breaking news
alliance ends
-
ట్రంప్ ఉపసంహరణ తంత్రం
వాషింగ్టన్: తమ అగ్రరాజ్య ఆధిపత్యాన్ని ధిక్కరిస్తున్న దేశాలపైకి సైన్యాన్ని నడిపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం సంబంధిత మెమోరాండంపై సంతకం చేశారు. ఆయా సంస్థల అవసరం ఇకపై లేదని, అవి అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేస్తున్నాయని ట్రంప్ తేలి్చచెప్పారు. ఇందులో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు, పలు ఇతర సంస్థలతోపాటు భారత్, ఫ్రాన్స్ సారథ్యంలోని ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ ఉంది. వాటితో అమెరికాకు ఎలాంటి సంబంధం ఉండబోదని ట్రంప్ స్పష్టంచేశారు. తమ జాతీయ ప్రయోజనాలు, భద్రత, ఆర్థిక ప్రగతి, సార్వ¿ౌమత్వానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న సంస్థల్లో సభ్యత్వం కొనసాగించడం, భాగస్వామిగా పనిచేయడం, ఆర్థిక సాయం అందించడం అర్థంలేని పని అని అన్నారు. అమెరికా పట్ల దురుద్దేశాలతో వ్యవహరిస్తున్న సంస్థలకు తమ నిధులు ఎందుకివ్వాలని నిలదీశారు. అమెరికా సభ్యత్వం ఉపసంహరించుకున్న వాటిలో ఐరాస సంస్థలు 31, ఇతర సంస్థలు 35 ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థల నుంచి ఉపసంహరణ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సంబంధిత ఎగ్జిక్యూటివ్ డిపార్టుమెంట్లు, ఏజెన్సీలను ట్రంప్ ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. ట్రంప్‌ను తప్పుపట్టొద్దు: రూబియో మరికొన్ని అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా తప్పుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ట్రంప్ ఆ దిశగా ఆలోచన చేస్తున్నారని విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచి్చన హామీని ట్రంప్ అమలు చేస్తున్నారని, ఆయనను తప్పు పట్టాల్సిన పనిలేదని అన్నారు. అమెరికాను వ్యతిరేకించే శక్తులకు నిధులు ఇవ్వడం ఆపేస్తానంటూ ట్రంప్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ‘అమెరికా, అమెరికన్స్ ఫస్ట్’ అనేదే తమ నినాదం, విధానమని ఉద్ఘాటించారు. అమెరికా ప్రజల రక్తం, స్వేదం, కష్టార్జితాన్ని మరెవరికో ధారపోయడం కొనసాగదని రూబియో పేర్కొన్నారు. ఇప్పటికే బిలియన్ డాలర్ల సొమ్ము విదేశాలకు తరలిపోయిందని, అమెరికా ప్రజలే నష్టపోయారని తెలిపారు. తమ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ, దెబ్బకొట్టాలని చూస్తున్న సంస్థలకు నిధులిచ్చే ప్రసక్తే లేదని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్జ్ స్పష్టంచేశారు. సౌర కూటమికి ఎదురుదెబ్బ? అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ) నుంచి తప్పుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. సౌర విద్యుత్, సౌర ఇంధన వనరులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రతికూల వాతావరణ మార్పులను, దు్రష్పభావాలను అరికట్టాలన్న లక్ష్యంతో ఈ కూటమి ఏర్పాటైంది. భారత్, ఫ్రాన్స్ ఇందుకు సంయుక్తంగా చొరవ తీసుకున్నాయి. 2015లో పారిస్‌లో జరిగిన కాప్–21 సదస్సు సందర్భంగా కూటమిని ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం భారత్‌లోనే ఉంది. ప్రస్తుతం 90కి పైగా దేశాలకు ఐఎస్ఏలో సభ్యత్వం కల్పించారు. 2030 నాటికి ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలన్నది కూటమి లక్ష్యం. ముఖ్యమైన దేశం అమెరికా ఉపసంహరించుకోవడంతో ఐఎస్ఏ ఉద్దేశం నీరుగారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక రకంగా ట్రంప్ నిర్ణయం సౌర కూటమికి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఏయే సంస్థల నుంచి.. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్(ఉక్రెయిన్), యూఎన్ డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, యూఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఎకనామిక్ కమిషన్ ఫర్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబియన్, యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, యూఎన్ పాపులేషన్ ఫండ్ తదితర సంస్థల నుంచి తాము ఉపసంహరించుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. -
కుదరని ఆప్, కాంగ్రెస్ పొత్తు
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్, ఆప్ ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. కురుక్షేత్ర ప్రాంతంలో ఎక్కువ సీట్లు కావాలని ఆప్ పట్టుబట్టింది. మొత్తంగా 10 సీట్లు కావాలని కోరగా ఐదుకు మించి ఇచ్చేది లేదని కాంగ్రెస్ తెగేసి చెప్పింది. దీంతో చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. ఎవరికి వారే పోటీచేయడం ఖాయమైంది. దీంతో ఆప్ 20 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను సోమవారం విడుదలచేసింది. జాబితా విడుదలపై ఆప్ హరియాణా చీఫ్ సుశీల్ గుప్తా మాట్లాడారు. ‘‘ సోమవారం సాయంత్రంకల్లా మీ నిర్ణయం చెప్పాలని కాంగ్రెస్‌కు స్పష్టంచేశాం. అయినా కాంగ్రెస్ నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదు. సెప్టెంబర్ 12కల్లా నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. వాళ్ల కోసం నిరీక్షణ ముగిసింది. అందుకే ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నాం’ అని ఆయన అన్నారు. ఆప్ తొలి జాబితా ప్రకారం ఆప్ సీనియర్ నేత అనురాగ్ ధండా కలాయత్‌లో పోటీచేస్తారు. బెడిసికొట్టిన చర్చలుబీజేపీకి ఉమ్మడిగా ఓడిద్దామని ఆప్, కాంగ్రెస్ భావించాయి. అందులోభాగంగానే పొత్తు కోసం చర్చలకు సిద్ధమయ్యాయి. కొన్ని చోట్ల ఉమ్మడిగా ఒక్కరినే నిలబెట్టాలని భావించాయి. కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, దీపక్ బాబరియా, ఆప్ నుంచి రాఘవ్ చద్దా తదితరులు కొద్ది రోజుల క్రితమే చర్చలు మొదలెట్టారు. అయితే కొన్ని స్థానాల్లో మేమంటే మేము పోటీచేస్తామని ఆప్, కాంగ్రెస్ పట్టుబట్టడంతో ఏకాభిప్రాయం కష్టమైంది. హరియాణా అసెంబ్లీకి అక్టోబర్ ఐదో తేదీన పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. -
‘అదొక జాతి వ్యతిరేక, అసహజ పొత్తు’
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో పొత్తు తెంచుకుంటున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించిన నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పీడీపీతో పొత్తు విరమించుకున్నట్లు బీజేపీ కశ్మీర్ ఇంచార్జి రాం మాధవ్ ప్రకటించగానే బీజేపీ మిత్రపక్షం శివసేన తనదైన శైలిలో స్పందించింది. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అదొక జాతి వ్యతిరేక, అసహజ పొత్తు అంటూ’ వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఎక్కువకాలం నిలవదని ఉద్ధవ్ ఠాక్రే ఎప్పుడో చెప్పారన్నారు. ఒకవేళ పీడీపీతో కలిసి ఉంటే 2019 ఎన్నికల్లో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియకనే బీజేపీ ఈవిధంగా వ్యవహరించిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. కశ్మీర్లో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై స్పందించిన.. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కేవలం రాజకీయ లబ్ది కోసమే పీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందంటూ విమర్శించారు. ‘అవకాశవాది బీజేపీ... ముందు పీడీపీతో జతకట్టింది. ఇప్పుడు వైదొలిగింది. రెండూ కూడా రాజకీయ లబ్ది కోసమే... ఇలా అయితే దేశం ఎలా మారుతుందని’ ఆయన ట్వీట్ చేశారు. పీడీపీతో జతకట్టే ఆలోచన లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. An opportunistic BJP First an opportunistic alliance with PDP Now an opportunistic breakaway Both acts of political immorality Kaise Desh badlega ? — Kapil Sibal (@KapilSibal) June 19, 2018 -
శివసేనతో బిజెపి తెగతెంపులు!
ముంబై: శివసేన పార్టీతో బిజెపి తెగతెంపులు చేసుకుంది. ఈ రెండు పార్టీల మధ్య 25 ఏళ్లుగా కొనసాగుతున్న పొత్తుకు బ్రేక్ పడింది. సీట్ల సర్ధుబాటు విషయమై ఈ రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. అయితే సర్ధుబాట్లు కుదిరినట్లు నిన్న తెలిసింది. ఈ రోజు తెగతెంపులు చేసుకున్నట్లు బిజెపి మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. సమస్యను అధిగమించేందుకు శతవిధాల కృషి చేసినట్లు ఆయన తెలిపారు. సయోధ్య కోసం ఎంత ప్రయత్నించినా ఫలితంలేదని పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో సొంతగా పోటీ చేయక తప్పడంలేదని దేవేంద్ర తెలిపారు. **


