breaking news
Bhudan land
-
ఖమ్మం భూదాన్ బాధితులకు గుడ్‌న్యూస్
సాక్షి, ఖమ్మం: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతే కాకుండా సొంత ఊరిలో స్థలాలు ఉన్న 101 మందికి ఇళ్లను మంజూరు చేసింది. నేడు ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా పట్టాలు పంపిణీ జరగనుంది.ఖమ్మం నగర సమీపంలోని వెలుగుమట్ల రెవెన్యూ పరిధి వినోబాభావే నగర్‌లోని భూదాన్ భూమిలో మొత్తం 742 కుటుంబాలకు చెందిన ఇళ్లను ఫిబ్రవరి 24న అధికారులు జేసీబీలతో నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా భూదాన్ భూమిని ఆక్రమించారని వాటిని తొలగించినట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించారు. దీంతో ఇళ్లు కోల్పోయిన 134కు పైగా కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ క్రమంలో బాధితులకు న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.అనంతరం, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. కూల్చిన చోటే బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. భూదాన్ భూముల్లో తొమ్మిది ఎకరాలు కేటాయింపు చేసింది. 311 మంది అర్హులకు 75 గజాల చొప్పున స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కట్టించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు కలెక్టరేట్లో టోకెన్లను అధికారులు పంపిణీ చేశారు. ఈ మేరకు నేడు ఖమ్మం కలెక్టరేట్లో పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
భూదాన్ భూములపై నెలరోజుల్లో నివేదిక
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూములను తనిఖీ చేసి నెలరోజుల్లో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఎస్కే సిన్హా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రభుత్వ భూముల పరిరక్షణ, భూ కేటాయింపు, భూదాన్, యూఎల్సీపై రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూదాన్ యజ్ఞబోర్డుకు సంబంధించి 21,939 ఎకరాలు ఉందని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఇందులో 13,916 ఎకరాలు ఫిట్‌గా ఉందని, ఇందులోనుంచి 13,510 ఎకరాలు అసైన్డ్ చేయగా, 8023 ఎకరాలు నిరుపయోగంగా ఉందన్నారు. ఈ భూములు ఎవరి పరిధిలో ఉన్నాయి, ఎంత మొత్తం కేటాయించారు.. ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ మండలాల వారీగా రిపోర్టు తయారు చేసి నెల రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో 44వేల ఎకరాల భూమిని వివిధ సంస్థలకు కేటాయించడం జరిగిందని, ఇందులో 10,852 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. ప్రభుత్వ భూములు కేటాయించిన ఏపీఐఐసీ, హెచ్ఎండీఏ, దిల్, రాజీవ్ స్వగృహ, హౌజింగ్ తదితర సంస్థలతో ప్రత్యేక సమావేశం నిర్విృస్తామన్నారు. నిరుపయోగంగా ఉన్న భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. విలువైన భూములకు ప్రహరీలు జిల్లాలో విలువైన ప్రభుత్వ భూ ములున్నాయని సీసీఎల్ఏ ఎస్కే సిన్హా పేర్కొన్నారు. సుమారు రూ. 4867 కోట్ల విలువైన 853 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షిం చేందుకుగాను ప్రహరీలు, కంచెలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకవసరమైన నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభు త్వ భూముల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకుగాను ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. లీగల్ సెల్ ఏర్పాటు చేయండి : కలెక్టర్ జిల్లాలోని భూములకు సంబంధించి పెద్ద సంఖ్యలో కేసులున్నాయని కలెక్టర్ ఎన్.శ్రీధర్ సీసీఎల్ఏకు వివరించారు. వీటిని పరిష్కరించేందుకు వీలుగా ప్రత్యేక లీగల్‌సెల్ ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా ప్రత్యేకంగా ప్రభుత్వ న్యాయవాదిని ఏర్పాటు చేస్తే సమస్యలు త్వరితంగా పరిష్కారమ వుతాయన్నారు.ఈ సమావేశంలో జేసీలు చంపాలాల్, ఎం వీరెడ్డి, సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


