breaking news
alms
-
వదిలేస్తున్నారా? వెంట తెచ్చుకుంటున్నారా?
నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు. ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ –భవతి భిక్షామ్ దేహి – అని అడుగుతున్నారు. ఒక ఇంట్లో నుండి – చేయి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది. ఒకామె సగం పాడయిపోయిన అరటిపండు వేసింది. మరొకామె ‘‘చూడడానికి దుక్కల్లా ఉన్నారు. పని చేసుకుని బతకలేరా?’ అంటూ ఒంటికాలిమీద లేచి తిట్టింది. శాపనార్థాలు పెట్టింది. ఒకరిద్దరు భిక్షాపాత్రల్లో బియ్యం పోశారు. పాడయిపోయిన భాగాన్ని తొలిగించి – బాగున్నంతవరకు దారిలో కనపడిన ఆవుకు అరటిపండును తినిపించారు. ఆవు వారి చేతిని ప్రేమగా నాకింది. సన్యాసులందరూ మఠం చేరుకుని, వారి వారి పనుల్లో మునిగిపోయారు. మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు గుమ్మానికి ఆనుకుని కూర్చుని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు. నెమ్మదిగా అతడిదగ్గరికి వెళ్లి కారణం ఏమిటని అడిగాడు. ‘‘పొద్దున భిక్షకు వెళ్ళినప్పుడు ఒక ఇంటావిడ తిట్టిన తిట్లు, పెట్టిన శాపనార్థాలు, ప్రదర్శించిన కోపం నాకు పదే పదే గుర్తుకొచ్చి ముల్లులా గుచ్చుకుంటోంది. ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను స్వామీ’’ – అన్నాడు. అతని కళ్ల నిండా నీరు. వివేకానందుడు అతన్ని ‘‘పొద్దున మనకు భిక్షలో ఏమేమి వచ్చాయి?’’ అనడిగాడు. ‘‘సగం పాడయిపోయిన అరటి పండు, కొద్దిగా బియ్యం వచ్చాయి’’ – చెప్పాడతను. ‘‘అవును కదూ, వాటిలో మనం మఠానికి ఏమి తెచ్చుకున్నాం?’’ అడిగాడు మళ్లీ. బాగున్న అరటిపండును అవుకు పెట్టేసి, బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం’’‘‘మనం తెచ్చుకున్నవాటిలో తిట్లే లేవు కాబట్టి అవి నీవి కావు. నీతో రాలేదు. మనం తీసుకున్నది అరటిపండు, బియ్యమే కానీ, తిట్లను తీసుకోలేదు – వాటిని ఇక్కడికి మోసుకురాలేదు. రానిదానికి – లేనిదానికి ఎందుకని బాధపడుతున్నావు?’’ అనునయంగా అడిగాడతన్ని. అతనిలో ఆవరించిన దిగులు ఏదో తొలగిపోయినట్లయి, ‘‘నిజమే స్వామీ!’’ అంటూ తలపంకించాడు సంతోషంగా. – డి.వి.ఆర్. -
పెన్షన్ ప్రభుత్వాల భిక్షకాదు
♦ ఏఐఎస్జీఈఎఫ్ చైర్మన్ ముత్తు సుందరం ♦ కాంపన్సేటరీ పెన్షన్ స్కీం రద్దు కోసం 2న దేశవ్యాప్త సమ్మె సాక్షి, హైదరాబాద్: పెన్షన్ అనేది ఉద్యోగులకు ప్రభుత్వాలు వేసే భిక్ష కాదని, అది రాజ్యాంగబద్ధమైన హక్కు అని ఆలిండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐఎస్జీఈఎఫ్) చైర్మన్ ముత్తుసుందరం అన్నారు. కాంపన్సేటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు, పాత పెన్షన్ స్కీం అమలు కోసం ఉద్యోగులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 2న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలన్నారు. సీపీఎస్ రద్దు, ఐటీ పరిమితి పెంపు, ఖాళీల భర్తీ వంటి డిమాండ్లతో ఈ సమ్మె నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన సదస్సులో ముత్తుసుందరం ప్రసంగించారు. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు ఆదేశాల మేరకే కేంద్ర ప్రభుత్వం 2004 సెప్టెంబర్ 1 తరువాత నియమితులైనవారికి పాత పెన్షన్ స్కీంను రద్దు చేసి కాంపన్సేటరీ పెన్షన్ స్కీంను అమల్లోకి తెచ్చిందని విమర్శించారు. ఉద్యోగుల సాంఘికభద్రతకు ఉద్దేశించిన పెన్షన్ను ప్రభుత్వాలు ఆర్థికభారం పేరుతో ఉద్యోగులకు దక్కకుండా చేస్తున్నాయని అన్నారు. టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. తమిళనాడు తరహాలో సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ కోసం టీఎన్జీవో కృషి చేస్తోందని చెప్పారు. టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ రద్దు, దేశవ్యాప్త సమ్మె కోసం జిల్లాలవారీగా సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో టీఎన్జీవో నేతలు హమీద్, రేచల్ తదితరులు మాట్లాడారు. -
ప్రత్యేక హోదా భిక్ష కాదు.. ఆంధ్రుల హక్కు