batting form
-
‘నన్ను రెచ్చగొట్టారు’.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2026 సీజన్లో దుమ్మురేపుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వైవిధ్యమైన ఆటతో శ్రేయస్ తన ముద్ర ఎప్పుడో వేశాడు. టీమిండియా తరఫున వన్డేల్లో నిలకడగా మారుపేరుగా నిలిచిన శ్రేయస్ టీ20ల్లో మాత్రం ఆ స్థాయి ఆటను ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. కానీ ఇప్పుడు ఐపీఎల్లో మాత్రం అదే టీ20ల్లో తన కెరీర్ బెస్ట్ ఫామ్ కనబరుస్తున్నాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌కు అతనొక కెప్టెన్ మాత్రమే కాదు.. బ్యాటర్‌గా, ఫినిషర్‌గానూ సత్తా చాటుతూ అన్ని పాత్రలను సమర్థంగా పోషిస్తున్నాడు. అయితే ఈ మార్పు వెనుక తనను చికాకు పెట్టేలా కొంతమంది చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ తన మైండ్‌లో ఉన్నట్లు శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. ఆ వ్యాఖ్యలతో తనను రెచ్చగొట్టారని, జనాలు అనుకుంటున్నది తప్పు అని నిరూపించాలని నిర్ణయించుకున్నట్లు అయ్యర్ తెలిపాడు. జియో హాట్‌స్టార్ నిర్వహించిన బిలీవ్ కార్యక్రమానికి హాజరైన అయ్యర్ మాట్లాడాడు. ముఖ్యంగా షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో తనకు బలహీనత ఉందన్న విమర్శలపై ఘాటుగా స్పందించాడు. ఆ కసి ఎంతలా ఉందంటే, ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్రీత్ బుమ్రా వేసిన బౌన్సర్ ను అద్భుతమైన సిక్సర్‌గా మలచి తన విమర్శకుల నోళ్లు మూయించాడు.అయ్యర్ మాట్లాడుతూ.. ‘నీ వల్ల కాదు, ఈ పరిస్థితిలో నువ్వు రాణించలేవు అని ఎవరైనా అంటే నేను అస్సలు తట్టుకోలేను. అత్యున్నత స్థాయిలో ఆడుతున్న ఒక క్రికెటర్‌గా దానిని ఏమాత్రం అంగీకరించలేను. అందుకే నన్ను విమర్శించే వారు తప్పు అని నిరూపించాలని బలంగా నిర్ణయించుకున్నా’ అని తెలిపాడు.ఇక వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పుడు కూడా తనపై వచ్చిన ప్రతికూల వ్యాఖ్యలపై కూడా అయ్యర్ స్పందించాడు. ‘గాయం తర్వాత అయ్యర్ మునుపటిలా ఆడలేడు అన్న మాటలు బాగా వినిపించాయి. అయితే గాయం తర్వాత మన ఆలోచనా విధానం ఎలా ఉంది అనేదే ముఖ్యమని, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, వేటిని విస్మరించాలి అనే విషయంలో నాకు స్పష్టత ఉంది. షార్ట్ బాల్ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రవీణ్ ఆమ్రే, అభిషేక్ నాయర్ వంటి కోచ్‌ల సలహాలు తీసుకుంటూ కఠోరంగా శ్రమించాను. గతంలో షార్ట్ బాల్ వస్తే సింగిల్ తీయడానికో లేదా డిఫెన్స్ ఆడడానికో ప్రయత్నించేవాడిని. కానీ ఇప్పుడు నా మైండ్‌సెట్ పూర్తిగా మారింది. నా జోన్లోకి షార్ట్ బాల్ వస్తే కచ్చితంగా సిక్సర్ కొట్టాలనే లక్ష్యంతో ఆడుతున్నా. దాదాపు 300లకు పైగా బంతులను ఎదుర్కొంటాను. సైడ్ ఆర్మ్ త్రోల కంటే కూడా అసలైన బౌలర్లను ఎదుర్కోవడానికే మొగ్గు చూపుతాను. బౌలర్ బంతిని వదిలే ముందే సరైన పొజిషన్లోకి రావడం (రిథమ్‌ను) నేర్చుకున్నాను. ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలలో కనిపించే ఆ రిథమ్‌ను నేను కూడా అలవర్చుకున్నాను’ అని అయ్యర్ తన నిలకడైన ఆటతీరు వెనుక ఉన్న రహస్యాలను వివరించాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026 సీజన్లో ఒక్క ఓటమి కూడా చవిచూడలేదు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గి 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే పంజాబ్ కింగ్స్ మొదట ప్లేఆఫ్ బెర్తు దక్కించుకోనుంది. ఇక అయ్యర్ ఏడు మ్యాచ్‌ల్లో 186 స్ట్రైక్‌రేట్‌తో 279 పరుగులు సాధించాడు.చదవండి: చెత్త ఆటలోనూ మిల్లర్ అరుదైన రికార్డు -
'ఆడందే ఆరెంజ్ క్యాప్ రేసులో ఉంటానా?'
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన స్ట్రైక్‌రేట్‌పై వస్తున్న విమర్శలకు క్లాసెన్ గట్టిగానే బదులిచ్చాడు. తన పని బ్యాటింగ్ చేయడం మాత్రమేనని, స్ట్రైక్‌రేట్ ఇతర విషయాలు పెద్దగా పట్టించుకోనని తెలిపాడు. అయితే స్ట్రైక్‌రేట్ విషయంలో విమర్శలు వస్తున్నప్పటికీ ఐపీఎల్ 2026 సీజన్లో ఆరు మ్యాచ్‌ల్లో 283 పరుగులు సాధించిన క్లాసెస్ ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉండడం కొసమెరుపు. ఈ నేపథ్యంలోనే సీఎస్కేతో మ్యాచ్ అనంతరం క్లాసెన్ మాట్లాడాడు. 'నా పని బ్యాటింగ్ చేయడమే. ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వ ర్తిస్తున్నా. అయితే ఈ సీజన్లో నా స్ట్రైక్‌రేట్ విషయంలో విమర్శలు వస్తున్న సంగతి నాకు తెలుసు. కానీ నా బ్యాటింగ్‌తో జట్టుకు ఎంత ఉపయోగపడుతున్నాననేదే నాకు ముఖ్యం. స్ట్రైక్‌రేట్‌పై చింత లేదు. ఎందుకంటే క్రీజులో కుదురుకుంటేనే పరుగుల వస్తాయి. అంతేకానీ కేవలం స్ట్రైక్రేట్పైనే దృష్టి సారిస్తే పరుగులు చేయడం సంగతి అటుంచితే జట్టుకు నష్టం చేకూరుతుంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడుతానే తప్ప ప్రతీసారి బ్యాట్ నుంచి మెరుపులు రావాలంటే కష్టమే. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతగా ఆడాలి. ఆ పనిని నేను సరిగ్గానే చేస్తున్నా. అయినా నేను ఆడందే ఆరెంజ్‌క్యాప్ రేసులో టాప్‌లో ఉంటానా? ఇక కేప్‌టౌన్‌లోని ఐ జిమ్‌లో కండ్లకు సంబంధించి నేను తీసుకున్న శిక్షణ ఒత్తిడిని దూరం చేసింది. కేవలం రోజు 10 నిమిషాల పాటు క్రమం తప్పకుండా శిక్షణ తీసుకోవడం చాలా ఉపయోగపడింది.' అని చెప్పుకొచ్చాడు. సీజన్లో భాగంగా ఎస్ఆర్హెచ్ మూడో విజయాన్ని నమోదు చేసకుంది. శనివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్, క్లాసెన్‌లు అర్థసెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులకు పరిమితమైంది. మూడు విజయాలతో పట్టికలో నాలుగో స్థానానికి చేరిన ఎస్ఆర్హెచ్ తన తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 21న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.చదవండి: బుడ్డోడి వికెట్‌తో మిస్టరీ స్పిన్నర్ అరుదైన రికార్డు! -
ఓర్వలేనితనం అంటే ఇదే..
టీమిండియా స్టార్ క్రికెటర్.. కింగ్ కోహ్లి ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మూడు వారాల వ్యవధిలో మూడు వన్డే సెంచరీలు బాది వింటేజ్ కోహ్లిని తలపిస్తున్నాడు. క్రీజులోకి వస్తే పాతుకుపోవడం లక్ష్యంగా పెట్టుకున్న అతను సెంచరీ సాధించేవరకు ఔట్ అవ్వడానికి ఇష్టపడడం లేదు. అసలు ఏడాది కింద కోహ్లి ఆటతీరు ఎలా ఉండేదో అందరికి తెలిసిందే. 71వ సెంచరీ(మూడు ఫార్మాట్లు కలిపి) అందుకోవడం కోసం దాదాపు వెయ్యి రోజులకు పైగా నిరీక్షించిన కోహ్లి ఎట్టకేలకు ఆసియాకప్‌లో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ ద్వారా 71వ సెంచరీ అందుకున్నాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా కోహ్లి పరుగుల ప్రవాహం ఎక్కడా ఆగడం లేదు. టి20 ప్రపంచకప్‌లో టీమిండియా తరపున టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లి.. ఆ మెగాటోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికి కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలోనూ అదరగొట్టిన కోహ్లి వన్డేల్లో ఒక సెంచరీ బాదాడు. ఆ తర్వాత లంకతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లోనూ కోహ్లి అదే దూకుడు చూపించాడు. మూడు వన్డేలాడిన కోహ్లి రెండు సెంచరీలతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అంతేగాక తన సెంచరీల సంఖ్యను వన్డేల్లో 46కు.. ఓవరాల్‌గా 74కు పెంచుకున్నాడు. ఇక బుధవారం కివీస్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో కోహ్లి అదే జోరును చూపిస్తూ మరిన్ని సెంచరీలు చేస్తాడేమో వేచి చూడాలి. అయితే కోహ్లి ఫామ్‌ను తట్టుకోలేని ఒక పాక్ జర్నలిస్టు తన అక్కసు వెళ్లగక్కాడు. ''ఒత్తిడి తక్కువగా ఉన్న సమయంలోనే కోహ్లి సెంచరీలు సాధిస్తాడు. ప్రెషర్ ఉన్న సమయంలో కోహ్లి బ్యాట్ నుంచి పరుగులు రావు.. ఇదేమంత గొప్ప విషయం కాదు.. ఎలాంటి ఒత్తిడి లేని సమయంలో గొప్పగా బ్యాటింగ్ చేయడం ఏ బ్యాటర్‌కైనా సాధ్యమే. ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న టెస్టు సిరీస్‌కు కోహ్లిని సిద్దం చేయాలి. బలమైన జట్టుపై ఎలా బ్యాటింగ్ చేస్తాడనేది ఆసక్తికరంగా ఉంటుంది.'' అంటూ తన అక్కసు చూపించాడు. అయితే సదరు పాక్ జర్నలిస్టుపై టీమిండియా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సొంతదేశ అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెట్ షోయబ్ మక్సూద్ తనదైన శైలిలో పాక్ జర్నలిస్ట్‌కు కౌంటర్ ఇచ్చాడు. ''ఒత్తిడి లేనప్పుడు మాత్రమే కోహ్లి బెస్ట్ అంటున్నావా.. అతని ఆటేంటో ప్రపంచానికి మొత్తం తెలుసు.. కాస్త ఎదుగు భయ్యా'' అంటూ ట్రోల్ చేశాడు. ఇక కొంతమంది అభిమానులు.. ''ఓర్వలేనితనం అంటే ఇదే''.. అంటూ కామెంట్స్ చేశారు. Are you sure he is only best when there is no pressure grow up yar 🙏🏿🙏🏿🙏🏿two wrongs dont make one right 🙏🏿🙏🏿🙏🏿 — Sohaib Maqsood (@sohaibcricketer) January 15, 2023 చదవండి: వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లి.. టాప్-5లోకి ఎంట్రీ ఉప్పల్‌లో మ్యాచ్ అంటే కోహ్లికి పూనకాలే! -
ద్రవిడ్ సర్ సలహా.. 'నా కమ్‌బ్యాక్‌కు కారణం'
Mayank Agarwal Praise Dravid For Test Comeback.. ఇటీవలే న్యూజిలాండ్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో మయాంక్ అగర్వాల్ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. ముంబై వేదికగా జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 150.. రెండో ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన మయాంక్ టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో మయాంక్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 11వ స్థానానికి చేరుకున్నాడు. చదవండి: Ashes 2021: నాలుగు రోజుల్లోనే ముగించారు.. తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయం తాను ఫామ్‌లోకి రావడం వెనుక టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇచ్చిన సలహా ఎంతో ఉపయోగపడిందని.. టెస్టుల్లో నా కమ్‌బ్యాక్‌కు కారణమయిందంటూ మయాంక్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ బెంగళూరులో తన కోచ్ ఆర్ఎక్స్ మురళీ వద్ద బ్యాటింగ్‌కు సంబంధించి మరిన్ని టెక్నిక్స్ కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. దక్షిణాఫ్రికా టూర్‌కు ఎంపికైన 18 మందిలో మయాంక్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. త్వరలోనే జట్టుతో పాటు సఫారీ పర్యటనకు వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో మయాంక్ కివీస్‌తో సిరీస్‌లో తన అనుభవాలను పంచుకున్నాడు. '' నీకు ఇప్పుడు పరుగులు చాలా అవసరం అని తెలుసు. పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న బాధ నేను అర్థం చేసుకుంటా. నీకున్న ఎమోషన్స్‌తో పాటు మానసిక శక్తిని.. ఆలోచనలను అదుపులో ఉంచుకో. ఓపికతో ఆడు.. కచ్చితంగా ఫలితం సాధిస్తావు. ఇక టెక్నిక్ విషయంలో చెప్పడానికి ఏం లేదు. గతంలో పరుగులు చేయడానికి ఏదైతే చేశావో దానికే మళ్లీ కట్టుబడి ఆడాలి.. పరుగులు వాటంతటవే వస్తాయి.'' అని ద్రవిడ్ చెప్పినట్లు మయాంక్ తెలిపాడు. చదవండి: Mayank Agarwal: ఆయన వీడియోలు చూసి నా బ్యాటింగ్ స్టైల్ మార్చుకున్నా.. -
కోహ్లీకి ఏమైంది.. గవాస్కర్ ఆందోళన!
ముంబై: భారత డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ వైఫల్యాలపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ స్టంప్ అవతల కొత్త బంతిని ఎదుర్కొనే విషయంలో విరాట్ కోహ్లీ ఇబ్బందులెదుర్కొంటున్నారని గవాస్కర్ అన్నారు. వెస్టిండీస్ జట్టు చేతిలో భారత్ ఓటమి పాలుకావడంపై గవాస్కర్ అసహనం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్ పర్యటన నుంచి కోహ్లీ వైఫల్యాల యాత్ర కొనసాగడం జట్టును వేధిస్తోంది. జట్టులో కొందరు సెంచరీలు చేస్తుంటే.. కనీసం 10, 20 పరుగులు చేయకపోవడం దారుణమని కోహ్లీపై గవాస్కర్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. విజయం కోసం భారత ఆటగాళ్లు ఏ దశలోనూ ప్రయత్నించకుండా చేతులేత్తేశారని గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


