breaking news
aswin kumar
-
మహావతార్ నరసింహ సీక్వెల్ టైటిల్ ఫిక్స్
దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్: నరసింహ’. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ప్రముఖ నిర్మాణసంస్థ హోంబలే ఫిల్మ్స్ (hombale films) నిర్మించిన ఈ చిత్రం ఏకంగా రూ. 300 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. యానిమేషన్లో ఈ చిత్రం ఒక బెంచ్ మార్క్‌ను సెట్ చేసింది.యానిమేషన్ చిత్రాల పరంగా అరుదైన రికార్డు నెలకొల్పిన ‘మహావతార్ నరసింహ’కు కొనసాగింపుగా పలు చిత్రాలు రానున్నాయి. ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రెండేళ్లకు ఒకటి చొప్పున మొత్తం ఏడు సినిమాలు వస్తాయని దర్శకుడు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో విష్ణుమూర్తి దశావతారాలకు సంబంధించిన కథ ఉంటుందన్నారు. ఈ యూనివర్స్ నుండి రెండవ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్ర టైటిల్‌ను నేడు ఆదివారం ఉదయం 11:22 గంటలకు వెల్లడిస్తారు. (మహావతార్ పరశురామ్) టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మొదటి భాగం వరాహ, నరసింహ అవతారాలను చూపించగా, తదుపరి చిత్రం పరశురాముడు లేదా విష్ణుమూర్తి అవతారం చుట్టూ తిరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఈ 3D-యానిమేటెడ్ చిత్రాల సిరీస్‌ను అశ్విన్ కుమార్ 12 సంవత్సరాల ప్రణాళికతో రూపొందించారు. ఆధునిక చిత్ర నిర్మాణ పద్ధతులతో ప్రతి అవతారానికి జీవం పోస్తూ, ఈ చిత్రాలన్నీ 2025 నుండి 2037 మధ్య విడుదల కానున్నాయి. -
చోరీ చేసి.. గొయ్యిలో దాచి
పోలీసుల సోదాల్లో రూ. 3 లక్షలు వెలికితీత దొంగ అరెస్టు, రిమాండ్‌కు తరలింపు ఆదిలాబాద్ క్రైం : చోరీ చేసిన సొమ్మును గొయ్యిలో దాచి పెట్టాడో దొంగ. ఎవరికంట పడొద్దని గొయ్యిలో దాచినప్పటికీ పోలీసులు అనుమానంతో సోదాల్లో ఇల్లును జల్లెడ పట్టారు. దీంతొ గొయ్యి జాడ వెలుగులోకి వచ్చింది. గొయ్యిలో రూ. 3 లక్షలు బయటపడ్డాయి. మంగళవారం సదరు దొంగను అరెస్టు చేసిన వివరాలు ఆదిలాబాద్ డీఎస్పీ లక్ష్మీనారాయణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈనెల 19 తేదీ రాత్రి మోచిగల్లిలోని కార్తీక ఫెస్టిసైడ్స్‌లో దొంగతనం జరిగింది. షాపులోనిపై రేకులు తొలగించి దొంగతనానికి పాల్పడి రూ. 3.86 లక్షల నగదు, నాలుగు సెల్ఫోన్లు, 5 గ్రాముల గోల్డ్‌రింగ్‌ను ఎత్తుకెళ్లారు. అయితే ఈ చోరీలో పాతనేరస్తుడైన పట్టణంలోని ఖానాపూర్ కాలనీకి చెందిన అశ్విన్‌కుమార్‌పై అనుమానాలు రావడంతో వన్‌టౌన్, సీసీఎస్ పోలీసులు నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో మంగళవారం సీఐ సత్యనారాయణ, సీసీఎస్ డీఎస్పీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో అశ్విన్‌కుమార్ ఇంట్లో సోదాలు చేశారు. ఇళ్లంతా గాలించిన పోలీసులు ఓగదిలో అనుమానం రావడంతో తవ్విచూడగా అందులో ఉన్న నగదు బయటపడింది. దీంతో అశ్విన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చోరీచేసిన సొత్తులో రూ. 73 వేలు నిందితుడు ఖర్చు చేసుకోగా, ఒక సెల్‌ఫోన్‌ను పడేశాడు. మిగతా సొమ్ము రూ. 3.13 వేల నగదు, మూడు సెల్ఫోన్లు, బంగారు ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ నర్సింహారెడ్డి, వన్‌టౌన్ సత్యనారాయణ, సీసీఎస్ ఎస్సైలు రాజు, సత్యనారాయణ, వన్‌టౌన్ ఏఎస్సై అప్పారావు, పోలీసు సిబ్బంది రాహత్, రాంరెడ్డి, సీసీఎస్ హెచ్‌సీ ఎండి సిరాజ్‌ఖాన్, రమేశ్, గంగాధర్, అబ్దుల్ జాహీర్, తదితరులు ఉన్నారు.


