breaking news
is best
-
ఆటపాటలతో కూడిన విద్యతో విజ్ఞానం
శిశు సంక్షేమ శాఖ కమిషనర్ చక్రవర్తి తాళ్లరేవు : చిన్నారులకు ఆటపాటలతో కూడిన ప్రాథమిక విద్యను అందించడంవల్ల మంచి విజ్ఞానం సమకూరుతుందని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కె.చక్రవర్తి అన్నారు. గాడిమొగలో రూ.10 లక్షలతో ఆధునికీకరించిన ఆదర్శ అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్‌తో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో చక్రవర్తి మాట్లాడుతూ, గ్రామీణ చిన్నారులకు ఆదర్శ అంగన్వాడీ కేంద్రాల ద్వారా విద్యాబోధన అందించడం అభినందనీయమన్నారు. యూనిసెఫ్ ప్రతినిధి రూతూలియానో మాట్లాడుతూ, చిన్నారుల విద్యాభివృద్ధిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం మంచి పరిణామమని అన్నారు. గాడిమొగ గ్రామాన్ని దత్తత తీసుకున్న మహిళా శిశు సంజీవని మిషన్ కన్వీనర్, కలెక్టర్ సతీమణి శ్రీదేవి ఆదర్శ అంగన్వాడీ కేంద్రాల్లోని పలు విభాగాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు, ఎంపీపీ టి.అనంతలక్ష్మి, జెడ్పీటీసీ పి.రామలక్ష్మి, సర్పంచ్ కె.సూర్యాకాంతం, ఎంపీడీఓ చినబాబు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
రాజీయే సరైన మార్గం
జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ జడ్జి సతీష్‌కుమార్ కొణిజర్ల: కోర్టుల్లో కేసుల సత్వర పరిష్కారానికి ఇరు పక్షాలు రాజీ కావడమే సరైన మార్గమని జిల్లా ప్రథమశ్రేణి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఎక్సైజ్, ప్రొహిబిషన్) ఎం.సతీష్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని సాలెంబంజర పంచాయతీ లక్ష్మీపురంలో శనివారం, ఎక్సైజ్ శాఖ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రతి శనివారం లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొణిజర్ల మండలంలో సారా కేసులు అధికంగా నమోదు ఆవుతున్నాయని, నాటు సారా తయారు చేసినా, అమ్మినా చట్టప్రకారం నేరమన్నారు. బాల్యవివాహాలు జరపకుండా అడ్డుకోవాలన్నారు. గ్రామస్తులతో సారా తయారు చేయమని, అమ్మబోమని ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల ఆవరణలో జడ్జి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పి.శ్రీనివాసరావు, న్యాయవాది నరేంద్ర స్వరూప్, సర్పంచ్ పోగుల నాగమణి, ఎక్సైజ్ సీఐలు మోహన్‌బాబు, శశికుమారి, స్థానిక శిక్షణ ఎస్ఐ వి.సురేష్, ఎక్సైజ్ ఎస్ఐలు రాజిరెడ్డి, రాజా సమ్మయ్య, ఈఓపీఆర్డీ జమలారెడ్డి, ఆర్ఐ నాగరాజు , కార్యదర్శి నరసింహారావు, స్థానిక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.