breaking news
Bangladesh Government
-
IPL 2026: బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన ప్రకటన
బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఫ్రాంఛైజీ క్రికెట్లో మేటి లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రసారాలను తమ దేశంలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు.. "భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రహమాన్ (Mustafizur Rahman)ను తమ జట్టు నుంచి విడుదల చేసింది.బాధ, వేదనకు గురిచేసిందిమార్చి 26, 2026 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి అతడిని తొలగించింది. జాతీయ భద్రతకు సంబంధించి ఎలాంటి ముప్పు పొంచి ఉందని భావించి ఇలాంటి నిర్ణయం తీసుకుందో తెలియదు. అయితే, ఈ నిర్ణయం బంగ్లాదేశ్ ప్రజలను బాధ, వేదనకు గురిచేసింది.ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ (IPL) ప్రసారాలను దేశంలో నిలిపివేయాలని బ్రాడ్కాస్టర్లకు విజ్ఞప్తులు వచ్చాయి. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అధికారుల అనుమతితో ఈ ప్రకటన విడుదల చేస్తున్నాం’’ అని బంగ్లాదేశ్ పేర్కొంది.కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీల మీద హత్యాకాండ నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించాలనే డిమాండ్లు రాగా.. బీసీసీఐ అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది.కుదరని చెప్పిన బీసీసీఐఅంతేకాదు.. టీమిండియాతో సెప్టెంబరులో ఆడాల్సిన టీ20, వన్డేల గురించి బంగ్లా బోర్డు షెడ్యూల్ విడుదల చేయగా.. బీసీసీఐ మాత్రం దీనిని ధ్రువీకరించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడబోడమని బంగ్లా బోర్డు ప్రకటించింది.తమ మ్యాచ్‌ల వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి లేఖ రాసింది. అయితే, ఇప్పటికే టోర్నీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తికావడం.. బంగ్లాదేశ్‌తో ఆడే ప్రత్యర్థులు తమ టికెట్లు బుక్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ వేదికలను తరలించడం సాధ్యం కాదని బీసీసీఐ పేర్కొంది. ఐసీసీ సైతం బీసీసీఐ వాదనవైపే మొగ్గుచూపే అవకాశం ఉంది. చదవండి: T20 WC 2026: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐసీసీ?! -
దాడి వెనుక ఐఎస్ఐ కుట్ర
బంగ్లా సర్కారు ప్రకటన - వారంతా దేశీయ ఉగ్రవాదులే - ఉన్నత చదువులు చదివినవారే ఢాకా : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విదేశీయులను బందీలుగా చేసుకొని దారుణంగా హతమార్చింది తమ దేశ ఉగ్రవాదులేనని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టంచేసింది. దీనివెనుక పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కుట్ర ఉందని తేల్చి చెప్పింది. 20 మందిని పొట్టనపెట్టుకున్న ఈ మారణకాండలో ఐసిస్, అల్కాయిదాల ప్రమేయం లేదని తెలిపింది. ‘ఆ ఉగ్రవాదులంతా బంగ్లా వారే. దేశీయ జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) లాంటి ఉగ్రసంస్థల వారు. వారంతా ఇక్కడే పుట్టి పెరిగారు. వారి గురించి మాకు తెలుసు. వారి పూర్వీకులు కూడా మాకు తెలుసు’ అని హోంమంత్రి అసదుజ్జమన్ ఖాన్ చెప్పారు. అయితే ఈ దాడి ఘటనకు తమదే బాధ్యత అని ఐసిస్ ప్రకటించింది. దాడిలో పాల్గొన్న వారంతా పెద్ద కత్తిలాంటి ఆయుధంతో బందీలను చంపారని, దీన్నిబట్టి చూస్తే స్థానిక నిషేధిత ఉగ్రసంస్థ జేఎంబీకి చెందిన వారిగా స్పష్టమవుతోందని ప్రధాని రాజకీయ సలహాదారు హుసేన్ తౌఫిక్ ఇమామ్ చెప్పారు. జేఎంబీకి ఐఎస్ఐతో ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలుసని, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఇలా కుట్రపన్నారన్నారు. ఈ ఉగ్రవాదులు సంపన్న కుటుంబాలకు చెందిన ఉన్నత విద్య అభ్యసించిన వారేనని, మదర్సాల్లో చదువుకోలేదని పోలీసులు చెప్పారు. దాడిలో ఆర్మీ కమాండోలు చంపిన ఆరుగురి ఉగ్రవాదుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. వారిని ఆకాశ్, బికాస్, డాన్ బంధోన్, రిపోన్గా గుర్తించారు. ప్రాణాలతో పట్టుబడిన ఏకైక ఉగ్రవాదిని ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నారు. ఈ దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భారత్‌కు చెందిన తారుషి జైన్‌తోపాటు మరో ఇద్దరు (బంగ్లా జాతీయులు) అమెరికా వర్సీటీల విద్యార్థులు. తారుషి మృతదేహాన్ని సోమవారం భారత్‌కు తీసుకువస్తామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. ఉగ్రవాదుల్లో రాజకీయ నేత కొడుకు? దాడిలో పాలుపంచుకున్న ఏడుగురు ఉగ్రవాదుల్లో బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ నాయకుడి కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఢాకా శాఖకు చెందిన ఎస్ఎం ఇంతియాజ్ ఖాన్ బాబుల్ కొడుకు రోహన్ ఇబ్నే ఇంతియాజ్ రెస్టారెంట్ దాడిలో పాల్గొన్నట్లు ఆ పార్టీ మరో నేత గుర్తించారని ‘బీడీ న్యూస్’ పేర్కొంది. రోహన్ కుటుంబ సభ్యులతో కలసి ఉన్న ఫొటోను అతడి మాజీ క్లాస్మేట్స్ ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. తన కొడుకు కనిపించడంలేదని బాబుల్ గత జనవరి 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు.


