మళ్లీ పెరిగిన ఏపీ అసెంబ్లీ నిర్మాణ వ్యయం | Andhra Pradesh: Assembly Construction Cost Rises Again | Sakshi
Sakshi News home page

మళ్లీ పెరిగిన ఏపీ అసెంబ్లీ నిర్మాణ వ్యయం

May 2 2026 8:49 AM | Updated on May 2 2026 10:35 AM

Andhra Pradesh: Assembly Construction Cost Rises Again

సాక్షి, విజయవాడ: అసెంబ్లీ నిర్మాణ వ్యయం మళ్లీ పెరిగింది. రూ. 798 కోట్లు అసెంబ్లీ పనుల కోసం ఖర్చు చేయాలని చంద్రబాబు సర్కార్‌ నిర్ణయించింది. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి నిధులు కేటాయించింది. దీంతో  అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. ఇప్పటికే అత్యధిక ధరకు ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే.

కరకట్ట అభివృద్ధికి 443 కోట్ల నిధులను కేటాయిస్తూ.. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మట్టికట్ట ద్వారా అభివృద్ధికి 443 కోట్లు ఖర్చు చేయాలని, కృష్ణా రైట్ బ్యాక్‌ని ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉండవల్లి ల్యాండ్ పూలింగ్ గ్రామం సదుపాయాలకు 580 కోట్లు కేటాయించింది. అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, సీవరేజ్, విద్యుత్ , ఎస్టీపీ కోసం ఖర్చుచేయాలని నిర్ణయించింది.

అమరావతి సచివాలయానికి భారీగా నిధులు ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 2540 కోట్లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హంగులు, అద్దాల కోసం భారీగా ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అద్దాలు, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కనోపి స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, పీవీ ప్యానల్స్ కోసం భారీగా ఖర్చు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ టవర్, టవర్ 1,2,3,4 లలో హంగుల కోసం నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించింది. క్వాంటమ్ టవర్స్ కోసం 1208 కోట్లు ఖర్చు చేయాలని పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement