breaking news
Andrea Leadsom
-
బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే
-
బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే
రేపు ప్రమాణ స్వీకారం: కామరాన్ ప్రకటన లండన్ : బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా థెరిసా మే బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రస్తుత ప్రధాని డేవిడ్ కామెరాన్ సోమవారం ప్రకటించారు. థెరిసా (59) ప్రస్తుతం దేశ హోంమంత్రిగా ఉన్నారు. ఉక్కు మహిళగా పేరుపడ్డ మార్గరెట్ థాచర్ అనంతరం బ్రిటన్ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టనున్న మహిళా నేత థెరిసాయే. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ (బ్రెగ్జిట్) జూన్ 23న నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో తీర్పు వెల్లడవటంతో.. బ్రెగ్జిట్‌ను బలంగా వ్యతిరేకించిన కామెరాన్ తాను ప్రధాని పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈయూతో బ్రెక్జిట్ చర్చలను ముందుకు తీసుకెళ్లే అంశాన్ని కొత్త ప్రధాని చూస్తారని ఆయన అప్పుడు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కామెరాన్ తర్వాత ప్రధాని పదవి కోసం అధికార కన్సర్వేటివ్ పార్టీలో.. హోంమంత్రి థెరిసా మే, ఇంధనశాఖ మంత్రి ఆంద్రియా లీడ్సమ్ల (53) మధ్య పోటీ నెలకొంది. అయితే నాటకీయంగా సోమవారం ఉదయం ఆంద్రియా తాను పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు థెరిసా బలమైన నాయకురాలంటూ ఆమెకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. దీంతో.. థెరిసా ఒక్కరే బరిలో మిగిలారు. ఈ నేపథ్యంలో కన్సర్వేటివ్ పార్టీ బోర్డు సభ్యులు 22 మంది సోమవారం నాడే అత్యవసరంగా సమావేశమై.. పోటీ లేనందున ఇక ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదంటూ.. థెరిసా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో కామెరాన్ సోమవారం తన అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద మీడియాతో మాట్లాడారు. థెరిసా బుధవారం ప్రధానిగా బాధ్యతలు చేపడతారన్నారు. తాను మంగళవారం తన చివరి మంత్రివర్గ భేటీకి హాజరవుతానని, బుధవారం ప్రధానిగా తన చివరి ప్రశ్నల కోసం హౌస్ ఆఫ్ కామన్స్‌కు హాజరవుతానని.. ఆ తర్వాత నబకింగ్హామ్ పాలస్‌కు వెళ్లి రెండో ఎలిజబెత్ రాణికి రాజీనామా సమర్పిస్తానన్నారు. ‘థెరిసా బలమైన నాయకురాలు. రానున్న సంవత్సరాల్లో మన దేశానికి అవసరమైన నాయకత్వాన్ని అందించటంలో ఆమె చాలా సమర్థులు’ అని కితాబునిచ్చారు. -
కాబోయే ప్రధాని ఆమెనే
బ్రిటన్ పీఠాన్ని అధిష్టంచనున్న థెరిసా మే బ్రెగ్జిట్ అనుకూల రెఫరెండం తీర్పుతో రాజకీయ అనిశ్చితిలో మునిగిపోయిన బ్రిటన్ లో తదుపరి ప్రధానమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. డేవిడ్ కామెరాన్ వారసురాలిగా బ్రిటన్ పగ్గాలను థెరిసా మే చేపట్టనున్నారు. నాటకీయ పరిణామాల నడుమ ఆమె ప్రధాన పోటీదారు అయిన ఆండ్రియా లీడ్సమ్ పోటీ నుంచి వైదొలగడంతో ప్రధాని రేసులో ఇప్పుడు థెరిసా ఒక్కరే నిలిచారు. బ్రిగ్జిట్ ఫలితాల నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకొంటానని కామెరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని పదవి రేసులో ఆండ్రియా, థెరిసా ప్రధాన పోటీదారులుగా నిలిచారు. థెరిసాకు పిల్లలు ఉండటం వల్ల ఆమె ప్రధాని పదవిని సమర్థంగా నిర్వహించలేరంటూ ఆండ్రియా ఇటీవల చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గట్టిపోటీ ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఆండ్రియా సోమవారం ఊహించనిరీతిలో ప్రకటన చేశారు. ప్రధాని రేసు తుదకంటూ కొనసాగడం సబబు కాదని, కాబట్టి తాను ఈ రేసు నుంచి తప్పుకుంటానని ప్రకటించి అందరినీ విస్మయ పరిచారు. బ్రిటన్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని బ్రెగ్జిట్ ప్రక్రియను థెరిసా సమర్థంగా నిర్వహించగలరని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో త్వరలోనే బ్రిటన్ ప్రధానిగా థెరిసా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.