breaking news
bengal Actor Vikram Chatterjee
-
‘మద్యం ఉంది.. కానీ ఆ రాత్రి తాగలేదు’
కోల్‌కతా: తన వద్ద మద్యం ఉంది వాస్తవమేనని, అయితే, కారు ప్రమాదం చోటు చేసుకున్న రాత్రి మాత్రం తాగలేదని యువ నటుడు విక్రమ్ ఛటర్జీ చెప్పాడు. రోడ్డు ప్రమాదంలో బెంగాల్ నటి, యాంకర్ మోడల్ సోనికా చౌహాన్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో యువ నటుడు విక్రమ్ ఛటర్జీ కూడా ఆమెతో పాటు ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాగి ఉండటం వల్లే కారు ప్రమాదం జరిగిందనే దిశగా పోలీసులు ఈ కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విక్రమ్‌ను గత రాత్రి దాదాపు మూడుగంటలపాటు విచారించిన పోలీసులు బుధవారం కూడా మరోసారి స్టేషన్‌కు పిలిపించారు. ఈ సందర్భంగా అతడు డ్రైవింగ్ చేసే సమయంలో తాగి లేనని చెప్పాడు. తలకు అయిన గాయానికి బ్యాండేజీ కట్టుతోనే వచ్చిన అతడు పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఏప్రిల్ 29న ఓ పబ్బుకు వెళ్లిన వారు తిరిగి వచ్చే క్రమంలో వారి కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొట్టింది. స్థానికులు ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే సోనికా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తలకు తీవ్ర గాయమైన విక్రమ్‌కు ఐసీయూలో చికిత్స అందించారు. సోనికా కుటుంబ సభ్యులతోపాటు బెంగాలీ సినీ వర్గం కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. సోనికా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు విక్రమ్‌పై కేసు నమోదు చేశారు. అయితే, తాను ఏ నేరం చేయలేదని, పోలీసులకు, కోర్టుకు సహకరిస్తానని చెప్పి ప్రస్తుతం విచారణకు హాజరవుతున్నాడు. -
నటి మృతి కేసు: లొంగిపోయిన యువ హీరో
కోల్‌కతా: రోడ్డు ప్రమాదంలో బెంగాల్ నటి, మోడల్ సోనికా చౌహాన్ మరణించిన కేసులో యువ నటుడు విక్రమ్ ఛటర్జీ కోర్టులో లొంగిపోయాడు. ఈ కేసు విచారణలో పోలీసులకు సహకరిస్తానని కోర్టుకు హామీ ఇచ్చాడు. 1000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 1న కేసు తదుపరి విచారణకు హాజరు కావాల్సిందిగా విక్రమ్‌ను ఆదేశించింది. గత శనివారం సోనికా, విక్రమ్ ఇద్దరూ కలిసి కారులో వెళుతుండగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కారులో చిక్కుకున్న వీరిద్దరినీ వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సోనికా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తలకు తీవ్ర గాయమైన విక్రమ్‌కు ఐసీయూలో చికిత్స అందించారు. సోనికా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు విక్రమ్‌పై కేసు నమోదు చేశారు. వేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపి తమ కుమార్తె మరణానికి కారణమయ్యాడని ఫిర్యాదు చేశారు. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన విక్రమ్ ఈ రోజు కోర్టు ఎదుట హాజరయ్యాడు.