breaking news
Arogyamitra workers
-
ఆరోగ్య మిత్రల వేతనం రెట్టింపు
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టులో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రలు, టీమ్ లీడర్ల వేతనాలను పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేతనాలు పెంచిన తర్వాత ఆరోగ్య మిత్రల(పీహెచ్సీ ఆరోగ్యమిత్ర/నెట్వర్క్ ఆరోగ్య మిత్ర) వేతనం రూ.12,000, టీమ్‌లీడర్ల వేతనం రూ.15,000 అందుకోనున్నారు. ప్రస్తుతం ఆరోగ్య మిత్రల వేతనం రూ.6,000, టీమ్‌లీడర్ల వేతనం రూ.10,600గా ఉంది. -
నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యమిత్రల సమ్మె
హైదరాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆరోగ్యమిత్ర కార్యకర్తలు, టీమ్ లీడర్లు నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలో పాల్గొంటున్నట్లు ఆరోగ్యశ్రీ సీఈవోకు నోటీసులు అందజేశారు. తమను కూడా ఆరోగ్యశ్రీ ట్రస్టు కిందకు తీసుకోవాలని, ట్రావెల్ అలవెన్స్ ఇవ్వాలంటూ పలు డిమాండ్లతో కూడిన నోటీసును అందజేశారు. తెలంగాణలో మొత్తం 1,500 మంది ఆరోగ్యమిత్రలు, 110 మంది టీమ్ లీడర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. తెలంగాణ ఆరోగ్యశ్రీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఈ మేరకు సమ్మె నోటీసు జారీ చేసి ఆరోగ్యశ్రీ అధికారులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలనిచ్చారు. ప్రస్తుతం అర్బన్ హెల్త్ సెంటర్లలో పని చేస్తున్న ఆరోగ్య మిత్రలకు జీతం నెలకు రూ. 5,900, నెట్వర్క్ మిత్రలకు రూ 7,200, టీమ్ లీడర్లకు రూ. 9,940 ఇస్తున్నారు. ఈ వేతనాలు పెంచాలంటూ ఎన్నాళ్లుగానో వీళ్లు డిమాండ్ చేస్తున్నారు.