'ఆడందే ఆరెంజ్ క్యాప్ రేసులో ఉంటానా?' | SRH Heinrich-Klaasen Strong Counter On His-IPL Strike-Rate Criticism | Sakshi
Sakshi News home page

'ఆడందే ఆరెంజ్ క్యాప్ రేసులో ఉంటానా?'

Apr 19 2026 5:35 PM | Updated on Apr 19 2026 7:01 PM

SRH Heinrich-Klaasen Strong Counter On His-IPL Strike-Rate Criticism

Photo Courtesy: IPL 2026

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ హెన్రిచ్ క్లాసెన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌న స్ట్రైక్‌రేట్‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు క్లాసెన్ గ‌ట్టిగానే బ‌దులిచ్చాడు. త‌న ప‌ని బ్యాటింగ్ చేయ‌డం మాత్ర‌మేన‌ని, స్ట్రైక్‌రేట్ ఇత‌ర విష‌యాలు పెద్ద‌గా ప‌ట్టించుకోనని తెలిపాడు. అయితే స్ట్రైక్‌రేట్ విష‌యంలో విమ‌ర్శ‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ ఐపీఎల్‌ 2026 సీజ‌న్‌లో ఆరు మ్యాచ్‌ల్లో 283 ప‌రుగులు సాధించిన క్లాసెస్ ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్ర‌స్థానంలో ఉండ‌డం కొస‌మెరుపు. 

ఈ నేప‌థ్యంలోనే సీఎస్‌కేతో మ్యాచ్ అనంత‌రం క్లాసెన్ మాట్లాడాడు. 'నా పని బ్యాటింగ్ చేయ‌డ‌మే. ఆ బాధ్య‌త‌లు స‌క్ర‌మంగా నిర్వ‌ ర్తిస్తున్నా. అయితే ఈ సీజ‌న్‌లో నా స్ట్రైక్‌రేట్ విష‌యంలో విమ‌ర్శ‌లు వ‌స్తున్న సంగ‌తి నాకు తెలుసు. కానీ నా బ్యాటింగ్‌తో జ‌ట్టుకు ఎంత ఉప‌యోగ‌పడుతున్నాన‌నేదే నాకు ముఖ్యం. స్ట్రైక్‌రేట్‌పై చింత లేదు. ఎందుకంటే క్రీజులో కుదురుకుంటేనే ప‌రుగుల వ‌స్తాయి. 

అంతేకానీ కేవ‌లం స్ట్రైక్‌రేట్‌పైనే దృష్టి సారిస్తే ప‌రుగులు చేయ‌డం సంగ‌తి అటుంచితే జ‌ట్టుకు న‌ష్టం చేకూరుతుంది. ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు ఆడుతానే త‌ప్ప ప్ర‌తీసారి బ్యాట్ నుంచి మెరుపులు రావాలంటే క‌ష్ట‌మే. జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు బాధ్య‌త‌గా ఆడాలి. ఆ ప‌నిని నేను స‌రిగ్గానే చేస్తున్నా. 

అయినా నేను ఆడందే ఆరెంజ్‌క్యాప్‌ రేసులో టాప్‌లో ఉంటానా? ఇక కేప్‌టౌన్‌లోని ఐ జిమ్‌లో కండ్ల‌కు సంబంధించి నేను తీసుకున్న శిక్ష‌ణ ఒత్తిడిని దూరం చేసింది. కేవలం రోజు 10 నిమిషాల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా శిక్ష‌ణ తీసుకోవ‌డం చాలా ఉప‌యోగ‌ప‌డింది.' అని చెప్పుకొచ్చాడు. 

సీజ‌న్‌లో భాగంగా ఎస్ఆర్‌హెచ్‌ మూడో విజయాన్ని న‌మోదు చేస‌కుంది. శనివారం సీఎస్‌కేతో జ‌రిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 10 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 194 ప‌రుగులు చేసింది. అభిషేక్‌, క్లాసెన్‌లు అర్థ‌సెంచ‌రీల‌తో రాణించారు. 

అనంత‌రం బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్‌కింగ్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 184 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. మూడు విజ‌యాల‌తో ప‌ట్టిక‌లో నాలుగో స్థానానికి చేరిన ఎస్ఆర్‌హెచ్ త‌న త‌ర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 21న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో ఆడ‌నుంది.

చదవండి: బుడ్డోడి వికెట్‌తో మిస్ట‌రీ స్పిన్న‌ర్‌ అరుదైన రికార్డు!

Advertisement
 
Advertisement
Advertisement