becareful
-
గమనించండి.. వర్కవుట్స్ వీరికి వర్కవుట్ కాదు!
వర్కౌట్స్ చేయడం ఎన్నో ప్రయోజనాలు అందించినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవారు వర్కవుట్స్ చేయకపోవడమే మంచిది. వారెవరో తెలుసుకుందాం. ఎముకలు, కండరాల సమస్యలు...లిగమెంట్స్ సమస్యలు, బెణుకులు, కీళ్ల గాయలు, ఎముకల పగుళ్ల వంటి సమస్యలు ఉన్నవారు వర్కౌట్ చేయడం వల్ల మరింత నష్టమవుతుంది కాబట్టి, ఈ సమస్యలున్నవారు పూర్తిగా కోలుకున్న తర్వాతే వర్కవుట్స్ చేయాలి. అదే విధంగా వళ్లునొప్పులు ఎక్కువగా ఉన్నా వర్కవుట్స్ చేయకూడదు.సర్జరీలు...కొన్నిసార్లు సర్జరీలు జరుగుతాయి. వీటి తర్వాత శరీరం కోలుకోవడానికి కొద్దిగా సమయ పడుతుంది. సర్జరీలు అయిన వెంటనే వర్కౌట్స్ చేస్తే ఇంటర్నల్ బ్లీడింగ్ కావొచ్చు. ఇతర సమస్యలు కూడా వస్తాయి. అదేవిధంగా స్త్రీలు సిజేరియన్ వంటి ఆపరేషన్ తర్వాత కోలుకునే వరకూ వాకింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలతోనే సరిపెట్టుకోవాలి. గుండె సమస్యలు...అరిథ్మియా, గుండె సమస్యలు, హై బ్లడ్ ప్రెజర్, హార్ట్ ఫెయిల్యూర్, గుండె సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా వర్కౌట్స్ చేయొద్దు. కష్టమైన వర్కౌట్స్ అసలే వద్దు. ఎక్కువ ఎఫెక్టివ్‌గా ఉండే వర్కౌట్స్ గుండెపై ప్రెజర్‌ని పెంచుతాయి. దీని వల్ల ఛాతీ నొప్పి, హార్ట్ బీట్‌లో తేడా వచ్చి ఏకంగా గుండె ఆగిపోయే ప్రమాదమే ఉంది కాబట్టి, వర్కౌట్స్ చేసే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.ఇన్ఫెక్షన్, ఫీవర్‌తో బాధపడేటప్పుడు...మీరు ఏదైనా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నప్పుడు, ముఖ్యంగా జ్వరంతో ఉన్నప్పుడు ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. అలాంటి సమయంలో వర్కౌట్స్ చేయడం వల్ల డీహైడ్రేట్ అవుతారు. హార్ట్ బీట్ పెరుగుతుంది. కండరాల బలహీనత, అలసట పెరుగుతుంది. అంతేకాకుండా గాయాలు అవుతాయి. అందుకే, జ్వరం తగ్గేవరకూ వర్కౌట్స్ జోలికి పోకపోడమే మంచిది. చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో -
బీ కేర్‌ఫుల్ 19th Dec 2019
-
బల్దియాలో వాటర్ ప్యాకెట్లతో జాగ్రత్త
-
జగిత్యాల ఆస్పత్రిలో జర భద్రం
శిథిలావస్థలో భవనం పెచ్చులూడుతున్న పైకప్పులు భయాందోళనలో రోగులు జగిత్యాల అర్బన్ : కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలోని పిల్లల వార్డులో పైకప్పు పెచ్చులూడిపడి ఇటీవల నలుగురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన గుర్తుకుతెచ్చుకుంటే జగిత్యాల ఆస్పత్రిలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పట్టణంలోని ఏరియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరింది. పెచ్చలూడుతున్న పైకప్పు, చిన్నవర్షానికి ఉరుస్తుండడంతో రోగులు భయాందోళన చెందుతున్నారు. నిత్యం వందలాది మంది ఔట్పేషెంట్లు వస్తుంటారు. అంతకుపైగానే ఇన్పేషెంట్లుగా ఉంటారు. భవనం శిథిలావస్థకు చేరడంతో పలు వార్డుల్లో చిన్నపాటి వర్షానికే ఉరుస్తూ చిన్నచిన్న బిల్లలు ఊడిపడుతున్నాయి. పదిహేనేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం త్వరలోనే శిథిలావస్థకు చేరింది. బయట ఉన్న పోర్ట్పో సైతం పెచ్చులూడుతోంది. భయాందోళనలో రోగులు ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో ఆస్పత్రి భవనం ఉరుస్తోంది. దీంతో ఎప్పుడు కూలుతుందోననే భయాందోళనలో రోగులు గడుపుతున్నారు. మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆస్పత్రికి పెచ్చులూడుతున్నాయి. ఈ ఆస్పత్రి 100 పడకలది అయినప్పటికీ 150కి పైగానే ఇన్‌పేషెంట్లు ఉంటున్నారు. వారి బంధువులు 100కు పైగానే ఆస్పత్రిలో ఉంటారు. భవన నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతో త్వరగానే శిథిలావస్థకు చేరుకుంది. పట్టించుకోని ప్రజాప్రతినిధులు కరీంనగర్ తర్వాత జగిత్యాల ఆస్పత్రికే ప్రాధాన్యత ఉంది. ఇక్కడ నెలకు 100కు పైగానే డెలివరీలు అవుతుండడంతోపాటు రోగులు సైతం నిత్యం 300లకు పైగానే వస్తుంటారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆస్పత్రి అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇప్పటికైనా ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చొరవ చూపి ఆస్పత్రికి మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.