏతేబార్ చౌక్ వద్ద ఉన్న ట్రాఫిక్‌ను అలీజా కోట్ల, పురాణీ హవేలీ వైపునకు మళ్లిస్తారు.మదీనా చౌరస్తా: ఊరేగింపు చార్మినార్‌కు చేరుకున్నప్పుడు, నయాపూల్ నుండి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను మదీనా చౌరస్తా వద్ద సిటీ కాలేజ్ వైపునకు మళ్లిస్తారు.సాలార్ జంగ్ రోటరీ: ఊరేగింపు మీరాలం మండికి చేరుకున్నప్పుడు.. చాదర్‌ఘాట్ రోటరీ, నూర్ ఖాన్ బజార్, సాలార్ జంగ్ మ్యూజియం, శివాజీ బ్రిడ్జ్ నుండి పురాణీ హవేలీ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను సాలార్ జంగ్ రోటరీ వద్ద నయాపూల్, శివాజీ బ్రిడ్జ్, నూర్ ఖాన్ బజార్ వైపునకు మళ్లిస్తారు.చాదర్‌ఘాట్ రోటరీ: ఊరేగింపు అలవా సర్తౌక్‌కు చేరుకున్నప్పుడు, చాదర్‌ఘాట్ రోటరీ నుండి కాళీ ఖబర్ వైపు వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను చాదర్‌ఘాట్ రోటరీ వద్ద చాదర్‌ఘాట్ బ్రిడ్జ్ మీదుగా రంగమహల్ లేదా కోటి వైపునకు మళ్లిస్తారు.సాలార్ జంగ్/శివాజీ బ్రిడ్జ్ ప్రవేశ మార్గం: గౌలిగూడ లేదా అఫ్జల్‌గంజ్ నుండి సాలార్ జంగ్/శివాజీ బ్రిడ్జ్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. గౌలిగూడ వైపు ఉన్న సాలార్ జంగ్/శివాజీ బ్రిడ్జ్ ప్రవేశ ద్వారం వద్దనే ఈ ట్రాఫిక్‌ను తిరిగి అఫ్జల్‌గంజ్, గౌలిగూడ వైపునకు మళ్లిస్తారు.నయాపూల్: ఊరేగింపు అలవా సర్తౌక్‌కు చేరుకున్నప్పుడు, ఎస్జే రోటరీ వైపు వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను నయాపూల్ వద్ద మదీనా వైపునకు మళ్లిస్తారు.ఆర్టీసీ బస్సుల మళ్లింపు: ఏపీఎస్ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీ జిల్లా బస్సుల రాకపోకలను 26వ తేదీ ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు రంగమహల్, అఫ్జల్‌గంజ్ వైపునకు మళ్లిస్తారు. ఊరేగింపు ముగింపు స్థానానికి చేరుకునే వరకు ఈ బస్సులను కాళీ ఖబర్, మీరాలం మండి రోడ్డుపైకి అనుమతించరు. -
432 ఏళ్లుగా ఆగని అడుగులు..
సాక్షి, హైదరాబాద్: రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. రాజులు మారారు. రోజులు మారాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ.. 1594 నుంచి ఒక్క ఏడాది కూడా ఆగకుండా భాగ్యనగర గుండెల్లో నడిచే చరిత్ర ఇది. కుతుబ్ షాహీల వారసత్వం, నిజాం పాలనకు ముగింపు పలికినా చెక్కుచెదరని సంప్రదాయం బీబీ కా అలం. వజ్రాలు, వైఢూర్యాలు పొదిగిన అలంతో ఏనుగుపై సాగే ఈ ఊరేగింపు ఈ నెల 26న మరోసారి నగర వీధుల్లో పునరావృతం కానుంది. మొహర్రం సందర్భంగా ఈ ఏడాది కేరళ నుంచి ప్రత్యేకంగా ఏనుగును తీసుకురావడం విశేషం.వజ్ర, వైఢూర్యాల వైభవం.. మహ్మద్ ప్రవక్త కుమార్తె బీబీ ఫాతిమా కాలం చేసిన అనంతరం ఆమె చివరి స్నానంగా వినియోగించిన బల్లను ఆరో కుతుబ్ షాహీ రాజు మహమ్మద్ కులీ తల్లి హయత్ భక్షి బేగం కోరిక మేరకు తీసుకొచ్చి దాంతోనే తయారు చేసిన అలంను ఆమె జ్ఞాపకార్థం నగరంలో 1594లో ప్రతిíÙ్ఠంచారు. నిజాం పాలకులు బహుమతిగా ఇచి్చన వజ్రాలు, వైఢూర్యాలు, అరుదైన రత్నాలు అలం చుట్టూ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.ఏడాది పొడవునా దబీర్‌పురాలోని బీబీ కా అలావాలో పోలీసుల ఆర్మ్డ్ గార్డ్ రక్షణలో భద్రంగా ఉంచి, ఊరేగింపు రోజు మాత్రమే వీటిని బయటకు తీస్తారు. పోలీస్, జీహెచ్ఎంసీ, విద్యుత్, రెవెన్యూ శాఖల సమన్వయంతో 432 ఏళ్లుగా ఊరేగింపు కొనసాగుతోంది. ఈ నెల 26న దబీర్‌పురా నుంచి చార్మినార్, గుల్జార్ హౌజ్ మీదుగా చాదర్‌ఘాట్ వరకు సాగే ఊరేగింపునకు 2వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సంప్రదాయం హైదరాబాద్ మత సామరస్యానికి, గంగా జమునా తెహజీబ్‌కు నిలువెత్తు నిదర్శనం. -
బీబీ కా ఆలంలో వైఎస్ షర్మిల ప్రత్యేక ప్రార్థనలు
-
పాతబస్తీలో ప్రారంభమైన బీబీ కా ఆలం ఊరేగింపు
సాక్షి, హైదరాబాద్: త్యాగానికి ప్రతీకగా జరుపుకునే మొహర్రం ఊరేగింపునకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఆదివారం పాతబస్తీలో ప్రసిద్ధ బీబీ కా ఆలం ఊరేగింపు ప్రారంభమైంది. ఈ ఊరేగింపునకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోవిడ్ ఆంక్షలతో ఏనుగుపై కాకుండా డీసీఎం వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. యాకత్పురా, చార్మినార్ గుల్జార్‌హౌస్, మీరాల మండి, దారుల్షిఫా మీదుగా చాదర్‌ఘాట్ వరకు ఆలం ఊరేగింపు జరిగింది. -
మొహర్రం.. ప్రశాంతం
-
ఘనంగా బీబీకా ఆలం ఊరేగింపు..
సాక్షి, హైదరాబాద్ : మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకొని ఆదివారం ఘనంగా నిర్వహించిన బీబీకాఆలం సామూహిక ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. ఇస్లాం మతం పరిరక్షణకు ప్రాణత్యాగం చేసిన హజ్రత్ ఇమాం హుస్సేన్, హసన్‌లను స్మరిస్తూ వేలాది మంది యువకులు, చిన్నారులు విషాద గీతాలు ఆలపిస్తూ చేతులకు బ్లేడ్లను అమర్చుకొని ఎదపై బాదుకుంటూ రక్తం చిందించారు. డబీర్‌పురా బీబీకా అలావా నుంచి ప్రారంభమైన భారీ ఊరేగింపు చాదర్‌ఘాట్ వరకు కొనసాగింది. దారి పొడవునా ఏర్పాటు చేసిన స్వాగత వేదికలపై నుంచి పలువురు అధికార, అనధికార ప్రముఖులు బీబీకాఆలంకు స్వాగతం పలికి పూలు, దట్టీలు సమర్పించారు. చార్మినార్ వద్ద నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, పురానీహవేలి వద్ద గ్రేటర్ డిప్యూటీ మేయర్ బాబా ఫసివుద్దీన్, సెట్విన్ చైర్మన్ మీర్ ఇనాయత్ అలీ బాక్రీ, టీఆర్ఎస్ సీనియర్‌నేత లయాఖ్ అలీ, దారుషిఫా వద్ద ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, గ్రేటర్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు హాజరై బీబీకా ఆలంకు స్వాగతం పలికి పూలు, దట్టీలు సమర్పించారు. (ఫొటో స్లైడ్ చూడండి..) -
ప్రశాంతంగా బీబీకా ఆలం ఊరేగింపు
చార్మినార్: మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన అంబారీపై బీబీకా ఆలం సామూహిక ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. ఇస్లాం మతం పరిరక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన హజ్రత్ ఇమాం హుస్సేన్, హసన్‌లను స్మరిస్తూ వేలాది మంది యువకులు, చిన్నారులు విషాద గీతాలు ఆలపిస్తూ చేతులకు బ్లేడ్లను అమర్చుకొని ఎదపై బాదుకుంటూ రక్తం చిందించారు. డబీర్‌పురా బీబీకా అలావా నుంచి ప్రారంభమైన భారీ ఊరేగింపు చాదర్‌ఘాట్ వరకు కొనసాగింది. దారిపొడవునా ఏర్పాటు చేసిన స్వాగత వేదికలపై నుంచి పలువురు బీబీకా ఆలంకు స్వాగతం పలికి పూలు, దట్టీలు సమర్పించారు.


