breaking news
beging
-
చిన్నారుల భవిష్యత్తుకు సైబరాబాద్ పోలీసుల భరోసా
హైదరాబాద్: చిన్నారుల చిరునవ్వుల వెనుక దాగున్న విషాదాన్ని దూరం చేసి, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు ముందడుగు వేశారు. మహాత్మా గాంధీ వంటి మహనీయుల వేషధారణను భిక్షాటనకు ముసుగుగా వాడుకుంటూ, పసిపిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్న తీరుపై సైబరాబాద్ పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.ఇటీవల ఐదుగురు బాలలు సైబర్ టవర్ జంక్షన్ వద్ద ఇదే రీతిలో భిక్షాటన చేయిస్తుండగా సైబరాబాద్ పోలీసులు వారిని క్షేమంగా రక్షించారు. పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి వారిని పదే పదే భిక్షాటనకు ప్రేరేపించిన తల్లిదండ్రులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, వారిని జైలుకు పంపారు. రక్షించిన పిల్లలకు బాలల సంరక్షణ సంస్థల సహకారంతో పునరావాసం కల్పించి, వారికి కొత్త జీవితాన్ని అందించామని సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కరణం తెలిపారు.ట్రాఫిక్ సిగ్నల్స్, రద్దీగా ఉండే రోడ్డు జంక్షన్ల వద్ద చిన్నారులకు మహాత్మా గాంధీ వేషం వేసి, ఒళ్లంతా రంగులు పూసి వారిని భిక్షాటన చేయిస్తున్నా ఘటనలు పోలీసుల దృష్టికి వచ్చాయన్నారు. కేవలం డబ్బు సంపాదన కోసం కన్నవారే తమ పిల్లల హక్కులను కాలరాస్తూ, వాహనాల మధ్య వారిని ప్రమాదంలోకి నెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు.‘చిన్నారులతో భిక్షాటనకు చేయించచడం చట్టరీత్యా నేరం. అది తల్లిదండ్రులైనా, సంరక్షకులైనా సరే.. చట్టం నుండి తప్పించుకోలేరని డీసీపీ స్పష్టం చేశారు. రంగుల వల్ల కలిగే శారీరక ఇబ్బందులు, రద్దీ ప్రాంతాల్లో ఉండే ప్రాణాపాయం పిల్లల మానసిక వికాసాన్ని దెబ్బతీస్తాయని’ ఆమె పేర్కొన్నారు."పిల్లలు బడిలో ఉండాలి.. భిక్షాటనలో కాదు" అనే నినాదంతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మీ కంటపడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు గానీ లేదా చైల్డ్ లైన్ నెంబర్ 1098 కు గానీ సమాచారం అందించాలని సైబరాబాద్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
మాదిగలను మోసగించిన చంద్రబాబు
ఐక్య పోరాటానికి అందరూ సిద్ధం కావాలి నందిగామలో ఎమ్మార్పీఎస్ భిక్షాటన నందిగామ రూరల్ : ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు మాదిగలు మరో మహా ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) జాతీయ అధికార ప్రతినిధి దొండపాటి సుధాకర్ పిలుపునిచ్చారు. వర్గీకరణ కోసం ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చేస్తున్న ఆందోళనకు మద్దతుగా బుధవారం సాయంత్రం నందిగామ పట్టణంలో భిక్షాటన చేశారు. దొండపాటి మాట్లాడుతూ, మాదిగలను ఓటు బ్యాంకుగానే రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయన్నారు. ఎన్నికల సమయంలో వారిపై ప్రేమ నటిస్తూ, అధికారం దక్కించుకున్న తరువాత వారి గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేస్తే అధికారంలోకి వస్తామని, తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి పార్లమెంటుకు పంపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇందుకోసం అవసరమైతే పెద్ద మాదిగనవుతానంటూ చెప్పు కుట్టి, డప్పు కొట్టి మరీ హామీ ఇచ్చారన్నారు. ఆయన మాటలు నమ్మి మాదిగలు చంద్రబాబు పర్యటనకు రక్షణ గోడగా నిలవడమే కాకుండా ఆంధ్రలో అధికారం దక్కించుకోవడంలో కీలక భూమిక పోషించారన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని, రెండేళ్లు దాటిపోయినా, ఇప్పటివరకు వర్గీకరణ ఊసే ఎత్తకపోగా, వర్గీకరణ అవసరం లేదంటూ తన మంత్రులు, నాయకులతో ప్రకటనలు గుప్పించడం మాదిగలను దారుణంగా అవమానించడమేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మంద పిచ్చయ్య, కనకపూడి వెంకటరత్నం, బంక మహేష్, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.


