breaking news
angallu
-
అంగళ్లు కేసు క్లోజ్!
బి.కొత్తకోట: రాజు తలచుకుంటే జరగనిది ఏముంది? మరి కేసే రాజుదైతే లెక్కేముంది? అధికారం చంద్రబాబుదైతే కేసు మూసివేతకు అడ్డు ఏముంది? అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో 2023 అగస్టులో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సహా 20 మంది టీడీపీ నేతలపై నమోదైన కేసును నీరుగార్చి అధికారికంగా మూసివేసేందుకు రంగం సిద్ధమైంది. కుట్ర, హత్యాయత్నం లాంటి తీవ్రమైన సెక్షన్లు నమోదైన ఈ కేసులో దర్యాప్తును ముందుకు తీసుకెళ్లకపోగా అసలు ఫిర్యాదే తప్పు అని ఖాకీలు తాజాగా తేల్చేశారు.దీనిపై పైస్థాయి నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిళ్లతో మదనపల్లె డీఎస్పీ జారీ చేసిన నోటీసును రూరల్ సీఐ ఆదివారం ఫిర్యాదుదారుడికి అందజేశారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో నాడు అంగళ్లుకు వచ్చిన చంద్రబాబు పోలీసులను తీవ్రంగా తూలనాడటంతోపాటు రైతులపై సైతం దాడులకు టీడీపీ శ్రేణులను పురిగొల్పారు. దీనిపై ఫిర్యాదుదారుడు సమరి్పంచిన ఆధారాలను కనీసం పట్టించుకోని పోలీసు అధికారులు తాజాగా ఏకంగా కేసే లేకుండా మూసివేసేందుకు సిద్ధమయ్యారు. ఆ రోజు జరిగింది ఇదీ.. ముదివేడు సమీపంలో రూ.750 కోట్లతో నిరి్మస్తున్న రిజర్వాయర్‌పై చంద్రబాబు ఎన్జీటీలో కేసు వేయించి టీడీపీ నేతల ద్వారా అడ్డుకోవడంతో పనులు ఆగిపోయాయి. దీనిపై మార్కెట్ కమిటీ చైర్మన్ డీఆర్.ఉమాపతి, రైతులు, వైఎస్సార్సీపీకి చెందిన కొందరు నాడు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపి చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే చంద్రబాబు అంగళ్లు కూడలి వద్ద వారిని వేలెత్తి చూపిస్తూ ఉసిగొల్పడంతో టీడీపీ మూకలు విరుచుకుపడ్డాయి. రాళ్లు, ఇటుకలు, కట్టెలు, చెప్పులు, రాడ్లతో మూకుమ్మడిగా దాడి చేయడంతో వైఎస్సార్సీపీకి చెందిన వసంతరెడ్డి, అర్జున్‌రెడ్డి, విలేకరి శ్రీనివాసులు, మహే‹Ù, ముదివేడు పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ కేశవ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఉమాపతి ఆడియో, వీడియో సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 8న చంద్రబాబు సహా 20 మంది టీడీపీ నేతలు, ఇతరులపై 120బి, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506, రెడ్‌విత్ 149 ఐపీసీ సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆర్సీఎస్ నోటీసుచంద్రబాబు సీఎం కావడంతో ఆయనపై నమోదైన కేసును నీరుగార్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా చంద్రబాబుపై నమోదైన క్రైమ్ నంబర్ 79/2023 తప్పుడు కేసుగా తేల్చేసి ఫిర్యాదుదారుడిని ఆదివారం పోలీస్‌స్టేషన్‌కు రప్పించి రెఫర్డ్ కేసు సమన్స్ (ఆర్సీఎస్) అందచేశారు. పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే నోటీసు అందుకున్న వారం రోజుల్లో సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని అందులో ఉంది. అయితే నోటీసును డీఎస్పీ గత నెల 25న జారీ చేస్తే ఫిర్యాదుదారుడికి ఆదివారం అందచేయడం గమనార్హం. గడువు ముగిశాక నోటీసు అందించడం ద్వారా కోర్టును ఆశ్రయించే అవకాశం లేకుండా చేయాలని కుట్రపూరితంగా వ్యహరించినట్లు స్పష్టమవుతోంది. అయితే ఫిర్యాదుదారుడు ఉమాపతి తాను నోటీసు అందుకున్న తేదీని ప్రస్తావిస్తూ కాగితాలపై సంతకం చేయడంతో పోలీసుల పాచిక పారలేదు.బలవంతంగా నాతో సంతకంముదివేడులో ఉన్న నన్ను ఆరుగురు పోలీసులు ఓ నిందితుడి మాదిరిగా మదనపల్లె రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టారని, నోటీసు తీసుకుని సంతకం చేయాలని నన్ను బలవంతం చేశారు. కేసు రాజీకి ఒప్పుకోనని చెప్పినా పట్టుపట్టి సంతకం పెట్టించుకున్నారు. రైతులకు ద్రోహం చేయడం వల్లే ఆ రోజు చంద్రబాబును ప్రశి్నంచేందుకు అంగళ్లు వచ్చాం. రైతులమైన మాపై టీడీపీ శ్రేణులు రాళ్లు, రాడ్లతో దాడులు చేశాయి. పోలీసుల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు. ఈ కేసులో రాజీ పడేది లేదు. కచ్చితంగా కోర్టును అశ్రయిస్తా. – డీఆర్.ఉమాపతి, అంగళ్లు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ -
మేమంతా మీ వెంటే.. జననేత యాత్రలో జనగర్జన
-
అంగళ్లు విధ్వంసం కేసులో బాబు ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: యుద్దభేరి పేరుతో ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద టీడీపీ శ్రేణులు సాగించిన విధ్వంసంపై ముదివీడు పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంలో గురువారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నిర్ణయాన్ని వెలువరిస్తామన్నారు. అంతకుముందు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. అధికార పార్టీ కి చెందిన వారే అలజడి సృష్టించాలన్న ఉద్దేశంతో ర్యాలీపై రాళ్లదాడి చేశారని చెప్పారు. తమపై దాడిచేసి ఆ తరువాత నాలుగు రోజులకు తప్పుడు ఫిర్యాదు చేశారని, పోలీసులు సైతం వాస్తవాలు తెలుసుకోకుండానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో ఇతర నిందితులందరికీ హైకోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసిందన్నారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే విధ్వంసం పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు ప్రోద్బలంతోనే అంగళ్లు విధ్వంసం జరిగిందని చెప్పారు. పార్టీ శ్రేణులను రెచ్చగొట్టారన్నారు. అంగళ్లు వద్ద మొదలైన విధ్వంసం చిత్తూరు జిల్లా పుంగనూరు వరకు కొనసాగిందని, ఈ ఘటనలో పోలీసులు పెద్దసంఖ్యలో గాయపడ్డారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రిగా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి పూర్తి బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారని చెప్పారు. చంద్రబాబు ప్రోద్బలంతో జరిగిన ఈ దాడిలో పిటిషనర్, ఇతరులు గాయపడ్డారని తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు బెయిల్‌కు అర్హులు కాదని, అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును శుక్రవారం వెలువరిస్తానని తెలిపారు. -
Live : బాబు కేసు & పాలిట్రిక్స్ అప్డేట్స్.. Click & Refresh
Updates.. 06:10 PM రాజమండ్రి : లాయర్ సిద్ధార్థ్ లూథ్రాపై ఫిర్యాదు ►బాబు లాయర్ సిద్ధార్థ లూద్రాపై రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ►రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన న్యాయవాదే రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నారని ఫిర్యాదు ►మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌతు సూర్యప్రకాశరావు ఫిర్యాదు 06:10 PM రాజమండ్రి : బాలయ్య బిజీ బిజీ ►కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్యనేతలతో బాలకృష్ణ సమావేశం ►చంద్రబాబు, పవన్ మధ్య జరిగిన చర్చల ప్రస్తావన ►రెండు రోజుల్లో విజయవాడలో టీడీపీ, జనసేన నేతల మీటింగ్ ► క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలపై చర్చ ► కొందరికి టికెట్లు ఇవ్వకపోతే వచ్చే అసంతృప్తిపై చర్చ ► రెండు పార్టీల క్యాడర్ సహకరించుకుంటారా? విభేదించుకుంటారా? ►ఈ నెల 19న చంద్రబాబు కేసు విచారణ తర్వాత అప్పటి పరిస్థితులను అనుగుణంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు 06:10 PM రాజమండ్రి ►రేపట్నుంచి సెలవులో రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ ►తన భార్య అనారోగ్యం దృష్ట్యా సెలవు తీసుకున్న సూపరింటెండెంట్ ►కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ కు జైలు ఇన్ ఛార్జ్ బాధ్యతలు 05:30 PM విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు ►బెయిల్ పిటిషన్ పరిశీలించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ►కస్టడీ పిటిషన్ పై హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిందన్న న్యాయమూర్తి ►కస్టడీ పిటిషన్ కు, బెయిల్ కు సంబంధం లేదన్న న్యాయవాది సుబ్బారావు ►పిటిషన్‌కు లిస్టింగ్ ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని CIDకి సూచించిన కోర్టు 04:46 PM పేర్ని నాని, వైఎస్సార్సిపి ప్రెస్‌మీట్ ►చంద్రబాబును ఓదార్చడానికి పవన్ వెళ్లాడనుకున్నాం ►పవన్ చంద్రబాబును ఓదార్చడానికి వెళ్లాడా? ►చంద్రబాబుతో బేరం మాట్లాడ్డానికి వెళ్లాడా? ►చంద్రబాబుతో ములాఖత్ కాదు మిలాఖత్ అని తేలింది ►బీజేపీతో పవన్ ది తాత్కాలిక పొత్తు మాత్రమే ►తెలుగుదేశంతోనే పవన్ కు శాశ్వత పొత్తు ►పవన్ కు క్లారిటీ ఉంది... బీజేపీకే లేదు ►బీజేపీ ఎప్పటికప్పుడు పిల్లిమొగ్గలు వేస్తోంది ►పవన్ పొత్తు పాత వార్తే... ఇందులో కొత్తదనం లేదు ►తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్ అంతర్భాగం ►కలవడం, విడిపోవడం కేవలం ముసుగు మాత్రమే ►చంద్రబాబుతో పవన్ వ్యాపారం మాట్లాడుకుని వచ్చాడా? ►తన కార్యకర్తలకైనా పవన్ ఈ విషయం చెప్పాలి ►పవన్ పరామర్శకు జైలుకు వెళ్లి డీల్ చేసుకుని వచ్చారు ►ప్రజాధనం దోచుకున్న దొంగను పవన్ పరామర్శిస్తాడా? ►ఇదేనా పవన్ చెప్పిన జనసేన సిద్ధాంతం? ►అవినీతిపై పవన్ రాజీ లేని పోరాటం చేస్తానన్నాడు ►మరి అవినీతిపరుడైన చంద్రబాబుకు ఎలా మద్దతు ప్రకటిస్తాడు ►తాను దోచుకున్న డబ్బులో లోకేష్ వాటా ఇస్తానని చెప్పాడా? ►లోకేష్ తో సీట్లేనా లేక లెక్కలు కూడా పంచుకున్నారా? ►తనను నమ్ముకున్న వారిని మోసం చేసి పవన్ లాభపడుతున్నాడు ►సినిమాల్లోనే పవన్ హీరో... బయట మాత్రం జోకర్ ►25 స్థానాలకు పవన్ అభ్యర్ధులను సప్లై చేస్తాడు 04:00 PM ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ► స్కిల్ స్కామ్ లో రూ.371 కోట్ల అవినీతి జరిగింది ► ఈ స్కామ్ లో మొత్తం 10 కీలక అంశాలు ఉన్నాయి ► నిబంధనలకు విరుద్ధంగా నిధులను రిలీజ్ చేశారు ► అధికారుల అభ్యంతరాలను నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు ► తప్పుడు డాక్యుమెంట్స్ తో ఒప్పందాలు చేసుకున్నారు ► ప్రభుత్వ జీవోకు, అగ్రిమెంట్ కు చాలా తేడాలు ఉన్నాయి ► అగ్రిమెంట్ లో జీవో నెంబర్ ను చూపించలేదు ► జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్ లో లేవు ► సీమెన్స్ కంపెనీ ట్రైనింగ్ మాడ్యూల్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు ► ఎక్కడా కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పెడతామని చెప్పలేదు ► కేబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు ► కార్పొరేషన్ ఏర్పాటులో విధివిధానాలు పాటించలేదు ► స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో ఖజానాను దోచేశారు ► రూ.3,300 కోట్లు ఫ్రీగా సీమెన్స్ ఇస్తుందని చెప్పారు ► ప్రభుత్వం కేవలం 10 శాతం ఇస్తే సరిపోతుందన్నారు ► ఏపీ ఖజానా నుండి రూ.371 కోట్లు డిజైన్ టెక్ కు చెల్లించారు ► పైలట్ ప్రాజక్టు అమలు చేయాలన్న అధికారుల వాదనను పట్టించుకోలేదు 03:13 PM లోకేష్, బాలకృష్ణ ప్రెస్‌మీట్ లోకేష్ ► జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాం ► ఉమ్మడి కార్యాచరణ రేపటి నుంచే అమల్లోకి వస్తుంది ► సీట్ల పంపిణీతో పాటు అన్ని అంశాలు చర్చించుకుంటాం ► కొందరు అధికారులపై సివిల్ వార్ ప్రకటిస్తున్నాను ► చంద్రబాబు కట్టిన జైలులో ఆయన్నే పెడతారా? ► పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని రోడ్డుపైనే కూర్చోబెడితే ఎలా? ► జనసేనతో కలిసి సివిల్ వార్ ప్రకటిస్తున్నాం బాలకృష్ణ ►అన్న ఎన్టీఆర్ తెలుగువారికి ఆత్మగౌరవం తెచ్చారు ►చంద్రబాబు చాలా ఇన్నోవేటివ్, ఎక్కడా సంతకం పెట్టలేదు ►ఏ చట్ట ప్రకారం అరెస్ట్ చేశారో చెప్పాలి ►యువగళంలో లోకేష్‌కు వస్తున్న ఆదరణ చూసి బాబును అరెస్ట్ చేశారు 03:13 PM బాబు బెయిల్ పిటిషన్‌పై నోటీసులు జారీ ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు నోటీసులు ►స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు . ►అయితే.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉండగా బెయిల్ పిటిషన్ ఎలా వేశారని ప్రశ్నించిన ఏసీబీ కోర్టు ►సీఐడీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత విచారణ జరిగే అవకాశం 03:05 PM పొత్తు విషయం అధిష్టానం చూసుకుంటుంది: బీజేపీ ►పవన్ పొత్తు వ్యాఖ్యల పై స్పందించిన ఏపీ బీజేపీ ►పొత్తుల అంశం బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుంది ►ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది ►ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే బీజేపీ పొత్తు ఉంది : ఏపీ బీజేపీ ►తెలుగుదేశంతో ఎలాంటి పొత్తు లేదు : ఏపీ బీజేపీ 03:00 PM లోకేష్, బాలకృష్ణ పోటాపోటీ భేటీలు ► అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో పవన్, లోకేశ్, బాలకృష్ణ సమాలోచనలు ► రేపటి నుంచి ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశంపై బాలకృష్ణ చర్చ 02:36 PM చంద్రబాబు కుటుంబంతో పవన్ భేటీ ► పరామర్శ పేరిట.. చంద్రబాబు కుటుంబ సభ్యులతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ►చంద్రబాబు భార్య భువనేశ్వరి, బాబు తనయుడు నారా లోకేష్, లోకేష్ సతీమణి బ్రహ్మణి, చంద్రబాబు బామ్మర్ది నందమూరి బాలకృష్ణ ఉన్నారు. ► అంతకు ముందు రాజమండ్రి సెంట్రల్ జైలులో.. ములాఖత్ పేరిట పవన్ రాజకీయం నడిపారు. 01:30 PM ప్యాకేజ్ బంధం బయటపడింది ►పవన్‌కు YSRCP స్ట్రాంగ్ కౌంటర్ ►నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి వెళ్ళింది దీని కోసమేనా? ►పొత్తును ఖాయం చేసుకునేందుకేనని ప్రజలకు పూర్తిగా అర్థం అయింది ►ఇన్నాళ్ళూ నీమీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మిన వాళ్ళకు ఈరోజుతో భ్రమలు తొలగించేశావు ►ఇక ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం ►ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధం ►జైల్లోనూ పాలిట్రిక్స్ వదిలి పెట్టరా అంటూ పవన్, చంద్రబాబులకు చురకలు “ప్యాకేజ్ బంధం బయటపడింది” నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి వెళ్ళింది @JaiTDPతో పొత్తును ఖాయం చేసుకునేందుకని ప్రజలకు పూర్తిగా అర్థం అయింది @PawanKalyan. ఇన్నాళ్ళూ నీమీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మిన వాళ్ళకు ఈరోజుతో భ్రమలు తొలగించేశావు.… pic.twitter.com/MCjVLq26zb — YSR Congress Party (@YSRCParty) September 14, 2023 12:50 PM సెంట్రల్ జైల్ పాలిట్రిక్స్ : ములాఖత్ తర్వాత పవన్ కళ్యాణ్ ►వచ్చే ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేస్తున్నాం ►ఈ విషయం జనసేన కార్యవర్గం అర్థం చేసుకోవాలి ►తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తాయని నేను ఇవ్వాళ నిర్ణయం తీసుకున్నాను ► విడివిడిగా పోటీ చేస్తే వైఎస్సార్‌సిపిని ఆపలేం ► BJP మాతో కలుస్తుందో లేదో వాళ్లే తేల్చుకోవాలి ► ఇక నుంచి టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ► తెలుగుదేశం నేతలతో కలుస్తున్నానంటే అది పాలకపక్షం వల్లే ► ఒక వైపు బాలకృష్ణ, మరోవైపు లోకేష్‌ల మధ్య ఉన్నానంటే అది పాలకపక్షం వల్లే ► ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును చట్టవ్యతిరేకంగా జైల్లో పెట్టారు ► చంద్రబాబుకు నా మద్ధతు ప్రకటిస్తున్నా ► గతంలో విధానాల పరంగా భిన్నమైన ఆలోచనలున్నాయి ► అందుకే 2019లో వేర్వేరుగా పోటీ చేశాం ► 2014లో విభజన జరిగినపుడు రాష్ట్రానికి నష్టం కలిగింది ► 2014లో నేను నరేంద్ర మోదీకి మద్ధతు తెలిపాను ► భారత్ మీద తరచుగా ఉగ్రదాడులు జరిగినపుడు బలమైన నాయకత్వం కావాలనుకున్నాను ► నాడు నరేంద్ర మోదీ నన్ను పిలిస్తే నేను వెళ్లాను తప్ప.. నా అంతట నేను కాదు ► చంద్రబాబుతో నాడు ప్రత్యేక హోదా కోసం విభేదించాను తప్ప.. ఆయనంటే నాకు నమ్మకం ► చంద్రబాబు అంటే వ్యక్తిగతంగా నాకు విశ్వాసం ఉంది ► బ్యాంకులో తప్పు జరిగితే .. బ్యాంకు ఓనర్‌ను అరెస్ట్ చేసినట్టుగా ఉంది ► చంద్రబాబును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారించాలి కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విచారిస్తుంది? 12:40 PM మూడు అంశాలపై ముగ్గురితో మంతనాలు ► పూర్తిగా రాజకీయ ఎజెండాతో చంద్రబాబు ములాఖత్ ► మొదటి అంశం : లోకేష్ పాదయాత్ర కంటిన్యూ చేయాలా? ఆపేయాలా? ► రెండో అంశం : పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఏం చేయాలి? ► మూడో అంశం : పొత్తుల విషయం ఏం చేయాలి? జనసేనకు ఎన్ని సీట్లు? ► పార్టీలో బాలకృష్ణ పాత్ర ఏంటీ? ఇక ముందు టిడిపికి ఎవరు నేతృత్వం వహించాలి? 12:30 PM ఎట్టకేలకు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ ► విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు లాయర్లు ► స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబుకి బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ ► హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు కదా అని ప్రశ్నించిన ఏసీబీ కోర్టు జడ్జి ► బెయిల్ పిటిషన్ పరిశీలించి లిస్టింగ్ ఇస్తామన్న ఏసీబీ కోర్టు జడ్జి 12:16 PM చంద్రబాబుతో ముగ్గురు నేతల ములాఖత్ ► రాజమండ్రి జైలు కేంద్రంగా చంద్రబాబుతో రాజకీయ మంతనాలు ► బాలకృష్ణ, పవన్, లోకేశ్‌లతో చంద్రబాబు చర్చలు ► దాదాపు 40 నిమిషాల పాటు ములాఖత్ ఉండే అవకాశం 12:10 PM ఎన్నికలొస్తున్నాయ్.. కిం కర్తవ్యం.? ► జైల్లో బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లతో చంద్రబాబు మంత్రాంగం ► ఎవరెవరు ఏ ఏ విభాగాలు చూసుకోవాలన్న దానిపై స్పష్టత ఇచ్చే అవకాశం ► విజయవాడ కేంద్రంగా బాలకృష్ణ, రాజమండ్రి కేంద్రంగా లోకేష్, గ్రౌండ్లో పవన్.? ► ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జైలు నుంచే చంద్రబాబు వ్యూహరచన ► పొత్తులపైనా చర్చలు, ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలో సమాలోచనలు 11:59 AM బెయిల్‌పై వెనక్కి..ముందుకు.. ► విజయవాడ ACB కోర్టులో బెయిల్ పిటీషన్ వేసే ఆలోచనలో చంద్రబాబు లాయర్లు ► ఇప్పటివరకు స్క్వాష్‌పై నమ్మకం పెట్టుకున్న బాబు లాయర్లు ► ఆలస్యం అవుతుండడంతో ముందు బెయిల్ కోసం లాయర్ల యోచన ► స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబుకి బెయిల్ ఇవ్వాలని పిటిషన్ తయారీ ► ఎప్పుడు వేయాలన్నదానిపై లాయర్ల మల్లగుల్లాలు 11:45 AM రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ బిజీ బిజీ ► రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వచ్చిన పవన్ కళ్యాణ్ ► ఆరు వాహనాల కాన్వాయ్‌తో వచ్చిన పవన్ కళ్యాణ్ ► ఆరు వద్దు, ఒక కారు సరిపోతుందని సూచించిన అధికారులు ► పవన్ వెంట జైల్లోకి వెళ్లేందుకు జనసేన నాయకుడు కందుల దుర్గేష్ ప్రయత్నం ► ఇష్టానుసారంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంపై అధికారుల అసహనం ► జనసేన నేత కందుల దుర్గేష్‌ను వెనక్కి పంపిన అధికారులు 11:30 AM జైలు ముందు కూడా డ్రామాలా? ► రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్న బాలకృష్ణ లోకేష్ ► వారితోపాటు జైలు వద్దకు వచ్చిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చౌదరి ►ముందస్తు అనుమతి లేకుండా జైల్లోకి వెళ్లేందుకు బుచ్చయ్య చౌదరి యత్నం ► బుచ్చయ్యని వారించి, వెనక్కు పంపిన జైలు అధికారులు ►అధికారులపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బుచ్చయ్య ►ములాఖత్‌కు దరఖాస్తు చేసుకోకుండా రావడం సరికాదన్న అధికారులు ►అనుమతి తీసుకున్న వారిని మాత్రమే లోపలికి పంపిన జైలు అధికారులు 11:20 AM జైలు నుంచే రాజకీయం ► ఇవ్వాళ చంద్రబాబును కలవనున్న బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్, లోకేష్ ► పార్టీకి సంబంధించి బాధ్యతల పంపిణీపై బాబు మాట్లాడతాడని ప్రచారం ► విజయవాడ కేంద్రంగా బాలకృష్ణ, రాజమండ్రి కేంద్రంగా లోకేష్, గ్రౌండ్లో పవన్.? ► ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జైలు నుంచే చంద్రబాబు వ్యూహరచన 11:15 AM లూథ్రా ట్వీట్ల పరమార్థమేంటీ? ► పూర్తిగా నిర్వేదంలోకి వెళ్ళినట్టు కనిపిస్తోన్న సిద్ధార్థ లూథ్రా ► నిన్న గురు గోవింద్ సింగ్ .. ఈ రోజు స్వామి వివేకానంద !!! ► ఇంతటి క్లిష్టమైన కేసును చూడలేదన్నట్టుగా ట్వీట్లు ► చంద్రబాబుకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలుండడంతో చేష్టలుడిగిపోయిన లూథ్రా ► కేసులో అన్ని దారులు మూసుకుని పోవడంతో ఫ్రస్ట్రేషన్ నుంచి ఫిలాసఫీలోకి వచ్చాడంటున్న టిడిపి నేతలు 11:00 AM పోటాపోటీ క్యాంపులు ► రాజమండ్రి రూరల్ కాతేరు వద్ద లోకేష్ క్యాంప్ ఏర్పాటు ► టిడిపి శ్రేణులతో చర్చలు జరుపుతున్న లోకేష్, భువనేశ్వరి ►పార్టీ కార్యాలయం కేంద్రంగా బాలకృష్ణ, అంతే స్థాయిలో కాతరు క్యాంపులో లోకేష్ ►పార్టీపై పట్టుకు ఇద్దరు నేతల ప్రయత్నాలు ►తల్లి భువనేశ్వరీని తనతో పాటు చర్చల్లో కూర్చోపెడుతున్న లోకేష్ 10:50 AM బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా ► అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా. ► ఈ కేసులో విచారణను ఈనెల 20వ తేదీ వరకు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు. 10:00 AM చీమ చిటుక్కుమన్నా.. పట్టేస్తారు ►రాజమండ్రి సెంట్రల్ జైలులో భారీగా భద్రత పెంపు. ►జైలు బయట అదనంగా సీసీ కెమెరాల ఏర్పాటు. ►చంద్రబాబు భద్రతను స్వయంగా పరిశీలిస్తున్న జైలు శాఖ డీఐజీ రవికిరణ్. 9:00 AM ఇంటిని మరిపించేలా రోజువారీ కార్యకలపాలు ►రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు నాలుగు రోజు ►ఉదయం అల్పాహారం తీసుకున్న చంద్రబాబు ►అంతకు ముందు కాసేపు వ్యాయామం, పేపర్లు చదివిన చంద్రబాబు ►చంద్రబాబును కలిసేందుకు ములాఖత్‌కు రానున్న పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ, లోకేష్ 7:45 AM ► నేడు రాజమండ్రికి పవన్ కల్యాణ్, నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ. ► జైలులో ఉన్న చంద్రబాబుతో వీరు ములాఖత్. ► మధ్యాహ్నం 12 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్న లోకేష్, పవన్ కల్యాణ్, బాలకృష్ణ ► రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కట్టుదిట్టమైన భద్రత ► ఉదయం 10 గంటలకు రాజమండ్రికి చేరుకోనున్న పవన్, బాలకృష్ణ 7:30 AM ► నాలుగోరోజు రాజమండ్రి జైలులో చంద్రబాబు ► తెల్లవారుజామున నిద్రలేచిన చంద్రబాబు. ► జైలులో చంద్రబాబు యోగా, పేపర్ రీడింగ్ ► నేడు అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. ► ఈ కేసుపై విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు. ► అంగళ్లులో టీడీపీ నేతల దాడి కేసులో A1గా ఉన్న చంద్రబాబు. ► అన్నమయ్య జిల్లా, అంగళ్లు వద్ద జరిగిన విధ్వంసానికి సంబంధించి ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయలేకపోతున్నానని తెలిపారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని, ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదని, తనకు మాత్రం బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు న్యాయస్థానాన్ని కోరారు. ► ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించి బెయిల్స్ తెచ్చుకున్నప్పటికీ ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు మాత్రం హైకోర్టుకు రాలేదు. తనకేం కాదులే అనే ధీమాతో ఉన్న ఆయన.. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి, జైల్లో ఉండటంతో ఒక్కసారిగా మేల్కొన్నారు. ఎందుకైనా మంచిదని బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ►ఆగస్టు 4న యాత్ర ముసుగులో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతల హత్యకు కుట్ర పన్ని, మారణాయుధాలు, బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడిన ఘటనలపై చంద్రబాబు సహా 20 మందిపై కురబలకోట మండలం ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇతర నిందితుల్లో టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి, తిరుపతి ప్రాంతాలకు చెందిన నేతలు నిందితులుగా ఉన్నారు. దాదంవారిపల్లెకు చెందిన అంగళ్లు మార్కెట్ కమిటీ చైర్మన్ డీఆర్.ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ 120బి, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506, రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద ఎస్ఐ షేక్ ముబిన్తాజ్ కేసు నమోదు చేశారు. ►యాత్ర సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు, రైతులను చూసి చంద్రబాబు ఊగిపోయారు. ‘తమాషాగా ఉందా.. ఆ నా కొడుకులను తరమండిరా.. వేసేయండిరా వాళ్లని’ అని వేలేత్తి చూపించి టీడీపీ శ్రేణులను ఉసిగొల్పారు. వాహనంపై ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రులు దేవినేని ఉమా, ఎన్.అమరనాథ్‌రెడ్డి, మదనపల్లె మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్‌బాషా, దొమ్మలపాటి రమేష్, ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి తదితర నేతలు కూడా వైఎస్సార్సీపీ నేతలవైపు చేతులు చూపుతూ, కేకలు వేస్తూ హెచ్చరికలు చేస్తూనే.. సైగలతో దాడులకు ప్రేరేపించారు. ► మరికొందరు స్థానిక నేతలు ఈలలు వేస్తూ, తొడ గొడుతూ.. బూతులు తిడితూ కొట్టండి అంటూ దాడికి ప్రోత్సహించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఓ పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా టీడీపీ నేతలు ఈ దాడులు చేయించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా అప్పటికే సిద్ధం చేసుకున్న మారణాయుధాలు, రాళ్లు, కొడవళ్లు, ఇటుకలు, కట్టెలు, చెప్పులు, రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ► ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు, దాడిని అడ్డుకోబోయిన పోలీసులు కూడా గాయపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన బైసాని చంద్రశేఖర్‌రెడ్డి, వసంతరెడ్డి, అర్జున్‌రెడ్డి, మహేష్, ఓ విలేకరి శ్రీనివాసులు, ముదివేడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కేశవులు తీవ్రంగా గాయపడ్డారు. దాడితో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. రోడ్డుపై పగిలిన బాటిళ్లు, ఇటుకలు, కర్రలు పడి ఉన్నాయి. కొందరు స్థానికులు వైఎస్సార్సీపీ నేతలను రక్షించారు. లేనిపక్షంలో కొందరు హత్యకు గురయ్యేవారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
అంగళ్లు అల్లర్ల కేసులో టీడీపీ నేత శ్రీనివాసులు అరెస్ట్
మదనపల్లె: మాజీ సీఎం చంద్రబాబు ‘యుద్ధభేరి’ పేరుతో చేపట్టిన ప్రాజెక్ట్‌ల సందర్శన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో మదనపల్లె మండలం టీడీపీ అధ్యక్షుడు దేవరింటి శ్రీనివాసులును శనివారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపారు. ముదివేడు పిచ్చలవాండ్లపల్లె ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిలిపివేయాలని చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చిన నేపథ్యంలో... ఆగస్టు 4న చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటనలో నిరసన తెలిపేందుకు ఆయకట్టు రైతులు అంగళ్లుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులపై ఆగ్రహం వ్యక్తంచేసిన చంద్రబాబు వారిని కొట్టాలని, చంపాలని ఆవేశంతో కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీంతో రైతులపై టీడీపీ నాయకులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీనిపై అంగళ్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతిరెడ్డి ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, 20మందికి పైగా టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదుచేశారు. వీరిలో కొందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపగా, మరికొందరు పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం దేవరింటి శ్రీనివాసులును రూరల్ సీఐ శివాంజనేయులు అరెస్ట్ చేశారు. ఆయనకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా, రిమాండ్ విధించారు. -
‘అంగళ్లు’ దాడుల కేసులో ఎ1గా చంద్రబాబు
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు సంబంధించి టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ప్రథమ ముద్దాయిగా పోలీసులు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 4న యాత్ర ముసుగులో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతల హత్యకు కుట్ర పన్ని, మారణాయుధాలు, బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడిన ఘటనలపై చంద్రబాబు సహా 20 మందిపై కురబలకోట మండలం ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఈ కేసు నమోదైంది. ఇతర నిందితుల్లో టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి, తిరుపతి ప్రాంతాలకు చెందిన నేతలు నిందితులుగా ఉన్నారు. దాదంవారిపల్లెకు చెందిన అంగళ్లు మార్కెట్ కమిటీ చైర్మన్ డీఆర్.ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ 120బి, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506, రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద ఎస్ఐ షేక్ ముబిన్తాజ్ కేసు నమోదు చేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు వేచి ఉండగా ప్రాజెక్టుల సందర్శన యాత్ర చేపట్టిన చంద్రబాబు ఈనెల 4న అంగళ్లుకు వస్తున్నారని తెలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతిరెడ్డి, ఎంపీపీ దస్తగిరి, జెడ్పీటీసీ జ్యోతి భర్త బైసాని చంద్రశేఖర్‌రెడ్డి, రవిశేఖర్‌రెడ్డి, కులశేఖర్‌రెడ్డి తదితరులు అంగళ్లు కూడలి సమీపంలోని రాయచోట రోడ్డు వద్దకు చేరుకున్నారు. పిచ్చలవాండ్లపల్లె సాగు, తాగ నీటి రిజర్వాయర్ పనులను చంద్రబాబు కోర్టు ద్వారా నిలిపివేయించారని, ఈ చర్యను నిరసిస్తూ నల్ల కండువాలు ధరించి శాంతియుత పద్ధతిలో ఆయనకు వినతిపత్రం ఇవ్వాలని వేచి ఉన్నారు. వారికి రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు మద్దతుగా వచ్చారు. ఊగిపోయి.. దాడులకు ఉసిగొల్పి.. మధ్యాహ్నం చంద్రబాబు యాత్ర కూడలిలోకి చేరుకుంది. అక్కడ నల్ల కండువాలతో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు, రైతులను చూసి చంద్రబాబు ఊగిపోయారు. ‘తమాషాగా ఉందా.. ఆ నా కొడుకులను తరమండిరా.. వేసేయండిరా వాళ్లని’ అని వేలేత్తి చూపించి టీడీపీ శ్రేణులను ఉసిగొల్పారు. వాహనంపై ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రులు దేవినేని ఉమా, ఎన్.అమరనాథ్‌రెడ్డి, మదనపల్లె మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్‌బాషా, దొమ్మలపాటి రమేష్, ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి తదితర నేతలు కూడా వైఎస్సార్సీపీ నేతలవైపు చేతులు చూపుతూ, కేకలు వేస్తూ హెచ్చరికలు చేస్తూనే.. సైగలతో దాడులకు ప్రేరేపించారు. మరికొందరు స్థానిక నేతలు ఈలలు వేస్తూ, తొడ గొడుతూ.. బూతులు తిడితూ కొట్టండి అంటూ దాడికి ప్రోత్సహించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఓ పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా టీడీపీ నేతలు ఈ దాడులు చేయించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా అప్పటికే సిద్ధం చేసుకున్న మారణాయుధాలు, రాళ్లు, కొడవళ్లు, ఇటుకలు, కట్టెలు, చెప్పులు, రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు, దాడిని అడ్డుకోబోయిన పోలీసులు కూడా గాయపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన బైసాని చంద్రశేఖర్‌రెడ్డి, వసంతరెడ్డి, అర్జున్‌రెడ్డి, మహేష్, ఓ విలేకరి శ్రీనివాసులు, ముదివేడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కేశవులు తీవ్రంగా గాయపడ్డారు. దాడితో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. రోడ్డుపై పగిలిన బాటిళ్లు, ఇటుకలు, కర్రలు పడి ఉన్నాయి. కొందరు స్థానికులు వైఎస్సార్సీపీ నేతలను రక్షించారు. లేనిపక్షంలో కొందరు హత్యకు గురయ్యేవారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆధారాలతో ఫిర్యాదు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతిరెడ్డి ఆధారాలతో సహా చంద్రబాబు తదితరులపై ఫిర్యాదులో చేశారు. అంగళ్లు రోడ్‌షోలో చంద్రబాబు రెచ్చగొట్టే ప్రసంగాలు, ఇతర నాయకుల చర్యలను పెన్‌డ్రైవ్, సీడీలో ముదివేడు పోలీసులకు అందజేశారు. ఈ ఫిర్యాదు, ఆధారాల మేరకు పోలీసులు చంద్రబాబు ఏ1గా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముందస్తు ప్రణాళిక, నేరపూరిత కుట్ర, అల్లర్లలో భాగంగా మారణాయుధాలతో తమపై దాడిì చేసిన చంద్రబాబు అనుచరులు, దాడులకు పురమాయించిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఉమాపతిరెడ్డి కోరారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోనూ ఇవే అంశాలను పేర్కొన్నారు. చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కేసు : అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్‌రావు రాయచోటి టౌన్ : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై ముదివేడు పోలీసు స్టేషన్లో హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్ రావు చెప్పారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అంగళ్లులో జరిగిన సంఘటనపై ఉమాపతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామని తెలిపారు. ఈనెల 4 న మారుణాయుధాలు, ఐరన్ రాడ్లు, రాళ్లు, ఇటుకలు, కర్రలతో వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని వివరించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ములకలచెరువు పోలీసు స్టేషన్లో బాబుపై మరో కేసు ములకలచెరువు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అన్నమయ్య జిల్లా ములకలచెరువు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఈ నెల 4న ములకలచెరువులో జరిగిన రోడ్ షోలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసు నమోదైంది. ఈ ఘటనపై ఇన్చార్జి సీఐ శివాంజనేయులు సమగ్ర విచారణ జరిపిన అనంతరం చంద్రబాబును ఏ–7 నిందితుడిగా కేసు నమోదు చేశారు. -
'అన్ని నన్నే చేయమంటే సమస్యలు వస్తాయి'
అంగుళ్లు: ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు మేలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ సీఏం చంద్రబాబు చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా చిత్తూరు జిల్లా ప్రజలకు తాగు, సాగునీరు అందిస్తామన్నారు. చిత్తూరు జిల్లా అంగుళ్లులో బుధవారం జరిగిన 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అన్ని తననే చేయమని చెప్పి ప్రజలు ఇంట్లో పడుకుంటే సమస్యలు వస్తాయని వ్యాఖ్యానించారు. ప్రజలు కలిసివస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడాలని అభిప్రాయపడ్డారు. సెల్ఫోన్లపై ఉన్న శ్రద్ధ మరుగుదొడ్ల నిర్మాణంపై పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో సామూహిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని హామీయిచ్చారు. గ్రామాల్లోనూ చెత్త సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.