breaking news
Annabelle
-
ప్రాణం తీసిన అన్నాబెల్లె బొమ్మ!?
అన్నాబెల్లె.. ది కంజూరింగ్ సిరీస్ సినిమాలు చూసిన వాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు. అయితే సినిమాటిక్ ప్రపంచంలో ఈ బొమ్మ ఎలా ఉన్నా.. వాస్తవ ప్రపంచంలో మాత్రం దీని రూపురేఖలు మరోలా ఉంటాయి. అయితే ఈ బొమ్మతో స్టంట్లు చేయబోయి ఓ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అనూహ్యంగా ప్రాణం పొగొట్టుకున్నారు.అమెరికాలో కనెక్టికట్ స్టేట్‌లోని న్యూఇంగ్లండ్ సొసైటీ ఫర్ సైకిక్ రీసెర్చ్(NESPR) వాళ్లు.. డెవిల్స్ ఆన్ ది రన్ పేరుతో టూర్లు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో భయానక వస్తువులుగా ముద్రపడినవాటి గురించి వివరించడం ఈ షో ఉద్దేశం. ఇందులో భాగంగా.. అన్నాబెల్లె ఒరిజినల్ బొమ్మతో డాన్ రివెరా(54) అనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ స్టంట్లు చేస్తున్నాడు. అయితే అనూహ్యంగా ఈ పర్యటనలోనే ఆయన కన్నుమూశారు.పెన్సిల్వేనియా గెట్టిస్బర్గ్ సమీపంలో.. జులై 13న తాను బస చేసిన హోటల్ గదిలో విగత జీవిగా ఆయన పడి కనిపించాడు. సీపీఆర్ చేసినా ఆయనలో చలనం లేదు. మృతికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. బహుశా గుండెపోటుతో ఆయన మరణించి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఆయన చనిపోయిన టైంలో ఆ బొమ్మ హోటల్ గదిలో లేదు. బయట తాళం వేసి ఉన్న ఓ వ్యాన్‌లో బొమ్మ కనిపించింది. దానిని ఎవరు అక్కడ ఉంచారనేది తేలాల్సి ఉంది. దీంతో బొమ్మను ఆయన చావుకు ముడిపెట్టి చర్చ నడిపిస్తున్నారు. డాన్ రివెరా(dan Rivera) మృతిపై ఇప్పటికైతే అనుమానాలు నెలకొన్నాయి. అటాప్సీ(శవపరీక్ష) నివేదిక వస్తేనే ఈ మృతి మిస్టరీ వీడేది. ఎన్‌ఈఎస్‌పీఆర్ అనే సంస్థను ప్రముఖ డీమనాలజిస్టులు(దెయ్యాలు, భూతాలు, ఆత్మలపై పరిశోధనలు చేసేవారు), పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు ఎడ్, లారాయిన్ వారెన్‌లు స్థాపించారు. డాన్ రివెరా.. గతంలో అమెరికా సైన్యంలో పని చేశారు. ఎన్ఈఎస్పీఆర్తో చాలాకాలంగా ఆయనను అనుబంధం ఉంది. లారాయిన్ వారెన్కు ముఖ్యశిష్యుడు కూడా. అంతేకాదు.. గతంలో ఓ చానెల్లో మోస్ట్ హంటెడ్ ప్లేసెస్ అనే కార్యక్రమంలోనూ ఈయన పాల్గొన్నారు. అదే సమయంలో నెట్‌ఫ్లిక్స్ ‘28 డేస్ హాంటెడ్’ అనే సిరీస్‌లోనూ కనిపించారు. చాలాకాలంగా అన్నాబెల్లె బొమ్మను ఈయనే చూసుకుంటున్నారు. టిక్‌టాక్‌లో ఆ బొమ్మ షార్ట్ వీడియోస్ కూడా విశేషంగా ఆదరణ దక్కించుకున్నాయి. ఈ విషాదంపై ఎన్‌ఈఎస్‌పీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే డెవిల్స్ ఆన్ ది రన్ మాత్రం ఆగదని స్పష్టం చేసింది. పైగా ఈ బొమ్మతో ఇప్పటిదాకా ప్రాణాలు పోయిన దాఖలాలు లేవని చెబుతున్నారు.కొన్నాళ్ల కిందట లూసియానా టూర్లో అన్నాబెల్లె బొమ్మ కనిపించకుండా పోయిందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే వాటిని రివెర కొట్టిపారేశారు. బొమ్మ సురక్షితంగానే ఉందని ప్రకటించారు. అసలు అన్నాబెల్లే బొమ్మ The Conjuring సినిమాల్లో చూపించిన పోర్సలిన్ బొమ్మ కాదు. నిజ జీవితంలో ఇది రాగ్గెడీ అన్న్ అనే క్లాత్ డాల్, ఎర్ర రంగు నూలతో చేసిన జుట్టుతో ఉంటుంది. కానీ, దీని వెనుక ఉన్న కథ చాలా భయానకంగా ఉంటుంది. 1970లో.. ఈ బొమ్మను లారా క్లిఫ్టన్, డియర్డ్రె బెర్నార్డ్ అనే ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులకు బహుమతిగా ఇచ్చారు. మొదట ఇది సాధారణ బొమ్మలా అనిపించినా, కొద్దిరోజుల్లో దానంతట అదే కదలడం మొదలైందట. దీంతో వాళ్లు ఓ నిపుణుడ్ని సంప్రదించగా, ఈ బొమ్మలో అన్నాబెల్లే హిగ్గిన్స్ అనే చిన్న అమ్మాయి ఆత్మ ఉందని చెప్పారు. పైగా HELP US, HELP CAL అనే రాతలతో ఉన్న పేపర్లు ఆ ఇంట్లో ప్రత్యక్షమయ్యాయి. పెన్సిల్ కూడా లేని ఇంట్లో అవి కనిపించడంతో అంతా భయపడిపోయారు. ఆ సమయంలోనే.. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు వారెన్ దంపతుల వద్దకు బొమ్మ చేరింది. వాళ్లు దానిని తమ ఇంటి బేస్మెంట్లోని కలెక్షన్లో దాచారు. అదే తర్వాత వారెన్ ఆకల్ట్ మ్యూజియంWarren Occult Museumగా మారింది. ఈ మ్యూజియంలో శిలువ(Cross), పవిత్ర నీరు(Holy Water)తో అన్నాబెల్లె బొమ్మను ఓ గ్లాస్ కేస్ లో బంధించారు. అక్కడ “Touch not!” అనే హెచ్చరిక కూడా ఉంది. మరికొన్ని కలెక్షన్లు కూడా అక్కడ ఉన్నాయి. మ్యూజియం అమెరికాలోని కనెక్టికట్ స్టేట్‌లోని మోన్రో నగరంలో ఉంది. అయితే.. 2019లో Lorraine Warren మరణం తర్వాత మ్యూజియం శాశ్వతంగా మూసివేయబడింది. మ్యూజియం Tony Spera (వారెన్‌ల అల్లుడు) ఆధ్వర్యంలో ఉంది. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో లేదు, కానీ NESPR పారానార్మల్ ఈవెంట్స్‌లో కొన్ని వస్తువులను ప్రదర్శిస్తోంది. అందులో ది ఫేమస్ హాంటెడ్ డాల్‌గా పేరున్న అన్నాబెల్లె కూడా ఉంది. వారెన్ దంపతుల ఇన్వెస్టిగేషన్ల స్ఫూర్తితోనే కంజూరింగ్ సినిమాలు తెరకెక్కాయి.Annabelle Handler Dan Rivera Dies Suddenly During Haunted Tour, RIP #annabelle #annabelledoll #edwarren #lorrainewarren #paranormal #riristea #rivetsoro pic.twitter.com/6Ya3WM6K03— Rivet Soro (@Rivet_Soro) July 15, 2025 -
హెడ్‌కు ‘బోర్డర్ మెడల్’
మెల్బోర్న్: ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు (సీఏ) తమ ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శనకు ఇచ్చే వార్షిక అవార్డులను ప్రకటించింది. పురుషుల విభాగంలో ఉత్తమ ఆటగాడిగా ట్రవిస్ హెడ్ ఎంపికయ్యాడు. గత ఏడాది కాలంలో ఆసీస్‌కు కీలక విజయాలు అందించిన హెడ్ ‘అలెన్ బోర్డర్ మెడల్’ను గెలుచుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 1427 పరుగులు సాధించిన హెడ్... అవార్డు కోసం జరిగిన ఓటింగ్‌లో 208 ఓట్లతో అగ్ర స్థానంలో నిలవగా, హాజల్‌వుడ్‌కు రెండో స్థానం (158) దక్కింది. బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో భారత్‌తో జరిగిన రెండో టెస్టులో 141 బంతుల్లో 140 పరుగులు చేసిన హెడ్ ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. వన్డేల్లో అత్యుత్తమ ఆటగాడి అవార్డు కూడా హెడ్కే దక్కడం విశేషం. ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా హాజల్‌వుడ్, ఉత్తమ టి20 క్రికెటర్‌గా ఆడమ్ జంపా నిలిచారు. ‘బ్రాడ్‌మన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా స్యామ్ కొన్‌స్టాస్ ఎంపికయ్యాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న కారణంగా ఆస్ట్రేలియా జట్టు పురుషుల క్రికెటర్లు ఎవరూ ఈ అవార్డులను అందుకోలేకపోయారు. మహిళల విభాగంలో అత్యుత్తమ క్రికెటర్‌గా అనాబెల్ సదర్లాండ్ నిలిచింది. ఓటింగ్‌లో యాష్లీ గార్డ్నర్ (143 పాయింట్లు)ను వెనక్కి నెట్టిన సదర్లాండ్ (168) ప్రతిష్టాత్మక ‘బెలిండా క్లార్క్ అవార్డు’కు ఎంపికైంది. గత ఏడాదిలో దక్షిణాఫ్రికాతో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన అనాబెల్... ఎంసీజీలో టెస్టు సెంచరీ బాదిన (ఇంగ్లండ్‌పై) తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. మహిళల వన్డేల్లో ఉత్తమ క్రికెటర్ అవార్డు యాష్లీ గార్డ్నర్ గెలుచుకోగా, ఉత్తమ టి20 ప్లేయర్ పురస్కారం బెత్ మూనీకి దక్కింది. ఆ్రస్టేలియా క్రికెట్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో మైకేల్ క్లార్క్, మైకేల్ బెవాన్, క్రిస్టీనా మాథ్యూస్ చోటు దక్కించుకున్నారు. -
ఆ సినిమా చూసి..
బ్రెజిల్: 'కంజ్యూరింగ్' ఈ సినిమా పేరు తెలియని హర్రర్ మూవీ ప్రేమికులు ఉండరంటే అతిశయోక్తి కాదు. కంజ్యూరింగ్ నుంచి తాజాగా విడుదలైన చిత్రం 'ఆనబెల్'. ఈ చిత్రాన్ని థియేటర్లో విక్షించిన ఓ యువతి తనను తాను కొట్టుకుంటూ వికృతంగా పవర్తించింది. ఈ ఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. బ్రెజిల్‌లోని టెరెసినా ప్రాంతానికి చెందిన ఓ 20 ఏళ్ల యువతి తన స్నేహితులతో కలిసి ‘ఆనబెల్’ సినిమాకు వెళ్లింది. సినిమా చూసిన అనంతరం థియేటర్ నుంచి బయటికి వస్తుండగా ఉన్నట్టుండి గట్టిగా కేకలు వేస్తూ.. తనని తానే గాయపరుచుకుంటూ వింతగా ప్రవర్తించింది. ఆమె వింత ప్రవర్తనను చూసిన స్నేహితులు నిశ్చేష్టులయ్యారు. ఆమెని ఎంత అదుపుచేయాలని చూసినా వారి తరం కాలేదు. దాంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడంతో వైరల్‌గా మారింది.