breaking news
Anitha R. Radhakrishnan
-
డీఎంకే మంత్రి అనిత’కు ఈడీ షాక్!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే హయాంలో చేసిన తప్పులు.. ప్రస్తుత డీఎంకే మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్‌ను వెంటాడుతున్నాయి. ఆయన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఆస్తులను అటాచ్ చేస్తూ శనివారం ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. తూత్తుకుడి జిల్లాలో తన కంటూ వ్యక్తిగత బలం కల్గిన నేత అనిత ఆర్ రాధాకృష్ణన్. అన్నాడీఎంకేలో కొన్నేళ్ల పాటూ ఆ జిల్లా కీలక నేతగా ఆయన చక్రం తిప్పారు. 2001 నుంచి 2006 వరకు అన్నాడీఎంకే ప్రభుత్వంలో పశుసంవర్థక, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత సీఎం జయలలితతో విభేదాల కారణంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. కొన్నాళ్లు మౌనంగా ఉన్నా, చివరకు డీఎంకేలో చేరి ఓటమి ఎరుగని నేతగా తూత్తుకుడిలో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం డీఎంకే అధికారంలోకి రావడంతో ఆయన మత్స్యశాఖ మంత్రి అయ్యారు. వెంటాడుతున్న ఈడీ.. 2001–2006 మధ్య కాలంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులను అనిత ఆర్ రాధాకృష్ణన్ గడించినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. తమకు అందిన ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు ఏడుగురిపై తొలుత ఏసీబీ కేసు నమోదు చేసింది. అలాగే, మనీ లాండరింగ్ కేసు కూడా నమోదైంది. అయితే దశాబ్దం కాలం ఎలాంటి పురోగతి లేకుండా ఉన్న ఈకేసు.. ఇటీవల మళ్లీ తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వర్గాలు అక్రమ సంపాదనతో 160 ఎకరాల స్థలాన్ని ఆయన కొన్నట్లు తేల్చింది. అలాగే, మరో 18 చోట్ల కూడా స్థిర, చర ఆస్తులను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. దీంతో ఆ స్థలాలతో పాటుగా రూ. 6 కోట్ల మేరకు ఉన్న మరికొన్ని ఆస్తులను అటాచ్ చేస్తూ గతంలో ఈడీ వర్గాలు ఉత్తర్వులు జారీ చేశాయి. దీనిని వ్యతిరేకిస్తూ అనిత కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అయితే గత నెల మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు వైద్యనాథన్, జగదీశ్ చంద్ర నేతృత్వంలోని బెంచ్ ముందు స్టే ఎత్తి వేత కోసం ఈడీ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. అనిత తరపు న్యాయవాదులు తమ వాదనను కోర్టుకు వినిపించారు. అయితే, స్టేను ఎత్తి వేస్తున్నామని, ఈడీ విచారణకు ఆదేశిస్తున్నామని కోర్టు ప్రకటించడంతో అనితకు షాక్ తప్పలేదు. అస్సలే తూత్తుకుడి డీఎంకే రాజకీయాలు రచ్చకెక్కి ఉన్న నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులు అనితను చిక్కుల్లో పడేశాయి.ఈ సమయంలో శనివారం ఈడీ మరో అడుగు ముందుకు వేసింది. ఆయనకు చెందిన రూ. 6.54 కోట్ల విలువైన 160 ఎకరాల స్థలం, మరో 18 ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. -
తగ్గిన అనిత
- కరుణతో భేటీ - శ్రమిస్తానని హామీ సాక్షి, చెన్నై: డీఎంకే తూత్తుకుడి జిల్లా నేత అనితా ఆర్ రాధాకృష్ణన్ పట్టువీ డారు. జిల్లా కార్యదర్శి పెరియస్వామి తో కలిసి పార్టీ కోసం శ్రమించేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు గురువా రం అధినేత కరుణానిధి, దళపతి స్టాలి న్ను కలిశారు. తూత్తుకుడి జిల్లాలో తన కంటూ వ్యక్తిగత బలం కల్గిన నేత అనితా రాధాకృష్ణన్. తొలుత అన్నాడీఎంకేలో ఆ జిల్లా నేతగా, మాజీ మంత్రిగా చక్రం తిప్పిన ఘనత ఆయనది. అన్నాడీఎంకేలో ఏర్ప డ్డ విభేదాలతో డీఎంకేలోకి వచ్చారు. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక మనసు మార్చుకునే యత్నం చేశారు. డీఎంకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాకైనా, తన మనసు అంతా అన్నాడీఎంకే చుట్టూ తిరుగుతున్నట్టు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. సీఎం జయలలిత సమక్షంలో ఆ పార్టీలో చేరడానికి తీవ్రంగానే ప్రయత్నించినా, తలుపులు మాత్రం తెరచుకోలేదు. ఎట్టకేలకు తీవ్ర ప్రయత్నంతో ఓమారు కలిసే అవకాశం వచ్చినా, పార్టీలోకి ఆహ్వానం మాత్రం దక్కలేదు. దీంతో డీఎంకేలో ఉంటూనే, అన్నాడీఎంకేకు విధేయత చాటుకునే రీతిలో వ్యవహరించడం మొదలెట్టారు. దీన్ని గుర్తించిన కరుణానిధి అనితా రాధాకృష్ణన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి సిద్ధం కావాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో ఎమ్మెల్యే అన్న బో ర్డును మాత్రం తగిలించుకుని రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉండడం మొదలెట్టారు. అదే సమయంలో తూత్తుకుడి డీఎంకే జిల్లా పగ్గాలు మరో మంత్రి పెరియస్వామి చేతికి చేరాయి. దీంతో రాజకీయాలకు ఇక అనిత దూరం అన్నప్రచారం ఆ జిల్లాలో బయల్దేరింది. తగ్గిన అనిత: డీఎంకేలో తనకు ఇక గుర్తింపు లేదన్న నిర్ణయానికి అనిత ఆర్ రాధాకృష్ణన్ వచ్చేశారని చెప్పవచ్చు. పార్టీకి, ప్రజలకు దూరంగా ఉండడం మొదలెట్టిన ఆయనకు అన్నాడీఎంకే నుంచి చివరి క్షణం వరకు ఆహ్వానం, పిలుపు మాత్రం రాలేదు. దీంతో వెనక్కు తగ్గారు. మనసు మార్చుకుని తనను సంక్లిష్ట పరిస్థితుల్లో అక్కున చేర్చుకుని ఎమ్మెల్యేగా నిలబెట్టిన కరుణానిధి పక్షానే ఉండడం మంచిదన్న భావనకు వచ్చేసినట్టున్నారు. దీంతో ఉదయాన్నే చెన్నైలోని గోపాలపురం మెట్లు ఎక్కేశారు. అధినేత ఎం కరుణానిధి, దళపతి స్టాలిన్లను కలుసుకున్నారు. జిల్లా కార్యదర్శి పెరియస్వామితో కలిసి, తానూ పార్టీ కోసం జిల్లాలో సేవల్ని అందిస్తానని కరుణానిధికి హామీ ఇచ్చి బయటకు వచ్చేశారు. వెలుపల మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నల్ని సంధించగా, గడిచిన కా లం చీకటి రోజులుగా పేర్కొంటూ స మాధానాలు దాట వేశారు. ఇక తన కర్తవ్యం పెరియస్వామితో కలసి పార్టీని జి ల్లాలో బలపేతం చేయడమేనని స్ప ష్టం చేసి ముందుకు సాగారు. మద్దతు ప్లీజ్ : కరుణానిధితో అనితా భేటీ అనంతరం జానపద కళాకారుడు కోవన్‌తో కలిసి మక్కల్ కలై ఇయక్కం వర్గాలు గోపాలపురానికి రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల సీఎం జయలలితకు వ్యతిరేకంగా వివాదాస్పద పాటలను పాడి కోవన్ జైలుకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. కరుణానిధితో భేటీ అనంతరం బయటకు వచ్చిన కోవన్ మీడియాతోమాట్లాడుతూ డిసెంబర్లో మద్యానికి వ్యతిరేకంగా తాము చేపట్ట దలచిన మహానాడుకు మద్దతు ఇవ్వాలని కరుణానిధిని విజ్ఞప్తి చేశామన్నారు. అన్నాడీఎంకే, బీజేపీ మినహా తక్కిన అన్నిపార్టీల నాయకుల్ని కలిసి మద్దతు కోరనున్నామన్నారు.