మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకొని బీబీకా ఆలం ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది.
ప్రశాంతంగా బీబీకా ఆలం ఊరేగింపు
Oct 12 2016 7:06 PM | Updated on Sep 4 2018 5:24 PM
చార్మినార్: మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన అంబారీపై బీబీకా ఆలం సామూహిక ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. ఇస్లాం మతం పరిరక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన హజ్రత్ ఇమాం హుస్సేన్, హసన్‌లను స్మరిస్తూ వేలాది మంది యువకులు, చిన్నారులు విషాద గీతాలు ఆలపిస్తూ చేతులకు బ్లేడ్లను అమర్చుకొని ఎదపై బాదుకుంటూ రక్తం చిందించారు. డబీర్‌పురా బీబీకా అలావా నుంచి ప్రారంభమైన భారీ ఊరేగింపు చాదర్‌ఘాట్ వరకు కొనసాగింది. దారిపొడవునా ఏర్పాటు చేసిన స్వాగత వేదికలపై నుంచి పలువురు బీబీకా ఆలంకు స్వాగతం పలికి పూలు, దట్టీలు సమర్పించారు.
Advertisement
Advertisement