breaking news
Best Teachers Awards
-
ఇదేంటి గురూ..
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డు అభాసుపాలయింది. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో బోధన ప్రతిభ కంటే రాజకీయమే పాసయింది. కూటమి ప్రభుత్వం దశాబ్దాలుగా వృత్తిలో సాధించిన ప్రగతిని పక్కనపెట్టి ఇంటర్వ్యూల పేరిట కాలక్షేపం చేసి అర్హులకు అన్యాయం చేసింది. విశ్వవిద్యాలయం మొదలుకొని పాఠశాల విద్య వరకు ప్రతిస్థాయిలోను ఉత్తమ టీచర్ల ఎంపిక ప్రహసనంగా మారింది. ఎంపికలో పలువురు అనర్హుల్ని అవార్డులకు సిఫార్సు చేశారు. ఈ అవార్డుల తీరుచూసి నిజంగా అర్హులైనవారు.. తమను ఎంపిక చేయకపోవడమే మంచిదైంది అనుకునే పరిస్థితి నెలకొంది. ఈ ఎంపికల్లో తమవారా.. కాదా.. అనేది మాత్రమే కూటమి ప్రభుత్వం పరిశీలించిందన్న విమర్శలున్నాయి. ఎక్కడా ప్రతిభను పట్టించుకోలేదని, రాజకీయంగా ఏ పార్టీకి సానుభూతిపరులో చూసి మరీ పురస్కారాలు ప్రకటించారని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా వర్సిటీస్థాయిలో 32 మందికి, డిగ్రీ కళాశాల స్థాయిలో 18 మందికి, ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఆరుగురికి అవార్డులు ప్రకటిస్తూ ఉన్నతవిద్య కార్యదర్శి కోన శశిధర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ద్రావిడ విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీకి.. నిబంధనల ప్రకారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు పరిపాలన పదవుల్లో ఉన్నవారు దూరంగా ఉండాలి. అలాంటిది.. ఏకంగా ద్రావిడ విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీ ఎం.దొరస్వామికి ఉత్తమ టీచర్ అవార్డు ప్రకటించారు. వర్సిటీ స్థాయిలో దరఖాస్తులు/నామినేటెడ్ పేర్లను స్క్రీనింగ్ చేసేందుకు వీసీ చైర్మన్‌గా కమిటీ ఉంటుంది. ఇక్కడ ఆ కమిటీ చైర్మన్ అయిన ఇన్చార్జి వీసీ దొరస్వామి తనపేరే సిఫార్సు చేసుకున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ నేతృత్వంలోని రాష్ట్రస్థాయి కమిటీ సైతం ఆయన్ని ఎంపిక చేసేసింది. అసలు ఆయన నాన్ టీచింగ్ విభాగానికి చెందిన ఉద్యోగి. లైబ్రరీ శాఖకు చెందిన వ్యక్తి. ఈ వర్సిటీలో ఆయన బోధించడానికి అస్సలు లైబ్రరీసైన్స్ కోర్సులే లేవు. అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన ఆయన బోధనాపటిమను గుర్తించారో తెలియదు. వర్సిటీలో 2010లో తాత్కాలిక ప్రాతిపదికన డిప్యూటీ లైబ్రేరియన్‌గా అడుగుపెట్టిన ఆయన ఎక్కడిక్కడ నిబంధనలు మీరి రెగ్యులర్ అయిపోయి, నాన్‌టీచింగ్ డిప్యూటీ లైబ్రేరియన్ పోస్టు (అసోసియేట్ ప్రొఫెసర్) నుంచి ఏకంగా టీచింగ్ విభాగంలోని ప్రొఫెసర్ పోస్టులోకి వచ్చేశారని వర్సిటీవారే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగం పొందారంటూ కోర్టుల్లో కేసులున్న వ్యక్తిని అవార్డుకు ఎలా ఎంపిక చేశాంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంటర్వ్యూల పేరిట కాలక్షేపం.. ఈ అవార్డులకు ఎంపిక కోసం కూటమి ప్రభుత్వం తొలిసారిగా ఇంటర్వ్యూలు నిర్వహిచింది. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులకు నిర్వహించిన ఇంటర్వ్యూలు ఒక్కోచోట ఒక్కో విచిత్రాన్ని తలపించాయి. ఉత్తమ ఆచార్యుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ ఘనంగా ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఆ తర్వాత మీరు ఎంపికయ్యారంటూ ఆహ్వానాలు పంపింది. తీరా.. ఎంపిక జాబితా వెలువడటానికి కొద్దిగంటల ముందు ‘సారీ మీరు డ్రాప్ అవ్వండి.. మేం ఏం చేయలేం..’ అంటూ సందేశాలు పంపించి ప్రతిభ, సామర్థ్యం ఉన్న ఎందరో ఆచార్యులను అవార్డులకు దూరం చేసింది.ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు కళాశాల డైరెక్టరేట్ రెండు, మూడు నిమిషాల్లోనే ఇంటర్వ్యూలు ముగించింది. ‘కళాశాల అభివృద్ధిలో మీ పాత్ర ఏంటి? మీరు దరఖాస్తులో సమరి్పంచిన రికార్డులు మీవేనా? ఇక వెళ్లి రండి..’ ఇదీ వారికి నిర్వహించిన ఇంటర్వ్యూ. సాంకేతికవిద్యలో మరో కోణం రాష్ట్ర సాంకేతిక విద్యావిభాగంలో మరో అడుగు ముందుకేసి అవార్డులు పంచుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విభాగంలో 16 అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఒక్కో అవార్డుకు ఇద్దరు చొప్పున దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచి్చనా పెద్దగా స్పందన రాలేదు. దీంతో దరఖాస్తు గడువును పెంచి సిబ్బందికి ప్రత్యేకంగా సమాచారం అందించి అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు. దీంతో 31 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 30 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ నుంచి ప్రిన్సిపల్ కేటగిరిలో ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఎస్వీయూ రీజియన్‌లో ఒక్కరే దరఖాస్తు చేయగా ఆయన్నే ఎంపిక చేశారు. ఈ విభాగంలో 15 మందిని ఉత్తమ అధ్యాపకులుగా ప్రకటించారు. వీరిలో పలువురు విధులకు హాజరయ్యే విషయంలో సమయపాలన పాటించలేదని తేలింది. ఇటీవల ఉన్నతాధికారులు ఫేషియల్ రికగ్నేషన్ సిస్టం నుంచి వివరాలు విడుదల చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సమయానికి కాలేజీకి రానివారు ఉత్తమ అధ్యాపకులు ఎలా అవుతారని సాంకేతికవిద్యలో పనిచేసే అధ్యాపకులే విమర్శిస్తున్నారు. వీటిని పరిశీలిస్తే.. ఈ ఏడాది అవార్డుల ఎంపికను పాలకులు ఎంతగా దిగజార్చారోఅర్థమవుతోంది. -
జాతీయ ఉత్తమ టీచర్లు: ఏపీ, తెలంగాణ నుంచి నలుగురు ఎంపిక
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను కేంద్రం బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 44 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది. కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. విశాఖ లింగరాజుపాలెం హైస్కూల్ ఉపాధ్యాయుడు భూషణ్ శ్రీధర్, చిత్తూరు జిల్లా ఎం.పైపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మునిరెడ్డికి అవార్డులు లభించాయి. ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. కే. రంగయ్య, పయ్యావుల రామస్వామి బెస్ట్ టీచర్స్‌గా ఎంపికయ్యారు. చదవండి: Appsc: సబ్‌రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారి జాబితా విడుదల Muharram 2021 In AP: ఆంధ్రప్రదేశ్‌లో 20న మొహర్రం సెలవు -
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి
సాక్షి, మచిలీపట్నం: సెప్టెంబరు 5వ తేదీ గురుపూజోత్సవం సంద ర్భంగా జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 15 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అన్నారు. ప్రొఫార్మాలో వివరాలు పూర్తి చేసి సంబంధిత తనిఖీ అధికారులకు ఈ నెల 24వ తేదీలోగా అందజేయాలన్నారు. డీవైఈవో, ఎంఈవోల వరకు వచ్చిన దరఖాస్తులను ఒక్కటి మాత్రమే ఎంపిక చేసి ఈనెల 26వ తేదీలోగా నిర్ణీత ప్రొఫార్మాలో డీఈఓ కార్యాలయానికి అందజేయాలన్నారు. -
సేవలకు సత్కారం
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం విద్యా బోధనలో ఉత్తమ సేవలందిం చిన 25 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ విగంగాధర్ గౌడ్ మాట్లాడుతూ రెండేళ్లలో 574 రెసిడెన్సియల్ పాఠశాలలను ప్రారంభించామన్నారు. కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రభు త్వం పాఠశాలల్లో విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఉపాధ్యాయ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించింది. నగరంలోని న్యూ అంబేద్కర్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంలో బోధించడం వల్ల డ్రాపౌట్స్ తగ్గి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. రెండేళ్లలో 574 రెసిడెన్సియల్ పాఠశాలలను ప్రారంభించామన్నారు. విదేశాల్లో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వం రూ.20 లక్షల విద్యానిధి కింద అందజేస్తుందన్నారు. తల్లిదండ్రులే మొదటి దేవుళ్లని, ఆ తర్వాత స్థానం గురువుకు దక్కుతుందని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు అన్నారు. జిల్లా పదోతరగతి ఫలితాల్లో గతేడాది రాష్ట్రంలో నాలుగో స్థానం సాధించగా, అంతకు ముందు 6వ స్థానం వచ్చిందని తెలిపారు. ఈ సంవత్సరం మరింత కృషి చేసి జిల్లాను ప్రథమస్థానంలో నిలబెట్టడానికి ఉపాధ్యాయులు, ప్రధా నోపాధ్యాయులు పాటుపడాలన్నారు. జాతీయస్థాయిలో బోర్గాం పాఠశాలను తీర్చిదిద్ది అవార్డు అందుకుంటున్న హెచ్ఎం రామారావును మిగతా ప్రధానోపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పింస్తోందన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నభోజనం, దుస్తులు, పుస్తకాలు విద్యార్థులకు సమకూరుస్తున్నామని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు బోధన అందించాలని పేర్కొన్నారు. తల్లిదండ్రుల కోరికలకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మెరుగైన ఫలితాలకు ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నామన్నారు. మరోవైపు మాతృభాషను మరువకుండా విద్యార్థులకు తర్ఫీదునివ్వాలని సూచించారు. చదువుతోపాటు విద్యార్థులకు మంచి అలవాట్లు, క్రమశిక్షణ కూడా నేర్పాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి విద్యార్థి కనీససం ఆరు మొక్కలు నాటేలా చూడాలని, హరిత పాఠశాలలుగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గురువులంటే ఎంతో గౌరవమని, వారు ఎక్కడ కన్పించినా పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకుంటానని నగర మేయర్ ఆకుల సుజాత అన్నారు. కార్యక్రమంలో డీఈఓ నాంపల్లి రాజేష్, డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, బీసీడీఓ శకుంతల, డీసీఈబీ కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇల్తెపు శంకర్, మోహన్‌రెడ్డి, రాజ్‌గంగారెడ్డి, సత్యానంద్, ఓ రమేష్, బీసీటీయూ వినోద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
గురువులే మార్గదర్శకులు
ఖమ్మంసహకారనగర్: ఈ సమాజంలో గురువులే మార్గదర్శకులని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. ఉపాధ్యాయులు వృత్తికే వన్నె తీసుకొస్తారని, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారని తెలిపారు. బుధవారం ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె జ్యోతి ప్రజ్వలన చేశారు. డీఈఓ పి.మదన్మోహన్ అధ్యక్షతన మిగతా జిల్లా వ్యాప్తంగా 29మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు ఉపాధ్యాయులే కీలకపాత్ర పోషించాలన్నారు. జిల్లాలో గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. నూటికినూరు శాతం ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయుల బోధన విధానం ఉండాలన్నారు. మరింత నాణ్యమైన, మెరుగైన విద్యను అందించడమే లక్ష్యమన్నారు. పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని, అందుకనుగుణంగా విద్యాశాఖ, ఉపాధ్యాయులు శ్రద్ధ పెంచాలన్నారు. అప్పుడే ఆశించిన లక్ష్యం సాధ్యమవుతుందని తెలిపారు. ఆ దిశగా అధికార యంత్రాంగం, ఉపాధ్యాయులు ముందుకు సాగాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కమర్, డీసీఈబీ సెక్రటరీ కనపర్తి వెంకటేశ్వర్లు, 7వ డివిజన్ కార్పొరేటర్ చేతుల నాగేశ్వరరావు, ఏడీ మురళీకృష్ణ, ఖమ్మంఅర్బన్ ఎంఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ విద్యార్థులను అందించాలి
ఉపాధ్యాయులకు హోంమంత్రి చినరాజప్ప పిలుపు 104 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం బాలాజీచెరువు (కాకినాడ): సామాజిక స్పృహ కలిగిన, ఉత్తమ విలువల గల విద్యార్థులను దేశానికి అందించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలోని 104 మంది ఉత్తమ ఉపాధ్యాయులను శనివారం జేఎన్టీయూకేలో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో బోధనలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టి డిజిటల్ తరగతిగదులలో ఈ లెర్నింగ్ వసతుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ దేశం, సమాజం గురించి ఆలోచించే పౌరులను విద్యావ్యవస్థ అందించాలని కోరారు. ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమ్మణ్యం మాట్లాడుతూ గురువులు కనిపించే దైవంతో సమానమన్నారు. పదవ తరగతి ఫలితాల్లో జిల్లా ముందు స్థానంలో నిలుస్తుందని కలెక్టర్ సీహెచ్ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో ఏ విద్యార్థీ వంద మీటర్లు దాటి నడిచివెళ్లకుండా సుమారు నాలుగు వేల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం హోంమంత్రి చినరాజప్ప జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, డీఈఓ ఆర్. నరసింహరావు, డీవైఈఓలు ఆర్.గంగాభవాని, అబ్రçహాం, డి. వాడపల్లి, జేసీ–2 రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచాలి
కొద్ది మంది టీచర్లతోనే విద్యాశాఖకు చెడ్డ పేరు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జ్యోతిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు విద్యారణ్యపురి : ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పెంచాలని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో జ్యోతిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో డిప్యూటీ సీఎం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులపై ఇప్పటికే చాలా అపవాదులున్నాయని.. వాటిని తొలగించేందుకు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలన్నారు. కొద్ది మంది ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే మొత్తం విద్యాశాఖకే చెడ్డపేరు వస్తుందన్నారు. ఇటీవల ప్రథమ్ ఎన్ జీఓ సంస్థ ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు, హాజరు శాతం, తల్లిదండ్రులు ఎందుకు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారనే అంశాలపై చేసిన అధ్యయన నివేదికను తాను పరిశీలించే మాట్లాడనని.. ఇందులో ఎవరిని ఉద్దేశపూర్వకంగా నిందించలేదని ఆయన పేర్కొ న్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఉపాధ్యాయుల అంగీకారంతో ఐదు వేల పా ఠశాలల్లో ప్రస్తుత విద్యాSసంవత్సరంలో ఒకటో తరగతిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినట్లు వివరించారు ఎన్ఆర్ఐ జ్యోతిరెడ్డి జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగిన జ్యోతిరెడ్డి అందరికి ఆదర్శమన్నారు. మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ సమాజ సేవకు పాటుపడుతున్న జ్యోతిరెడ్డి సేవలు అభినందనీయమన్నారు. జ్యోతిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు జ్యోతిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విధులతో పాటు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించా లన్నారు. విద్యార్థులకు విద్యతోపాటు బతుకు పాఠం నేర్పించాలన్నారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులను శాలువా, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. సమావేశంలో విద్యావేత్త డాక్టర్ బండా ప్రకాష్, జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, పీఆర్టీయూ జిల్లా›అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి, బాధ్యులు ఉపేందర్‌రెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సదయ్య, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా జనరల్సెక్రటరీ మాల కొండారెడ్డి, జ్యోతిరెడ్డి భర్త సమ్మిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.