Assembly Construction work
-
మళ్లీ పెరిగిన ఏపీ అసెంబ్లీ నిర్మాణ వ్యయం
సాక్షి, విజయవాడ: అసెంబ్లీ నిర్మాణ వ్యయం మళ్లీ పెరిగింది. రూ. 798 కోట్లు అసెంబ్లీ పనుల కోసం ఖర్చు చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి నిధులు కేటాయించింది. దీంతో అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. ఇప్పటికే అత్యధిక ధరకు ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే.కరకట్ట అభివృద్ధికి 443 కోట్ల నిధులను కేటాయిస్తూ.. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మట్టికట్ట ద్వారా అభివృద్ధికి 443 కోట్లు ఖర్చు చేయాలని, కృష్ణా రైట్ బ్యాక్‌ని ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉండవల్లి ల్యాండ్ పూలింగ్ గ్రామం సదుపాయాలకు 580 కోట్లు కేటాయించింది. అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, సీవరేజ్, విద్యుత్ , ఎస్టీపీ కోసం ఖర్చుచేయాలని నిర్ణయించింది.అమరావతి సచివాలయానికి భారీగా నిధులు ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 2540 కోట్లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హంగులు, అద్దాల కోసం భారీగా ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అద్దాలు, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కనోపి స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, పీవీ ప్యానల్స్ కోసం భారీగా ఖర్చు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ టవర్, టవర్ 1,2,3,4 లలో హంగుల కోసం నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించింది. క్వాంటమ్ టవర్స్ కోసం 1208 కోట్లు ఖర్చు చేయాలని పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
సచివాలయం నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాల నిర్మాణంపై అధ్యయనం కోసం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నేృత్వత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ కమిటీలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ మంత్రివర్గ ఉపసంఘానికి సహాయ, సహకారాలు అందించనున్నారు. సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత, సచివాలయంలోని ప్రభుత్వ శాఖల కార్యాలయాల తరలింపు, కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాల నిర్మాణం, ఈ భవనాలకు సంబంధించిన డిజైన్ల ఖరారు తదితర అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత, కొత్త భవనాల నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని కోరింది. శంకుస్థాపనలకు ఏర్పాట్లు... కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల శంకుస్థాపన కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. సచివాలయంలోని డీ–బ్లాక్ భవనం వెనుక భాగంలోని పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్లో కొత్త సచివాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా ఎర్రమంజిల్ ప్యాలెస్, ఆర్ అండ్ బీ కార్యాలయ భవన సముదాయం మధ్యలోని ఖాళీ స్థలంలో కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లలో భాగంగా ఈ రెండు చోట్లా శిలాఫలకాలను సిద్ధం చేస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం సచివాలయం, ఎర్రమంజిల్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. -
తాత్కాలికానికి ఇంత దుబారా?
⇒ రూ.220 కోట్ల అంచనాల సచివాలయానికి రూ. 1,200 కోట్లు ఖర్చు పెట్టారు ⇒ అసెంబ్లీ నిర్మాణ పనులు పరిశీలించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: తాత్కాలిక సచివాలయం అంటూనే వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని చంద్రబాబు ప్రభుత్వం దుబారా చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి రూ. 220 కోట్ల అంచనాలతో మొదలుపెట్టి ఇప్పటికి రూ.1,200 కోట్లు ఖర్చు చేయడాన్ని ఆయన తప్పు బట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), పి.అనిల్‌కుమార్‌యాదవ్, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బూడి ముత్యాలనాయుడు బృందం మంగళవారం సచివాలయంలో నిర్మాణంలో ఉన్న అసెంబ్లీ, శాసన మండలి హాలును పరిశీలించారు. అనంతరం పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ, మండలి భవనాలను పరిశీలించి రావాలన్న తమ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో తాము వచ్చినట్టు చెప్పారు. తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మా ణానికి రూ. 1,200 కోట్లు ఎలా ఖర్చు పెట్టా రని ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో విపక్ష నాయకుడికి కనీసం పేషీ కూడా కేటాయించ లేదని విమర్శించారు. ఈ విషయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఏపీ సీఎం చంద్రబాబు పునరాలోచించాలన్నారు. ‘హైదరాబాద్‌లో బాబుకు ఖరీదైన ఇల్లు’ ఇక్కడ అక్రమ నిర్మాణంలో ఉంటున్న బాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో వందల కోట్లు పెట్టి సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నారని ఆర్కే చెప్పారు. విపక్ష నేత వైఎస్ జగన్ నెలలో 20 రోజులకు పైగా రాష్ట్ర ప్రజల మధ్య గడుపుతున్నారని ఆర్కే వివరించారు. విజయవాడలో బృందాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, బొప్పన భవకుమార్ కలిశారు. కాగా విపక్ష ఎమ్మెల్యేలపై ప్రభుత్వం నిఘా పెట్టింది. వారి కదలికలను వీడియో తీసింది.


