breaking news
Bhakthi TV
-
వెలుగు వైపు యువత
‘దీపం అంటే ప్రమిద మాత్రమే కాదు మన మనసులను మేల్కొలిపే సాంస్కృతిక వెలుగు’ అంటారు రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రచనా చౌదరి. నవంబర్ 1నుంచి 13 వరకు కోటి దీ పోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో కన్నుల పండువగా జరగనుంది. ఈ సందర్భంగా ఉత్తర–దక్షిణ భారత దేశాల కళాసంస్కృతిని ఒకే వేదికమీదకు తీసుకురావడానికి చేస్తున్న కృషి, ఆధ్యాత్మిక సేవ, కోటి దీ పోత్సవ కార్యక్రమం తమలో తీసుకువచ్చిన మార్పుల గురించి రచనా చౌదరి ప్రత్యేకంగా ‘సాక్షి’తో ముచ్చటించారు.‘‘దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహమ్, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే...చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే దీపం వల్ల అన్నిపనులు సాధ్యమవుతాయి అన్నది నిజం. ప్రతిరోజూ దీపం వెలిగించడం నా దినచర్యలో భాగం. ఈ దీపం వెనక మా అమ్మ రమాదేవి, నాన్న నరేంద్ర చౌదరిల కృషి ఎంత ఉందో చూస్తూ పెరిగాను. కోటి దీ పాలు ప్రసరించే శక్తి ఎంత దూరం వెళుతుందో ప్రతియేటా చూడటమే కాదు, ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి నా వంతు సహకారాన్ని అందిస్తుంటాను.’ మంచి మార్పులుఅమ్మానాన్న మొదట లక్ష దీ పోత్సవం అనే ఆలోచన చేసే సమయానికి నేను టీనేజ్‌లో ఉన్నాను. శృంగేరీ పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ స్వామివారి చేతుల మీదుగా 2012లో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అప్పుడు అమెరికాలో బోర్డింగ్ స్కూల్ లో చదువుకుంటున్నాను. ప్రతియేటా కోటి దీ పోత్సవానికి మాత్రం తప్పనిసరిగా వచ్చి వెళ్లేదాన్ని. ఆధ్యాత్మిక విషయాల్లో పెద్దలను, గురువులను అనుసరించడం ద్వారానే ఎన్నో విషయాలను తెలుసుకోగలం. ప్రతి యేటా దీక్షగా చేసే ఈ కార్యక్రమం నాలో చాలా మార్పులు తీసుకువచ్చింది. స్టేడియం అలంకరణ, అతిథులను ఆహ్వానించడం, ఏర్పాట్లు చూడటం,.. ఇదంతా అమ్మ చేసే పనులను గమనిస్తూ, తెలుసుకోగలిగాను. దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కోటి దీ పోత్సవంలో చురుకుగా పాల్గొంటున్నాను. ప్రఖ్యాతి గాంచిన శృంగేరి, కంచిపీఠం, మైసూరు దత్త పీఠం.. వంటి పీఠాధిపతులు కోటి దీ పోత్సవ కార్యక్రమానికి హాజరయేవిధంగా సమన్వయం చేస్తున్నాను. దీపం ద్వారా సమాజంలో ఎంతో మార్పు తీసుకురావచ్చు అని బోధపడింది. ఈ మహా కార్యక్రమంలో ధనిక, పేద అనే తేడా ఉండదు. కళాకారులకు వేదికైన ఈ కార్యక్రమాన్ని ఏదో గొప్ప శక్తి అదృశ్యంగా ఉండి నడిపిస్తోందని నా భావన. ఈ కార్యక్రమానికి వచ్చినవాళ్లు ‘కిందటేడాది వచ్చాం.. మా జీవితంలో మంచి మార్పు జరిగింది’ అని చెబుతుంటారు. అదంతా దైవం ఇచ్చే ఆశీస్సులే అని చెబుతుంటాం. కార్తీకమాసంలో పదమూడు రోజులు ఎన్టీఆర్ స్టేడియంలో మొత్తం పాజిటివ్ వైబ్స్ అనంతంగా వెలువడుతున్నాయా అనిపిస్తుంటుంది.’ ఉత్తర–దక్షిణాల కలబోతఈసారి కోటిదీ పోత్సవం పాన్ ఇండియా అయ్యిందని చెప్పవచ్చు. దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తరాదిలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల ఉత్సవ విగ్రహాలను కోటి దీ పోత్సవ వేదికపైకి తీసుకొచ్చి తెలుగు ప్రజలకు దర్శనం కల్పించేవిధంగా కృషి చేస్తున్నాం. గత ఏడాది నుంచి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రధాన దేవతామూర్తులు తరలివస్తున్నారు. అక్కడి అర్చకులే స్వయంగా వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఇలా అన్ని దేవాలయాల నుంచి వచ్చిన ఉత్సవమూర్తులకు కోటిదీ పోత్సవంలో దర్శన భాగ్యం కల్పించడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది. చాలామంది జీవితంలో దర్శించదగిన దేవాలయాల జాబితా దగ్గర పెట్టుకుంటారు. కానీ, వెళ్లలేని కారణాలేవో ఉంటాయి. అలాంటివారు ఇక్కడకు వచ్చి, ఈ కార్యక్రమంలో ఆ దేవతామూర్తులను దర్శించుకుని, పూజలలో పాల్గొని, గుండెలనిండా ఆ దివ్యానుభూతులను నింపుకుని వెళుతుంటారు.’ యువతలో సేవాగుణంఇటీవలి కాలంలో యువతలో మన సంస్కృతి పట్ల ఉన్న గౌరవాన్ని, భక్తిని, ఆసక్తిని ఎక్కువగా గమనిస్తున్నాను. అయితే, చాలామంది సెలబ్రేషన్స్ వైపు ఎక్కువ మొగ్గుచూపుతుంటారు. మన దేశీయ వారసత్వం అంతర్గతంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో యువత స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తుంటారు. సంప్రదాయంగా ముస్తాబై, వచ్చి, ఈ కార్యక్రమంలో ఫొటోలు దిగుతుంటారు. దీ పాలు వెలిగించి, ఫొటోలు తీసుకొని, సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతుంటారు. పూజ ఒక్కటే కాదు ఈ దేశ ఆధ్యాత్మిక శక్తి సందేశం వారి మెదళ్లకు చేరుతుంది. అందుకే, యువత చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. మా అందరికీ దీపోత్సవం కార్యక్రమంలో ప్రతిరోజూ ఒక మారథాన్‌లా ఉంటుంది. పూర్తయ్యాక ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఒక తరం మరో తరాన్ని అనుసరిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మా జనరేషన్ కూడా అనుసరిస్తుంది. మంచి ఎక్కడ ఉన్నా దానిని ఫాలో అవడం సహజమే. తెలంగాణలోని పల్లె ప్రాంతాలే కాదు ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతుంటారు. దాదాపుగా తొంభైశాతం మంది తమ వంతు దీపం వెలిగించి హడావుడిగా వెళ్లి పోవాలని కాకుండా మహా నీరాజనం అయ్యేవరకు ఉండి, భక్తితో కళ్లకద్దుకుని వెళుతుంటారు. వయసు పైబడినవారు తమ కుటుంబసభ్యులతో వచ్చి, కార్యక్రమంలో పాల్గొని సంతృప్తితో వెళుతుంటారు. ఈ సమయంలో యువత పెద్దవారికి ఇచ్చే చేయూత గమనించినప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖరరావు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, బి.జె.పి. సీనియర్ నేత డాక్టర్ ఎ. లక్ష్మణ్ అనూహ్య సహకారం అందిస్తున్నారు.’ రక్షణ చర్యలూ ప్రధానమే!పీఠాధిపతులు, సద్గురువులు, ప్రవచనకారులు.. అందరి సమక్షంలో జరిగే ఈ దీక్షా కార్యక్రమంలో సామూహికంగా ప్రతిరోజూ దాదాపు పదిలక్షల దీ పాలు వెలిగిస్తారు. ఇరవై మంది కూర్చొని దీపం వెలిగించి, పూజ చేసుకునేలా ఒక సెట్ ఉంటుంది. ప్రతి ఒక సెట్ దగ్గర ఒక వాలంటీర్ ఉంటారు. అలా మొత్తం 2000 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్టీవీ, వనిత, భక్తి టీవీ బృందంలోని వెయ్యి మంది కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాలుపంచుకుంటారు. 40 కెమెరా సెటప్‌ను ఏర్పాటు చేస్తాం. దీ పాలతో చేసే కార్యక్రమం కాబట్టి ఎక్కడ ఏ చిన్న అవాంతరం జరిగినా వెంటనే తెలిసి పోతుంది. దీనివల్ల ఎంత చిన్న సమస్య అయినా వెంటనే క్లియర్ చేసే సదు పాయం ఉంటుంది. అందుకే ఇన్నేళ్లలో ఎలాంటి సమస్యా ఉత్పన్నం కాలేదు. అంబులెన్స్, టాయ్‌లెట్ సదు పాయాలు ఉంటాయి. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి ఏం చేయాలో ముందస్తు సమావేశాలు నిర్వహిస్తుంటాం. అందరిలోనూ ఒక దైవిక శక్తి ఉన్నదా... అన్నంతగా ఈ కార్యక్రమం పూర్తయ్యేవరకు ప్రతి ఒక్కరూ తమ ఎఫర్ట్‌ని పెడుతుంటారు. కోటి దీ పోత్సవం ఆరంభం నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం విజయవంతం కావడం కోసం మా సిబ్బంది చేసే కృషిని మాటల్లో చెప్పలేను. తమ సొంత కార్యక్రమంలా కార్యోన్ముఖులై పనిచేస్తారు. ప్రతిసారీ ఈ కార్యక్రమం దిగ్విజయం అయేలా చేయడం మాకు ఒక టాస్క్ అని చెప్పవచ్చు. భగవంతుడు ఉన్నాడు, లేడు.. అనే చర్చలు అవసరం లేదు. ఇది డబ్బుకు సంబంధించిన అంశం కానే కాదు. ధర్మానికి సంబంధించినది. ఈ కార్యక్రమం వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుంది. మన దేశం కళలకు పుట్టినిల్లు. సాహిత్య, సాంస్కృతిక వైభవాలతో విరాజిల్లే ఘనమైన చరిత్ర ఉంది. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా అక్కడి కళాకారుల సాంస్కృతిక కళారూ పాలు కనిపిస్తాయి. వాటిని ఈ వేదిక ద్వారా పరిచయం చేస్తున్నాం. ఆ విధంగా ఎంతోమంది కళాకారులకు గుర్తింపు, ఉ పాధి లభిస్తుంది. కోట్లాదిమందికి కోటిదీ పోత్సవ వేదికగా కాంతి సందేశాలు అందుతుంటాయి’ అని వివరించారు ఈ యువ పారిశ్రామికవేత్త.’ సేవయే ప్రధానం...ప్రతియేటా ఆగస్టు రాగానే మా ఇంట కోటి దీ పోత్సవానికి సంబంధించిన సందడి నెలకొంటుంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలు, పనుల విభజన, థీమ్.. ప్రతిది ప్లానింగ్‌తో రెడీ అవుతుంది. పూణె, తంజావూరు నుంచి వచ్చిన కళాకారులు పువ్వులతో రంగోలీలు వేస్తారు. శాండ్ ఆర్టిస్టులు రకరకాల కళారూ పాలను చిత్రిస్తారు. బొమ్మల కొలువులు పెడతాం. రకరకాల దేవతామూర్తుల విగ్రహాలు కూడా స్టేడియం అంతా అలంకరిస్తాం. ఏ దేవుడికి ఏ పూలు అర్పించాలి, వాటి మాలలు ఎలా ఉండాలో ప్రత్యేకించి తయారు చేయిస్తాం. కోయంబత్తూరు, బెంగళూరు నుంచి ప్రత్యేక అలంకరణ కళాకారులను తీసుకొచ్చి, వేదికను అలంకరిస్తాం. ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు స్టేడియంకు వెళ్లి, అక్కడ ఆ రోజుకు కావల్సిన ఏర్పాట్లు, అలంకరణ ఎలా ఉండాలో చూస్తాం. అమ్మ ఈ పనులన్నీ స్వయంగా దగ్గర ఉండి పర్యవేక్షిస్తారు. వాలెంటీర్లు వచ్చి, స్టేడియం అంతా శుభ్రం చేసి, పూజ సామాగ్రి తులసి కోటతో సహా అన్ని ఏర్పాట్లు చేసి పెడతారు. అక్కడ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చి, రెడీ అయి, మళ్లీ స్టేడియంకు వచ్చేస్తాం. ఈ పనిలో సేవయే ప్రధానం. ముందుగా అనుకున్న షెడ్యూల్ మారి పోవచ్చు. పనుల విభజనలో ఎవరు ఏ పనైనా చేయాల్సి రావచ్చు. రెండువేల మంది వాలంటీర్లు, ఛానెల్స్‌లో వర్క్ చేసేవారు వెయ్యి మంది, మేం.. అందరం కలిసి ఒకే ఇంటి కార్యక్రమంగా పని చేస్తాం.తంజావూరుగోపురం సెట్ఇప్పటికే దేశంలోని ప్రధాన పీఠాధిపతులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి.. మొదలైన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతియేటా ఒక్కో థీమ్ తీసుకుంటాం. ఈసారి కాశీ థీమ్‌తో పాటు మరిన్ని కొత్త మార్పులు ఉండబోతున్నాయి. దీంతో ప్రతియేటా వచ్చినవారు కూడా కొత్త అనుభూతి పొందుతారు. ఇప్పటికి దేశంలో ఉన్న ప్రముఖులందరూ దీ పోత్సవానికి హాజరయ్యారు. ఈ సంవత్సరం శృంగేరీ, కంచి పీఠాధిపతులు రాబోతున్నారు. నాగసాధువుల చేత శివునికి ప్రత్యేక అభిషేకాలు జరగబోతున్నాయి. కార్యక్రమానికి హాజరయ్యే భక్తులందరికీ పూజా సామాగ్రిని భక్తి టీవీయే ఉచితంగా అందజేస్తుంది. ప్రతిరోజూ కార్యక్రమం ముగిసిన వెంటనే మరుసటి రోజు చేసే కార్యక్రమాలను ఆరంభిస్తాం. ఈ సంవత్సరం తంజావూరు గోపురం నేపథ్యంలో ప్రధాన సెట్‌ను రూపొందిస్తున్నాం. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటో: అనిల్ కుమార్ మోర్ల -
ముగిసిన సీఎం జగన్ రెండు రోజుల తిరుమల పర్యటన
సాక్షి, తిరుపతి: రెండు రోజుల తిరుమల పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు మహా ద్వారం వద్ద టీటీడీ చైర్మన్, ఈఓలు స్వాగతం పలికారు. సీఎం జగన్ శ్రీవారి ధ్వజ స్తంభాన్ని నమస్కరిస్తూ ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి బియ్యంతో తులాభారం మొక్కులు సమర్పించారు. సీఎం జగన్‌కు అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్ధప్రసాదాలను అందచేశారు. శ్రీవారి దర్శనం అనంతరం సీఎం జగన్.. శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌కు సంబంధించి.. కన్నడ, హిందీ చానళ్లను ప్రారంభించారు. సీఎం జగన్ వెంట మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, నారాయణ స్వామి, అనీల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్యేలు ఉన్నారు. చదవండి: బడితోనే అమ్మఒడి బూందీ పోటును ప్రారంభించిన సీఎం జగన్ తిరుమలలో రూ.10 కోట్లతో నూతనంగా నిర్మించిన బూందీపోటు భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అటు తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నమయ్య భవన్లో రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ సమక్షంలో టీటీడీ, రైతు సాధికార సంస్థ మధ్య ఎంవోయూ కుదిరింది. అనంతరం శ్రీ పద్మావతి అతిధి గృహం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు సీఎం జగన్. చదవండి: దేవదేవుడికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ -
3 నుంచి భక్తిటీవీ కోటిదీపోత్సవం
సాక్షి, హైదరాబాద్ : ఏటా నిర్వహించే భక్తిటీవీ కోటిదీపోత్సవానికి నగరం ముస్తాబవుతోంది. ఈ నెల 3 నుంచి 18వ తేదీ వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ఈ వేడుక జరుగుతుందని నిర్వాహకులు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 5.30కు కోటి దీపోత్సవం ప్రారంభం కానుంది. ‘పూరీ శంకరాచార్య జగద్గురు నిశ్చలానంద సరస్వతి స్వామి, ఉడుపి పెజావర్ పీఠాధిపతి విశ్వేశరతీర్థ, బాబా రామ్‌దేవ్, గణపతి సచ్చిదానంద, త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్‌స్వామి, విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర’ వంటి ప్రసిద్ధ గురువులు చేతులమీదుగా పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖశర్మ, గరికిపాటి నరసింహారావు వంటి విఖ్యాత ప్రవచనకర్తలు విచ్చేయనున్నట్టు వివరించారు. భక్తులే స్వయంగా విశేష పూజలు చేసే విధంగా కార్యక్రమాలు జరగుతాయని, సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఉంటాయని పేర్కొన్నారు. కోటిదీపోత్సవం ప్రత్యేకత.. కార్తికమాసం వచ్చిందంటే కొండల మీద నుంచి దివ్వెలు దిగివస్తాయి. భక్తిటీవీ కోటిదీపోత్సవంలో దీపశిఖలు నేలపై రెపరెపలాడుతూ కోటికాంతులు పంచుతాయి. ఓంకారానికి వంతపాడే శంఖారావాలు, డమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేదపారాయణలు, జగద్గురువుల అనుగ్రహభాషణాలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళశాసనాలు దీపోత్సవ ప్రాంగణానికి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి. ప్రదోషవేళ మహాదేవునికి ప్రీతిపాత్రమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీదేవతల కల్యాణాలు, విశేష పూజల వంటివి ఎన్నో భక్తుల మనసులను భక్తిపారశ్యంలో మునకలు వేయిస్తాయి. భక్తిటీవీ అందిస్తున్న వార్షిక సంప్రదాయం కోటిదీపోత్సవం ఈ ఏడాది హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబరు 3 నుంచి 18వ తేదీవరకు జరగనుంది. శుభారంభం.. లక్షదీపోత్సవం 2012లో లక్ష దీపాల అంకురార్పణతో ఈ మహాదీపయజ్ఞం ప్రారంభమైంది. 2013 నుంచి ఆధ్యాత్మిక జగత్తులో మహోద్యమంగా కొనసాగుతోంది. భక్తిటీవీ అధినేత నరేంద్ర చౌదరి సంకల్పంతో ఏడు సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా ఈ సంప్రదాయం కార్తికంలో అందరినీ పలకరిస్తూనే ఉంది. ఆశేష భక్తజనుల మనసుల్లో చెరగని ముద్రవేసిన భక్తిటీవీ కోటిదీపోత్సవం.. ఎనిమిదోసారి అంగరంగవైభవంగా జరగనుంది. భువిపై కైలాసం బొందితో కైలాసాన్ని చూడకపోవచ్చుకానీ.. కోటిదీపోత్సవ వేదికను చూస్తే ఆ లోటు తీరుతుంది. ఈ వేడుకకు విచ్చేసే ప్రతీఒక్కరినీ కళ్లార్పకుండా చేసేది ప్రధాన వేదిక. ఎత్తైన హిమగిరులు.. జలపాతాలు.. యోగముద్రలో సదాశివుడు.. శిఖరాలపై మహాదేవుని విభిన్నమూర్తులు.. శివలింగాలు వెరసి... అది కైలాస ప్రతిరూపం కాదు.. కైలాసమే అనిపించకమానదు. అటువంటి మహావేదిక 2019 కోటిదీపోత్సవ వేడుక కోసం సిద్ధమవుతోంది. శంఖారావం మొదలు కార్యక్రమం సమాప్తమయ్యేంతవరకు మహాకైలాస వేదికే కోటిదీపోత్సవ రంగస్థలి. ఈ వేదికపైనే వేదమంత్రఘోష ప్రతిధ్వనిస్తుంది. ఈ వేదికపైనే నియమ నిష్ఠాగరిష్ఠులైన జగద్గురువులు వేంచేస్తారు. ఈ వేదికపైనే సకలదేవతలూ కల్యాణోత్సవాలను జరిపించుకుంటారు. ఈ వేదికపైనే కోటిదీపాల యజ్ఞానికి నాందిగా తొలి దీపం వెలుగుతుంది. ఈ వేదికపైనే దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరిస్తారు. కోటిదీపోత్సవ వేదిక అంటే అది కళ్లముందు కనిపించే కైలాసం. మహాదేవుని సమక్షంలో కోటిదీపోత్సవం జరిగే దివ్యస్థలం. జగద్గురువుల అనుగ్రహభాషణం కోటిదీపోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ జగద్గురువులు, పీఠాధిపతులు తరలివస్తారు. ఆశీర్వచనపూర్వకంగా అనుగ్రహభాషణం చేస్తారు. ఇటువంటి అద్భుత పర్వానికి ఈ ఏడాది సైతం ప్రసిద్ధ పీఠాధిపతులు, జగద్గురువులు తరలివస్తున్నారు. వారి చేతులమీదుగానే తొలి దీపారాధన జరగుతుంది. పూరీ శంకరాచార్య జగద్గురు శ్రీనిశ్చలానందసరస్వతి, ఉడుపి పెజావర్ పీఠాధిపతి శ్రీవిశ్వేశ తీర్థస్వామీజీ , బాబా రామ్‌దేవ్, శ్రీగణపతి సచ్చిదానందస్వామీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీరవిశంకర్ గురూజీ వంటి ప్రసిద్ధ గురువులతో పాటు.. చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖశర్మ, గరికిపాటి నరసింహారావు వంటి ప్రసిద్ధ ప్రవచనకర్తలు విచ్చేయనున్నారు. గురు సమక్షంలో జరిగే దీపారాధన మరింత పుణ్యప్రదమని కార్తిక పురాణ వచనం. అందుకే నియమనిష్ఠాగరిష్టులైన కాషాయాంబరధారుల సమక్షంలో జరిగే ఈ వేడుకలో పాల్గొనడం కోటి జన్మల పుణ్యఫలం. సమాజంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారు, లబ్దప్రతిష్టులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రమంత్రులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు సైతం ఈ వేడుకలో ఆనందంగా పాల్గొంటారు. జన్మజన్మల పుణ్యఫలం కోటిదీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు... పాల్గొనే ప్రతీ భక్తుడికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు పదిలపర్చుకునే మహాపర్వం. కూర్చున్నచోటు నుంచే మహాదేవునికి జరిగే సహస్రకలశాభిషేకాన్ని వీక్షించవచ్చు. శివలింగానికి స్వయంగా బిల్వార్చనలు చేయవచ్చు. భస్మంతో అభిషేకించవచ్చు. రుద్రాక్షలతో పూజించవచ్చు. పసుపుకొమ్ములతో అమ్మవారిని ఆరాధించవచ్చు. సౌభాగ్యం కోసం అమ్మవార్లకు కోటి కుంకుమార్చన చేయవచ్చు. గ్రహదోషాలు తొలగేందుకు రాహుకేతు పూజలు చేయవచ్చు. శ్రీవేంకటేశ్వరునికి ముడుపులు కట్టవచ్చు. ఐశ్వర్యాలు అనుగ్రహించమని దుర్గమ్మకు గాజులు అలంకరించవచ్చు. ఇలా ఒకటేమిటి ఇలాంటి ఎన్నో పూజలు ఈ ఏడాది కోటిదీపోత్సవ ప్రత్యేకం. పరిణయం.. బ్రహ్మోత్సవం దేవతల కల్యాణాన్ని చేయించినా.. వీక్షించినా మహాపుణ్యప్రదమని అంటారు. ఈ రెండు అదృష్టాలు భక్తిటీవీ కోటిదీపోత్సవంలో కలుగుతాయి. ఈ వేడుకలో పాల్గొనే భక్తులందరి చేత స్వయంగా సంకల్పం చెప్పించి.. కనులపండువగా సకల దేవతల కల్యాణోత్సవాలు చేయిస్తారు. ఈ ఏడాది తిరుమల, శ్రీశైలం, ఇంద్రకీలాద్రి, శ్రీకాళహస్తి, వేములవాడ, యాదాద్రి, కాణిపాకం, అన్నవరం, సింహాచలం, ద్వారకాతిరుమల, ఒంటిమిట్ట, మధురై తదితర క్షేత్రాల నుంచి 3 వేంచేసిన ఉత్సవమూర్తులకు కనులపండువగా కల్యాణోత్సవం జరగనుంది. కల్యాణ ప్రసాదం కూడా అందించడం కోటిదీపోత్సవ ప్రత్యేకత. కల్యాణోత్సవ మూర్తులు వివిధ వాహనాలను అధిష్టించి ప్రాంగణంలో ఊరేగుతుంటే ఆ వేడుకను వీక్షించే భక్తులు తన్మయులవుతారు. సకల దేవతలకూ ఒకే ప్రాంగణంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే చూసే భక్తులకు అంతకుమించిన మహద్భాగ్యం ఇంకేముంటుంది. అనిర్వచనీయం.. అత్యద్భుతం ఉత్సవంలో అన్నింటికీమించిన ప్రధాన ఘట్టం దీపారాధన. ప్రధాన వేదికపై పీఠాధిపతులు, అతిరథమహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే.. కైలాస ప్రాంగణమంతా కాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్ దీపాల వెలుగులతో ఉన్న ప్రాంగణం నిజమైన దీపకాంతులతో మెరిసిపోతుంది. దివిపై నుంచి చూస్తే నేలపై వజ్రాలు, పగడాలు కలగలిపి ఆరబోసినట్లుగా ఉంటుందా దృశ్యం. దీపారాధన చేసే భక్తుల్లో ఒకటే అనుభూతి. కోటి దీపోత్సవ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం తమ పూర్వజన్మ సుకృతమని. కోటిదీప కాంతుల నడుమ జరిగే లింగోద్భవం ఓ అపూర్వ ఘట్టం. సదాశివునికి అర్పించే సప్తహారతులు మరో అద్భుతం. బిల్వ, నంది, సింహ, నాగ, రుద్ర, కుంభ, నక్షత్ర హారతులు ఇచ్చే సమయంలో కైలాస ప్రాంగణంలో ఓంకారంతో మార్మోగుతుంది. ప్రాంగణంలోని భారీ శివలింగానికి నిర్వహించే మహానీరాజనం మరో ఎత్తు. ప్రమథ గణాలు తరలివచ్చి మహాదేవునికి మహానీరాజనం చేస్తున్నారా అనేంతలా ఉంటుందా అద్భుత దృశ్యం. ఇలాంటి అనేక ఘట్టాలను వీక్షించే భక్తులకు శివుడు ఎక్కడో కాదు.. ఈ కోటిదీపోత్సవ ప్రాంగణంలోనే ఉన్నాడని అనిపించక మానదు. నటరాజుకు కళాంజలి తాండవప్రియుడైన శివునికి కళానీరాజనం అర్పించే మహాద్భుత ఉత్సవమిది. అందెల రవళులు ఘల్లుఘల్లుమంటాయి. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలకే కాదు.. జానపద కళలకు సైతం కోటిదీపోత్సవం పెద్దపీట వేస్తుంది. కథకళి, ఒడిస్సీ, మణిపురి వంటి సంప్రదాయ నృత్యాలతో పాటు.. డోలుకుణిత, భాంగ్రా, కోలాటం వంటి అనేకానేక విభిన్న పదనర్తనలు కోటి దీపోత్సవ వేదికపై కదం తొక్కనున్నాయి. -
వేడుకగా కోటి దీపోత్సవం
-
కోటిదీపోత్సవం


